Two Birds One Stone:తెల్లవారకముందే వచ్చిన కుందేలును చూసిన కోతి,
“రా మామా, నీకోసం మామిడిపండ్లు, పనసతొనలు తీసుకువచ్చాను” అని చెట్టుదిగి వచ్చి కుందేలుకు అందించాడు కోతి.
“మామా, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటే ఏమిటి?” అన్నాడు.

“అల్లుడు, ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే దాన్ని కథ రూపంలో చెపుతాను, విను.
రామాపురం అనే ఊరిలో శివయ్య అనే అతను ఒంటి ఎద్దు బండితో ఉదయాన్నే రైస్ మిల్లు (Rice mill)వద్దకు వెళ్లి అక్కడ ఉన్న ధాన్యాన్ని మిల్లు వారు పంపిన దగ్గరకు చేరవేస్తూ ఉండేవాడు.
ఇంటివద్ద శివయ్య భార్య నిత్యవసర వస్తువుల అంగడి నడుపుతుంది.
ప్రతి ఆదివారం రైస్ మిల్లు సెలవు కావడంతో, ఆరోజు తమ ఊరి సమీపంలోని అడవికి వెళ్లి ఎండు వెదురు గడలు కొట్టుకుని బండిపై వేసుకుని, అక్కడకు నాలుగు కిలోమీటర్ల దూరంలోని సిరిపురంలోని వడ్రంగికి బండిలోనీ వెదురు గడలు ఇచ్చి, గతవారం వడ్రంగికి ఇచ్చిన వెదురు గడలను మంచాలుగా మార్చి ఉన్నందున వాటిని తీసుకుని పొరుగు ఊరిలోని వారాంతపు సంతకు వెళ్లి తనవద్ద ఉన్న మంచాలు అక్కడ అమ్ముకుని, తన ఇంటివద్ద ఉన్న నిత్యావసర(Necessary) సరుకుల అంగడిలో అమ్మకానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకుని అదే రోజు రాత్రికి ఇల్లు చేరేవాడు శివయ్య” అన్నాడు కుందేలు.

“అర్థమైనది మామా. మంచాలు అమ్ముతూ ఒక లాభం, సంతలో సరుకులు ఇంటివద్ద అమ్ముతూ మరో లాభం పొందుతున్నాడు శివయ్య.
ఒకే పనిలో స్వామికార్యం, స్వకార్యంలా, ఇలా రెండు లాభాలు పొందసాగాడు.
ఇలా ఆదాయం పొందడాన్నే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటారు” అన్నాడు కోతి.

“శివయ్యలాగా అందరూ కష్టపడి సంపాదించాలి.
శ్రమలో స్వర్ణం దాగి ఉంటుంది.
ఎక్కడ బద్దకం, నిర్లక్ష్యం, అలసత్వం ఉంటుందో అక్కడ సోమరితనం ఉంటుంది.
వయసులో ఉన్నప్పుడు శ్రమించి పొదుపు చేసుకోవాలి.
వృద్ధాప్యంలో సంతతికి భారం కాకుండా, దాచిన ధనాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి” అన్నాడు కోతి.
Read also:hindi.vaartha.com
Read also: