తనకున్న కొద్దిపాటి పంట భూమిని సాగు చేసుకుంటూ గోవిందుడు శింగనబంధు గ్రామంలో జీవనం సాగిస్తున్నారు. పెళ్లి అయిన ఐదుసంవత్సరాలకు కొడుకు పుట్టాడు. రాము అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచసాగారు. రాముకి ఐదుసంవ త్సరాల వయస్సు దాటిందని. ఊరిలో ఉన్న బడిలో చేర్చించారు. కాని రాముకుఉన్న బద్ధకం, వాయిదా మనస్తత్వం వలన ఏళ్ల గడుస్తున్నా చదువులో రాణించలేకపోయాడు. బడికి వెళ్లకుండా అల్లరిపిల్లలతో కలిసి తిరుగుతూ, విలువైన కాలాన్ని వృథా చేసేవాడు. కొడుకుని ఎలా దారిలో పెట్టాలో గోవిందుడికి అర్ధంకాక దిగాలు పడిపోతూ ఉండేవాడు. ఒకనాడు రాము మేనమామ నరసింహం పట్నం నుండి శింగనబంధ వచ్చాడు అక్కనూ, బావను చూడాలని.

బావ ద్వారా రాము ప్రవర్తనను తెలుసుకున్న నరసింహానికి బాధనిపించింది. ‘బావా! ఇప్పుడైనా మించిపోయింది ఏమిలేదు, రాముని నాతోపాటు పట్నం తీసుకుపోయి, అక్కడ మంచి స్కూల్లో చేర్పిస్తాను’ అన్నాడు. నరసింహం అలా అనేసరికి, ‘నా కొడుకు నా దగ్గరే, మాతోపాటు ఉంటాడు. వాడిని ఎక్కడికి పంపించను’ అని రాము వాళ్లమ్మ నిక్కచ్చిగా చెప్పేసరికి, నరసింహం మిన్నకుండిపోయాడు. కొన్నాళ్లు గడిచాయి. రాము వయసు పెరుగుతున్నాసరే అతనిలో మార్పు కనిపించలేదు. ఒకరోజు ఊరి చివర ఉన్న ఆశ్రమానికి సాధువు వచ్చారని, అందరి కష్టాలు, బాధలు విన్న తరువాత సరైన సలహాలు చెప్పడమే కాకుండా, అవసరమైన వారికి జ్ఞానబోధ చేస్తున్నారని ఆనోటా ఈనోటా విన్న గోవిందుడు అక్కడకు వెళ్లాడు. అక్కడ తన కొడుకు గురించి చెప్పి ఎలాగైనా వాడి ప్రవర్తనలో మార్పు తీసుకురావాలని ప్రాధేయపడ్డాడు.

‘ఒకసారి మీ అబ్బాయిని నా దగ్గరకు పంపించండి. వారంరోజులు ఇక్కడే ఉంటాడు. నేను చూసుకుంటా ను’ అని భరోసా ఇచ్చి పంపించాడు సాధువు. మరుసటి రోజు రాము తన తండ్రి మాట మేరకు సాధువు దగ్గరకు వెళ్లాడు. కాసేపు మాట్లాడిన సాధువు రాము తీరును అర్థం చేసుకున్నాడు. ‘రెండు రోజులు నా పక్కనే కూర్చో’ అని చెప్పి.. రాముని క్రమం తప్పకుండా వేళకి భోజన ‘ఏర్పాట్లు గావించండి’ అని తన శిష్యబృందానికి అప్పజెప్పాడు సాధువు. మూడవరోజున రాముని పిలిచి ‘మన ఆశ్రమానికి ఎదురుగా ఉన్న పూల మొక్కలకు పూసిన పువ్వులని తెంపి, వాటితో దండగుచ్చి ఆశ్రమంలో ఉన్న విగ్రహానికి ప్రతిరోజు వెయ్యమని’ చెప్పారు సాధువు. ‘అలాగే’ అన్నాడు రాము. రెండురోజులు గడిచిన తర్వాత, మూడవరోజున పువ్వులను తెంపుకుని తిరిగి వస్తున్న రాముతో ఎదురెళ్లిన సాధువు ‘ఏం.

కొన్ని పువ్వులను తెంప కుండా వదిలేసావు?’ అని అడిగారు. ‘అవి నాకు అందకపోవడం వలన తెంపలేదు, అయినా అవి రెండురోజుల క్రిందటివి. వాడిపోయా. యి కూడాను, దండ గుచ్చడానికి పనికిరావు’ అన్నాడు. రాము రాము అలా అనేసరికి సాధువు నవ్వుతూ ప్రతిపూల మొక్క దగ్గరకి వెళ్లి ఊపసాగారు. వాడిన పువ్వులు అన్నియు నేలమీద పడ్డాయి. ‘చూడురాము నీకు అందలేదని, విడిచిపెట్టిన వాడిన పువ్వులు దండ గుచ్చడానికి పనికిరాలేదో? మనిషి జీవితం కూడా అంతే. వయసు పెరుగుతున్నకొద్దీ శరీరంలో పటు త్వం తగ్గి, చివరికి ఎవరికీ పనికిరాకుండా అయిపో తాం. అందుకే ఎప్పుడు చెయ్యవలసిన పని అప్పుడే చేసి, జీవితం సార్ధకం చేసుకోవాలి’ అంటూ రాముకు హితబోధ చేశారు సాధువు. సాధువు మాటలకి రాము చలించిపోయాడు. తనకు తన తప్పు తెలిసింది. సకాలంలో చేసే సక్రమమైన పని సత్ఫలితానినిస్తుంది అని గ్రహించి, ఆ రోజు నుంచి బద్ధకాన్ని, వాయిదా మనస్తత్వాన్ని వదిలి, రోజూ బడికి వెళ్తూ బుద్ధిగా చదువుకోవటం ప్రారంభించాడు. రాము మారినందుకు, గోవిందుడు ఎంతో ఆనందించాడు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: