हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

The God Within : అంతర్యామి

Abhinav
The God Within : అంతర్యామి

మేం అలిపిరి చేరేసరికి ఉదయం ఆరు గంటలైంది. కానీ రాత్రి తిరుమల కొండల్లో కురిసిన కుండపోత వర్షానికి కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు రెండు ఘాట్ రోడ్ల మీద అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గాలు మూసుకుపోయాయి. ఆ రాళ్లను తొలగించడానికి ఆరు గంటల సమయం పడుతుందనీ, ఆ తరువాతే వాహనాలను తిరుమల కొండ మీదకు అనుమతిస్తామనీ టిటీడీ అధికారులు ప్రకటించడంతో నాకేం చెయ్యాలో తోచలేదు.

నేను విజయనగరంలోని ప్రభుత్వ కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్గా పని చేస్తున్నాను. నా భార్య సుప్రజ అక్కడి స్కూల్లోనే ఉపాధ్యాయురాలు. మా అబ్బాయి శ్రీకర్కి ఐఐటీలో సీటు వస్తే తిరుమలకి వచ్చి ఏడుకొండల స్వామిని దర్శించుకొని, హుండీలో రెండు లక్షల రూపాయల ముడుపు వేస్తాననీ సుప్రజ మొక్కుకుంది.

అనుకున్నట్లుగానే శ్రీకర్కి మంచి ర్యాంక్ వచ్చి ఖరగ్పూర్ ఐఐటీలో సీటు వచ్చింది. అప్పట్నుంచీ మొక్కు తీర్చుకోవాలనీ సుప్రజ నన్ను చెవిలో ఇల్లు కట్టుకొనీ పోరు పెడుతున్నా నేను సెలవుల సమస్య వల్ల తిరుపతి ప్రయాణం వాయిదా వేస్తూ వచ్చాను. 

కానీ దసరా సెలవులు రావడంతో ఇప్పుడు వచ్చాం. ఆరు గంటలు అక్కడ ఉండటం కష్టం కాబట్టి హోటలుకి వెళ్లి మర్నాడు వద్దామని సుప్రజతో చెప్పాను. కానీ సుప్రజకెందుకో నా మాటలు నచ్చలేదు. ఒక్కసారి దర్శనానికి వచ్చినవాళ్లు తిరిగి వెనక్కి వెళ్లకూడదని చెప్పింది. ఇంతలో కొంతమంది మెట్ల దారి గుండా కొండ మీదకు వెళుతుండటంతో సుప్రజ ఆ మెట్ల దారి దగ్గరకు వెళ్లింది.

అప్పటికే చాలామంది మెట్లగుండా కొండ మీదకు వెళుతూ కనిపించారు. సుప్రజ వెంటనే నా దగ్గరికి వచ్చి “ఏమండీ! మనం కూడా మెట్లెక్కి కొండ – మీదకు వెళదాం. తొమ్మిది కిలోమీటర్ల దూరమేనట. 3550 మెట్లు పరవాలేదు 5 గంటల్లో వెళ్లిపోవచ్చు.. పదండి బయలుదేరుదాం” అని చెప్పింది. “సుప్రజా! నీకేం పిచ్చా? నీకసలే ఆయాసం. ఈ వయసులో మెట్లు ఎక్కడం.. అందునా 3550 మెట్లు ఎక్కడం చాలా కష్టం.

మనం మనిష్ట భగవతుడికి తెలుసు, కాబట్టి వెనక్కి వెళ్లడం తప్పేం కాదు. చాలానుంది. వెనక్కె వెళ్ళిపోతున్నారు. కనుక వద్చ, కాళ్లు తొలగించగానే నద్దాం” అని. చెప్పాను. కానీ సుప్రజ వినలేదు. ఇక తచ్చక మెట్లదారి వెంట వెళ్లడానికి నిర్ణయించుకున్నాం. వెంటనే డ్రైవర్ని తిరుపతి పంపించేసి రాళ్లను తొలగించిన. 

తరువాత వాడిని కొండ మీదకు రమ్మనమని చెప్పి మేం మెట్లదారి దగ్గరికి చేదుకున్నాం, “మొదట్లో బస్సులుండేవి కావట, భక్తులందరూ ఈ మెట్ల గుండానే వెళ్లి స్వామిని దర్శించుకునేవాళ్లట” అంది.” సుప్రజ. “తప్పుదు అనుకుంటే మనిషి ఎంత కష్టమైనా పడతాడు. ఒకసారి సుఖానికి అలవాటు పడితే కష్టపడటానికి చచ్చినా ఇష్టపడడు.

మా ఊరికి నా చిన్నప్పుడు బస్సు ఉండేది కాదు. అప్పుడు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు బస్సులు వచ్చిన తరువాత నడిచి వెళ్లగలమా? చెప్పు” అన్నాను. సుప్రజతో. “శ్రీవారి మెట్ల దారిలో వెళితే మెట్లు తక్కువట. నిజమేనా?” అని అడిగింది సుప్రజ. “అలిపిరి నుంచి తిరుమలకు మెట్ల ద్వారా కాలిబాట, రెండు ఘాట్ రోడ్లు మొదలవుతాయి.

పూర్వం అలిపిరిని అడి వుళీ అని పిలిచేవారట. అడి అంటే పాదం, పుళి అంటే చింతచెట్టు. ఇక్కడ పెద్ద చింతచెట్టు ఉండేదట. అందుకే దీన్ని అలిపిరి అని పిలుస్తున్నారు.. రామానుజుని కాలం నుండి ఈ కాలిబాట ఉందట. ఇక రెండవ మార్గం చంద్రగిరి నుండి మొదలవుతుంది. అది 2 కిలోమీటర్లే. 2800 మెట్లు, కానీ నిలువుగా ఉండడం వల్ల ఎక్కటం కష్టం అవుతుంది. మొదటి ఘాట్ రోడ్డుని 1945లో వేస్తే, రెండవదాన్ని 1974లో వేసారు. 

ఇంకొందరు అలిపిరి అంటే అలసట తీర్చుకునే ప్రాంతం అని కూడా అంటారు” అని ఆ మెట్ల మార్గం గురించి నాకు తెలిసిన విషయాలు సుప్రజ చెప్పాను. ప్రభాత సమయం కావడంతో జనాలు పలచగా ఉన్నారు. ణమంది మొదటి మెట్టు దగ్గర గబ్బరికాయలు కొట్టి మెట్లెక్కడం మొదలు పెదుతున్నారు.

మన మొదటి మెట్టుకి దండం మెట్లెక్కడం మొదలు పెట్టింది. తదాది మొనరాలే ఆమెను అనుసరించాను. పెట్టి చుట్టూరా పచ్చటి ప్రకృతి.. ఎత్తైన కొండలు.. భక్తులందరూ ‘గోవిందా’ ‘గోవిందా’ అని పిలుస్తుంటే అది ఆ ప్రతిధ్వనించసాగింది. కొద్ది దూరం వెళ్లగానే పెద్ద గోపురం కనిపించింది. ఇలాంటి రాజగోపురాలు ఏడు కొండలకూ ఏడు ఉన్నట్లు ఎవరో భక్తుడు పక్కవాళ్లతో చెబుతున్నాడు.

మరికొద్ది దూరంలో దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం విగ్రహం కనిపించింది. ఆ పక్కనే భక్తులందరి లగేజ్ని చెక్ చేస్తున్నారు. అది మొదటి చెక్ పాయింట్. మెట్లు నిలువుగా ఉండటంతో సుప్రజ అలసిపోసాగింది. మొత్తం 3550 మెట్లలో 2000 మెట్లు నిలువుగా ఉంటాయనీ చెక్ గేట్ ఉద్యోగి చెప్పాడు. 

అయితే మొత్తం మెట్లన్నీ రేకులతో కప్పడం వల్ల చల్లగా హాయిగా ఉంది. ఇంతలో ఒక ఏభై ఏళ్ల వ్యక్తి ఆయాసంతో ఒక మండపం దగ్గర కూర్చుండిపోయాడు. ఆ పక్కనే కూర్మావతార విగ్రహం పెద్దగా కనిపిస్తోంది. ఆ వ్యక్తికి అతని భార్య కాబోలు.. నీళ్లు తాగించడంతో కొద్దిగా ఆయాసం తగ్గి కళ్లు తెరిచాడు. నేను ఆవిడతో “ఏమ్మా! ఇతనికి ఆయాసం ఉన్నట్లుంది.

ఇతను 3500 మెట్లు ఎక్కడం కష్టం, దయచేసి వెనక్కి వెళ్లిపోయి ఏ బస్సులోనో రండి” అని అన్నాను. నా మాటలకు ఆమె నా వైపు తిరిగి “పిల్ల పెళ్లి కుదిరితే కొండ మీదకు మెట్లెక్కి వస్తామని ఆ ఏడుకొండల అదృష్టవశాత్తూ వాడికి మొక్కుకున్నాం. నెల రోజుల క్రితం దానికి పెళ్లి కుదిరింది. దండం పెట్టుకున్న తరువాత మొక్కు రాదా చెప్పండి! అసలే వడికాసులవాడు” తీర్చకపోతే ఆ స్వామికి కోపం ఆమె మాటలకు నేడు సుప్రజ ఆశ్చర్యపోయాం. ఆమె రామనచాయ రంగులో సన్నగా ఉంది.

“అమ్మా ఏ ఊరు నుంచి వస్తున్నారు? మీ ఇద్దరే వచ్చారా? మీ పిల్లలైనా వచ్చారా?” అని అడిగాను ఆమెని “బాబూ! నా పేరు సుళీల మేం విశాఖపట్నం నుంచి వస్తున్నాం. మా వారు పౌరోహిత్యం చేస్తుంటారు. మాతో పాటు మా అబ్బాయి శర్మ వచ్చాడు” యువకుడిని చూపించింది. అతను చెవులకు కుండలాలు, నుదుటన బొట్టు. 

పంచెకట్టులో దృఢంగా ఉన్నాడు. ఇంతలో ఆమె భర్తకు ఆయాసం తగ్గడంతో మళ్లీ నడవడం మొదలు పెట్టారు. మరికొన్ని మెట్లు ఎక్కగానే రెండవ రాజగోపురం కనిపించింది. దాని పేరు మైసూరు గోపురం అని దాని మీద రాసి వుంది. అప్పటికి వెయ్యి మెట్లు ఎక్కాం. వంద మెట్ల తరువాత ఇంకా ఎన్ని మెట్లు ఎక్కాలో వాటి వివరాలు బోర్డుల మీద టీటీడీవాళ్లు రాశారు.

నేను ఆ పురోహితుడి వెనకాలే నడుస్తూ అతని ఆరోగ్యాన్ని గమనించసాగేను. ఇంతలో వరాహావతారం విగ్రహం కనిపించింది. దాని పక్కన ఆ అవతారం గురించి, ఆ ప్రదేశం గురించి రాయబడింది. ఆ తరువాత మరొక వంద మెట్ల తరువాత మూడవ గాలిగోపురం వచ్చింది. అక్కడికి 2000 మెట్లు ఎక్కాం. ఇంకా 1550 మెట్లు మెట్లెక్కాలి. ఇక్కడ నుంచి వాలు తక్కువగా ఉంటుందని ఒక వ్యక్తి చెప్పాడు. ఆ పక్కన ఉన్న కౌంటర్లో దర్శనం టికెట్లని స్కాన్ చేయించి అక్కడ కూర్చున్నాం.

ఆ పురోహితుడికి మళ్లీ ఆయాసం పెరిగింది. “అయ్యా! తమరు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి” అంటూ అతనికి తాగేందుకు నీళ్లిచ్చాను. అతను నీళ్లు తాగి “నా పేరు మూర్తి, ఈ మెట్లు ఎక్కడం కష్టం అనీ నాకు తెలుసు. మొక్క కాబ తప్పనిసరిగా బయటుకోరాను. అన్నిటికీ ఆ ఏడుకొండలవాడే ఉన్నారు” అని చెప్పారు. కృష్ణమూర్త “అమ్మాయి పెళ్లి వీదిరితే మిల్లిక్క వస్తానని ఎందుకు మొక్కుకున్నారు?. 

ఏదయి నమస్యా?” అని అతన్ని పదవ తరగతి వరకే చదువుకుంది. పురోహితుడి కూతురనీ, అంజిసీరంగు చదవలేదనీ, సాఫ్ట్వేర్ ఉద్యోగం చెయ్యటం లేదనీ… ఇలా ఏదో కారణాలు చెప్పి ఎవ్వరూ పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావటం లేదు, కొందరైతే బోలెడు కట్నం అడుగుతున్నారు. అంత కట్నం ఇచ్చే స్థోమత నాకు లేదు. మొన్న మా అదృష్టంకొద్దీ సంబంధం వచ్చింది. అబ్బా అబ్బాయి. తాలూకా ఆఫీసులో అటెండర్గా పని చేస్తున్నాడు.

అతను మా పిల్ల సావిత్రిని నచ్చి పెళ్లికి ఒప్పుకున్నాడు. కాకపోతే వాళ్ల చెల్లి పెళ్లి కోసం రెండు లక్షలు అప్పు చేసాడట. ఆ డబ్బు మాత్రం మమ్మల్ని ఇమ్మంటున్నాడు. పెళ్లి ఎలా చేసినా పరవాలేదట. సంబంధం మాకు నచ్చింది. కానీ అతనడిగిన రెండు లక్షలు ఇవ్వటానికి నా దగ్గర లేవు” అని చెప్పి మళ్లీ నడవటం మొదలు పెట్టాడు. “మరిప్పుడేం చేస్తారు?” అని అతన్ని అడిగాను. “అదే అర్ధం కావటం లేదు.. ఏ అప్పో చెయ్యాలి. అయినా రెండు లక్షలు ఎవరిస్తారు చెప్పండి?” అన్నాడు. నిర్వేదంగా. ఆ తరువాత అతనికి ఆయాసం మొదలవడంతో నేను మౌనం దాల్చేను.

నా వెనక సుప్రజ, సుశీలగారు, వాళ్లబ్బాయి నిటారుగా వున్న మెట్లెక్కుతున్నారు. ఇంతలో మెట్ల పక్కన పెద్ద ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. కృష్ణమూర్తిగారు పక్కనే ఉన్న మండవంలో కూర్చుని ఆయాసం తీర్చుకోసాగాడు. ఆ పక్కనే 2630 మెట్లు ఎక్కినట్లు వివరాలు రాసి ఉన్నాయి. ఇంకా సుమారు 900 మెట్లెక్కాలి. కృష్ణమూర్తిగారి ఆయాసం చూస్తుంటే అతను వాటిని ఎలా అధిరోహిస్తాడా అని నేను ఆలోచించసాగేను ఆ పక్కనే అటవీ మ్యూజియం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870