हिन्दी | Epaper
తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 తిరువనంతపురంలో నేడు 3వ T20 షెఫాలీ వర్మ అరుదైన రికార్డు నేటి నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం నేడు విశాఖలో ఉమెన్స్ రెండో టీ20 శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం నేడు T20 ప్రపంచ కప్ టీం ప్రకటన టీ20 సిరీస్ టీమిండియాదే నేడే 5వ T20 IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20

KL Rahul: పంత్ కు కేఎల్ రాహుల్ సలాం.. వీడియో వైరల్

Sharanya
KL Rahul: పంత్ కు కేఎల్ రాహుల్ సలాం.. వీడియో వైరల్

ఇంగ్లాండ్‌ (England) తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ (Test match) భారత అభిమానులకు నిజమైన ఉత్సాహాన్ని అందించింది. మొదటి రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ అందరూ అద్భుతంగా రాణించగా, ప్రత్యర్థి జట్టు ఏ దశలోనూ ఆధిపత్యాన్ని సాధించలేకపోయింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరియు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకాలు అభిమానులను అలరించగా, గాయాల నుంచి తిరిగొచ్చిన రిషభ్ పంత్ తన దూకుడుతో మరోసారి మైదానంలో హంగామా చేశాడు.

గిల్, జైస్వాల్ జోరు:

టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill), యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుత శతకాలతో చెలరేగగా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant) దూకుడైన అర్ధశతకంతో అజేయంగా నిలిచాడు. దీంతో శుక్రవారం హెడింగ్లీలో ఆట ముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల భారీ స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది.

రిషభ్ పంత్ రెంటర్న్ రికార్డు:

ఇన్నింగ్స్ మూడో భాగంలో వచ్చిన పంత్ తనదైన శైలిలో ఆడుతూ కేవలం 52 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. SENA (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అత్యధిక పరుగులు చేసిన భారత వికెట్ కీపర్ బ్యాటర్‌గా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును పంత్ అధిగమించాడు. పంత్ ఇప్పటివరకు ‘సేనా’ దేశాల్లో 27 మ్యాచ్‌లలో 38.80 సగటుతో 1,746 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఆరు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇవాళ‌ రెండో రోజు ఆటలో భారత్ ఇదే జోరును కొనసాగించి భారీ స్కోరు సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

రాహుల్ నమస్కారం – సోషల్ మీడియాలో వైరల్:

పంత్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళుతున్న సమయంలో భారత ఆటగాళ్లందరూ చప్పట్లతో వారికి ఘన స్వాగతం పలికారు. అయితే, పంత్ మెట్లు ఎక్కుతుండగా, ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు చేతులు జోడించి అతనికి నమస్కరిస్తూ అభినందించిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పంత్ సాహసోపేతమైన బ్యాటింగ్‌కు రాహుల్ ఈ విధంగా ప్రశంసలు కురిపించాడు. ఈ వీడియోను బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.

Read also: Faf duPlessis : మేజర్ లీగ్ క్రికెట్‌లో ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత శతకం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870