Kisna Diamond & Gold Jewelery brings joy with its Shop and Win Car offer

కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ “షాప్ అండ్ విన్ కార్” ఆఫర్

గుంటూరు : భారతీయ ఆభరణాల పరిశ్రమలో సుప్రసిద్ధమైన హరి కృష్ణ గ్రూప్ యొక్క ప్రముఖ బ్రాండ్ అయిన కిస్నా డైమండ్ & గోల్డ్ జ్యువెలరీ , సత్తెనపల్లిలోని శ్రీ శివ శంకర జ్యువెలరీ మార్ట్‌లో జరిగిన ఒక కార్యక్రమం లో “షాప్ అండ్ విన్ కార్” పోటీ లక్కీ డ్రా విజేత ను ప్రకటించింది . ఈ కార్యక్రమం కస్టమర్లు మరియు అతిథుల నుండి అపూర్వ స్పందన ను అందుకుంది. ఈ సందర్భంగా షాప్ అండ్ విన్ కార్ విజేతను వెల్లడించారు, సరికొత్త కారును బహుమతిగా గెలుచుకున్న అదృష్టవంతులైన విజేతగా శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్– గుంటూరు లో కొనుగోలు చేసిన శ్రీమతి శ్వేత నిలిచారు.

రిటైల్ భాగస్వామి, శ్రీ లక్ష్మీ జ్యువెలర్స్ – గుంటూరు కు చెందిన శ్రీ జె.వి.సబ్బారావు తన సంతోషాన్ని పంచుకుంటూ “కిస్నాతో ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో భాగం కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. మా కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి మరియు వారి ఆనందాన్ని చూడటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. విజేతకు అభినందనలు, మరియు భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను నిర్వహించడానికి మేము ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

image
image

హరి కృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఘనశ్యామ్ ధోలాకియా మాట్లాడుతూ ” మా కస్టమర్ల నమ్మకం మరియు ప్రేమకు మా కృతజ్ఞతా చిహ్నం, ‘షాప్ అండ్ విన్ కార్’ పోటీ . గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్నందుకు శ్రీమతి శ్వేతకు అభినందనలు మరియు ఉత్సాహంగా పాల్గొన్నందుకు మా కస్టమర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అని అన్నారు.

కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ డైరెక్టర్ శ్రీ పరాగ్ షా మాట్లాడుతూ ..ఈ కార్యక్రమం మా కస్టమర్ల జీవితాల్లోకి ఉత్సాహాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చింది. వారి ప్రేమ మరియు మద్దతుకు మేము కృతజ్ఞులం. భవిష్యత్తులో వారికి మరిన్ని చిరస్మరణీయమైన మరియు ఫలదాయకమైన అనుభవాలను తీసుకువస్తామని మేము హామీ ఇస్తున్నాము” అని అన్నారు.

Related Posts
బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం..
Union Cabinet approves budget

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్‌ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి ముందు మంత్రిమండలి ఆమోదం Read more

SSMB29 స్టోరీ హింట్ ఇచ్చిన విజయేంద్రప్రసాద్
vijendraprasad

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ చిత్రం గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాపై Read more

2028 లో ప్రారంభం కానున్న శుక్రయాన్ మిషన్..
isro shukrayaan

భారతదేశం 2028 లో ప్రారంభం కానున్న "శుక్రయాన్" అనే వెనస్ ఆర్బిటర్ మిషన్‌తో ఒక ముఖ్యమైన స్పేస్ మైల్‌స్టోన్‌ను సాధించడానికి సిద్ధమవుతోంది.ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) Read more

కొనసాగుతున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్
Ongoing Haryana and Jammu Kashmir Election Counting

న్యూఢిల్లీ : యావత్ దేశం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. Read more