Kim sister Kim Yo Jong warns America

అమెరికాకు కిమ్ సోదరి కిమ్ యో జోంగ్‌ హెచ్చరికలు

ప్యోంగ్యాంగ్ : ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్‌ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్‌ అమెరికాకు హెచ్చరికలు చేశారు. తామూ రెచ్చగొట్టే చర్యలు చేపడతామని బెదిరించారు. ఆయుధ పరీక్ష కార్యకలాపాలను మరింత తీవ్రతరం చేస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. దక్షిణ కొరియా- అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో నిత్యం ఉద్రిక్త వాతావరణమే ఉంటుంది. ద.కొరియా-యూఎస్ సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహంగా కిమ్ ప్రభుత్వం భావిస్తోంది.

Advertisements
అమెరికాకు కిమ్ సోదరి కిమ్

ఈ చర్య ఘర్షణాత్మక ఉన్మాదానికి ప్రతీక

ద.కొరియాలోని బుసాన్ పోర్ట్‌లో తాజాగా అమెరికాకు చెందిన విమాన వాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. అమెరికాలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉ.కొరియాపై రాజకీయంగా, సైనికంగా రెచ్చగొట్టే చర్యలను ముమ్మరం చేసింది. గత ప్రభుత్వ (బైడెన్‌ ప్రభుత్వం) శత్రుత్వ వైఖరినే ఇది ముందుకు తీసుకెళ్తోంది అని జోంగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ చర్య ఘర్షణాత్మక ఉన్మాదానికి ప్రతీక అని, దీటుగా ప్రతిస్పందిస్తామని స్పష్టంచేశారు.

కవ్వించేవారిపై చర్యలు

ఆదివారం ఈ విమాన వాహక నౌక బుసాన్ తీరానికి రాగా.. గతనెల ఈ రేవులో అమెరికా అణ్వాయుధ జలాంతర్గామిని నిలిపింది. దీనిని ఉ.కొరియా తీవ్రంగా ఖండించింది. ఘర్షణ కోసం అమెరికా బలమైన ఉన్మాదానికి ఇది అద్దం పడుతోంది. వాషింగ్టన్‌ ప్రమాదకర కవ్వింపు చర్యలతో మేము ఆందోళన చెందుతున్నాం. ఇది కొరియా ద్వీపకల్పం చుట్టుపక్కల తీవ్రమైన సైనిక ఘర్షణకు దారితీయొచ్చు. కవ్వించేవారిపై చర్యలు తీసుకొనే మా చట్టబద్ధమైన హక్కును కచ్చితంగా వాడుకొంటాము అని ఉత్తర కొరియా రక్షణశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. అమెరికా గుడ్డిగా తన బలాన్ని నమ్ముకొంటోందని వ్యాఖ్యానించింది.

Related Posts
నేడు సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న ఒమ‌ర్ అబ్దుల్లా..
Omar Abdullah will take oath as CM today

న్యూఢిల్లీ: జ‌మ్మూక‌శ్మీర్ సీఎంగా ఈరోజు ఒమ‌ర్ అబ్దుల్లా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. దీని కోసం భారీ ఏర్పాట్లు చేశారు. శ్రీన‌గ‌ర్‌లో ఉన్న షేర్ యే క‌శ్మీర్ ఇంట‌ర్నేష‌న‌ల్ Read more

బాబోయ్.. రూ.90 వేలకు చేరిన బంగారం
ఆకాశాన్ని తాకిన బంగారం ధరలు! 10 గ్రాముల పసిడి రూ. 90,450

గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు మరోసారి రికార్డు స్థాయికి చేరాయి. దేశీయ బులియన్ మార్కెట్లలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ. Read more

Suniel Shetty: మనవరాలు పుట్టడంతో భావోద్వేగానికి గురైన సునీల్ శెట్టి
Suniel Shetty: మనవరాలు పుట్టడంతో భావోద్వేగానికి గురైన సునీల్ శెట్టి

ప్రముఖ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ప్రస్తుతం తన జీవితంలో ఒక కొత్త మైలురాయిని అందుకున్నారు. సినిమాలు, వ్యాపారం, సక్సెస్, తాతగా ప్రమోషన్ అన్న మాటలు ఆయన Read more

Telangana CM : సీఎంను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తుంది – ఎంపీ అర్వింద్
We will not let BJP set foot in Telangana.. Revanth key comments

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించేలా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ Read more

×