हिन्दी | Epaper
మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి

The Extraordinary Alumnus : అపూర్వ విద్యార్థి

Abhinav
The Extraordinary Alumnus : అపూర్వ విద్యార్థి

అన్నయ్య కూతురు సుమేధ పెళ్లి కోసం అమెరికాలో స్థిరపడిన రమణ భార్య, పిల్లల్తో ‘సొంత ఊరుకొచ్చాడు. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడే మళ్లీ ఇండియాకి రావడం. అయినవాళ్లం దరినీ కలవడం కోసం కొంచెం ఎక్కువ రోజులు సెలవు తీసుకొని వచ్చాడు. దానికితోడు పిల్లలకి కూడా సెలవులే. అన్నీ కలిసి వచ్చాయి. ఆ ఊర్లో రమణవాళ్ల కుటుంబం తెలియని వాళ్లుండరు. రమణవాళ్ల నాన్న సీతాపతిరావు ఊరంతటికీ బంధువు. అందరి కష్టం ఆయన కష్టం. ఆ ఊరి ప్రగతికి ముఖ్య కారకుడు సీతాపతిరావే. మరి… ఆయన మనుమరాలు పెళ్లంటే ఇంక చెప్పాలా! పెళ్లి ఊరంతా పండగలా జరుపుకున్నారు. రమణభార్య మూణ్ణిద్దర్లకని పెళ్లికూతురుతో పెళ్లికొడుకు వాళ్లింటికి వెళ్లింది. పెళ్లి హడావిడి తగ్గి కొంత తీరిక దొరకడంతో అదే ఊర్లో మెడికల్ షాపు నడుపుతున్న తన చిన్నప్పటి స్నేహితుడు పార్థసారథి దగ్గరకొచ్చాడు రమణ. “రారా రమణా, వచ్చిన చుట్టాలంతా వెళ్లిపోయినట్టున్నారు. హడావుడి తగ్గినట్టేనా?” పార్థూ పరామర్శ. “ఇవాళేరా కొంచెం తీరిక దొరికింది. ఉద్యోగం చేసే వాళ్లందరూ వెళ్లిపోయారు. పెద్దవాళ్లని పోనివ్వట్లేదు నాన్న. ఆయన సంగతి నీకు తెలుసుగా!” కుర్చీలో కూర్చుంటూ అన్నాడు రమణ. “నా నలభయ్యేళ్ల జీవితంలో ఇంత సందడిగా జరిగిన పెళ్లి మరోటి చూళ్లేదురా రమణా, జీవితాంతం కళ్లల్లో ఉండిపోతుంది.

ఇది నా ఒక్కడి మాట కాదు. ఊర్లో అందరూ ఇదే మాట”. “ఏమోరా పార్టూ, మీరందరే నాన్న బలం. మీరందరూ కలవకపోతే ఇంత సులువుగా అవుతుందా అయిదు రోజుల పెళ్లి” కృతజ్ఞతగా అన్నాడు రమణ. “ఇంకా ఏంట్రా అమెరికా సంగతులు?” అడిగాడు పార్థు. “ఈ పిలుపే కరువైందిరా. ఇలా అరే.. ఒరేయ్ అనే మనిషే ఉండడు. అందరూ మంచివాళ్లే. కానీ మనసును తాకేలా పలకరింపులుండవ్, పార్టూ! నా దృష్టిలో పేదవాడెవడంటే జీవితాంతం చనువుగా అరే, ఒరే అని పిలిచే ఒక్క స్నేహితుడైనా లేనివాడు” చాలా ఉద్వేగపూరితంగా ఉన్నాయి రమణ మాటలు. వినడం పార్థు వంతు అయింది. “ఆక్కడి జాలర్లు వేసిన దాలర్ల వలలో పడి కొట్టుకుపోతున్నామేమో అన్పిస్తుంటుందిరా. చాలా సుఖంగా ఉంటుందిరా అక్కడ, కానీ చాలా ఆనందంగా మాత్రం ఉండదురా”. అన్నాడు పార్థు. “ఏంట్రా అంత ఫీల్ అయిపోతున్నావ్? గ్రీన్కార్డువాడివి. పిల్లలిద్దరూ అక్కడే పుట్టారు. ఇంక అదే నీ దేశం చేసుకున్నావ్ అనుకుంటున్నాన్రా నేను” ఆశ్చర్యపడుతూ “లేదురా పార్థూ! ఎన్ని సంవత్సరాలు మనం అక్కడ ఉన్నా మనం పరాయి వాళ్లమే అనేది అర్థమైంది. నేను సమూలంగా వెళ్లలేదురా. నా వేళ్లు ఇక్కడే ఉన్నాయిరా, అంటు మాత్రమే అక్కడ పెరుగుతోంది..” ఈ మాటలు అంటున్నప్పుడు రమణ గొంతు గద్గదమైంది. 

“అందులో తప్పేముందిరా? అక్కడ మంచి అవకాశాలున్నాయన్పించింది, వెళ్లావు” అనునయంగా మాట్లాడాడు పార్థు. “వస్తాన్రా! పిల్లలు కొంచెం పెద్దయ్యి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలవగానే వచ్చేస్తాను. నా నేలకి రుణపడి ఉన్నాను, తీర్చుకోవాలి”. రమణ ఉద్వేగానికి అడ్డు రాకుండా వింటున్నాడు పార్థు. “చాలినంత సంపాయించానురా. అంతా తెచ్చేస్తానురా. మన ఊరికోసం ఎంత చేసినా తక్కువే. మంచి సంస్కారం, సభ్యతలని నేర్పిన ఈ నేల ఋణం తీర్చుకోలేనిది” చెప్పుకెళ్తున్న రమణ వైపే ఆశ్చర్యంగా చూస్తున్నాడు పార్థు. రమణ మనసులో తన ఊరి మీద ఇంత ప్రేమాభిమానులు వున్నాయనుకోలేదు అతను. “ట్రంప్ వచ్చినప్పట్నుండి కొంచెంకరంగానే ఉన్నట్లుంది కదా మనవాళ్లకు” వాతావరణంలో గంభీరత తగ్గించేందుకు ప్రయత్నిస్తూ అన్నాడు పార్థు. “మీడియాలో వస్తున్నంత దారుణంగా లేదు. కానీ ఈర్ష్య, అసూయలు మానవ సహజం కదరా! ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం కదా! తమ లబ్ధి కోసం అవతల వాళ్లని ఎగేయడం ప్రపంచంలో అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుందని చరిత్ర చెబుతూనే ఉందిగా. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. ఎందుకంటే వాళ్ల గూట్లో మనం చేరాం కానీ, మన గూడులోకి వాళ్లు రాలేదుగా” వేదాంత ధోరణిలో మాట్లాడాడు రమణ. ఇంతలో ఎవరిదో ఫోను పార్థుకి. మాట్లాడ్డం అవగానే అడిగాడు.

రమణ.. “ఏంట్రా, ఎక్కడిదాకా వచ్చింది మన ఫ్రెండ్స్ అందరి జాబితా, మళ్లీ వాళ్ల అడ్రు సంపాదించడం?” మళ్లీ తనే అన్నాడు “పెళ్లి పనుల్లో పడి కొంత నెమ్మదించింది మన కార్యక్రమం. ఇంకా పదిహేను రోజులే ఉంది. ఇవాళ రాత్రికి మా ఇంట్లో డాబా గదిలో కూర్చుని ప్రోగ్రాం అంతా పక్కాగా నిర్ణయించేద్దాం. నువ్వు మూర్తిని, భుజంగంగాడ్ని తీసుకొని వచ్చేయ్. నేను ఎదురు చూస్తుంటా” అంటూ లేచాడు రమణ. భుజంగంగాడిని అని పలకడంలో రమణ గొంతులో అహం లేదు, కొండంత చనువే తప్ప. పదిహేను రోజుల్లో వాళ్లు జరుపుకోవాలనుకుంటున్న పండగ వాళ్ల కళాశాల రజతోత్సవం. అదేరోజు రమణవాళ్ల డిగ్రీ బ్యాచ్ అందరి పునః కలయిక. ఆ కాలేజీ గురించి చెప్పుకోవాలంటే-రమణవాళ్ల నాన్న సీతాపతిరావు ఆర్మీలో చేసి రిటైర్ అయ్యాడు. ఉన్నత భావాలు కలిగిన వ్యక్తి. మాతృభూమి ఋణం తీర్చుకోవడం ఒక్క సైన్యం చేరడం ద్వారానే వీలవుతుందని నమ్మినవాడు. పునరావాసం కోసం ఇచ్చిన భూమి పక్కనే రిటైర్మెంట్తో వచ్చిన డబ్బుతో ఇంకొంత భూమి కొని వ్యవసాయం మొదలుపెట్టాడు. ఆ గ్రామంలో పిల్లలు చదువుకోడానికి నాలుగు మైళ్ల దూరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది. పిల్లలకి ఉచిత విద్య ఇవ్వాలని తనే ఒక చిన్న బడి స్థాపించాడు. ఒక పక్క వ్యవసాయం, మరోపక్క విద్యాసాయం. 

సీతాపతిరావు ఆదర్శాలకు ప్రభావితులై ఊరిపెద్దలు పాఠశాల కోసం భూదానం చేసి, చందాలు వసూలు చేసి డబ్బు సమకూర్చారు. ఊరి పెద్దలందర్ని ఒక తాటి మీదకి తెచ్చి కమిటీ స్కూలు ఏర్పరచాడు. సామాన్యంగా గుళ్లకి మాన్యం భూములుంటయ్ కానీ ఈ కళాశాలకి మాన్యం భూములేర్పడినయ్ అంటేనే తెలుస్తుంది… అదంటే ఎంత ఆదరాభిమానాలో ఆ ఊరివాళ్లకి. దాని పేరు నిర్ణయించే బాధ్యత కూడా ఆయనే మీదే పెట్టారు ఊరి పెద్దలు. సీతాపతిరావు చాలా ఆలోచించి.. ఆలోచించి తనకిష్టమైన కవి శ్రీనాథుడు పేరు పెట్టాడు ‘కవిసార్వభౌమ శ్రీనాథ విద్యాలయం”. ఆ విద్యాలయం ఏర్పడిన తర్వాత ఆ ఊర్లో పుట్టిన ఏ బిడ్డా నిరక్షరాస్యుడు కాలేదు. పాత కాలం పిల్లలందరూ శ్రీనాథ విద్యాలయం అని పిలుచుకునేవాళ్లు. ఇప్పటి పిల్లలు దాన్ని శ్రీనాథ్ కాలేజిగా మార్చేసారు పిలుపులో. మొదట హైస్కూలుగా పుట్టి, కొద్ది కాలానికి జూనియర్ కాలేజిగా పెరిగి, మరో రెండేళ్లకి డిగ్రీ కళాశాల స్థాయి తెచ్చుకుంది శ్రీనాథ విద్యాలయం. రమణవాళ్లు ఆ కళాశాల నుంచి వచ్చిన మొదటి డిగ్రీ బ్యాచ్. అందుకే కాలేజీ రజతోత్సవం సందర్భంలోనే తమ డిగ్రీ బ్యాచ్ వాళ్లందర్నీ ఒక వేదిక మీద కలపాలనుకున్నాడు రమణ. 

అనుకున్నప్పటి నుండీ ఊళ్లోనే ఉండే పార్థు, మూర్తి, భుజంగం సహాయంతో తమ బ్యాచ్ వాళ్లందరి విషయాలు సేకరించడం, వాళ్లతో మాట్లాడ్డం చేసి “పూర్వ విద్యార్థుల సమావేశం”కు హాజరు అయ్యేలా ఒప్పించడం జరిగిపోతున్నాయి. రాత్రి ఎనిమిది గంటలకల్లా సీతాపతిరావు ఇంటి డాబా మీద సమావేశమయ్యారు సీతాపతిరావు, కళాశాల కమిటీ సభ్యుల్లో ముఖ్యులు, రమణ అన్నయ్య, రమణ, అతని భార్య, పార్థసారథి, మూర్తి, భుజంగరావు. ఒక గంటసేపు చర్చించుకొని కార్యక్రమం నిర్ణయించారు. చివర్లో రమణ ఫ్రెండ్స్ తో అన్నాడు “నాకు అమెరికా ఆఫీసు నుండి ఫోన్ వచ్చిందిరా. మూడు, నాలుగు రోజుల కోసం వెళ్లాలి తప్పనిసరిగా”. “అదేంట్రా?” రమణ మాటలకి అడొచ్చాడు మూర్తి. “నేను ఒక్కడినే వెళుతున్నా. మన ప్రోగ్రామ్ రోజుకు రెండు రోజుల ముందుకల్లా వచ్చేస్తా. నేనక్కడి నుండి రోజూ మీతో కాంటాక్ట్ ఉంటా. నేను లేకపోయినా పనులు ఆగకూడదురోయ్. మా అన్నయ్య, నాన్నా, నా వైఫ్ అందరూ ఇదే పనిలో ఉంటారు” రమణ చెప్పాడు. “నువ్వుంటే ధైర్యంగా ఉంటుందిరా. నీ వెనక ఎంత పనైనా చేస్తాం” తగ్గిన ఉత్సాహంతో అన్నాడు భుజంగం. “నేను ఆఫీసు పనిలో లేనప్పుడు పూర్తిగా ఇదే పని మీద ఉంటాన్రా. కాకపోతే భౌతికంగా మీ దగ్గర ఉండట్లేదంతే” ముక్తాయించాడు రమణ. ఆ మర్నాటి నుండి రమణ పనులన్నీ తనుగా చేస్తూ, కొన్ని పురమాయిస్తూ, ఎవరెవరు ఏది పర్యవేక్షణ చేయాలో అన్నీ రాసి, ఒక ఫైల్ వెళ్లేముందు వాళ్ల నాన్నకి, అన్నయ్యకి, పార్టుకి అప్పచెప్పాడు. వేడుకలు ఇంకో వారం రోజుల్లో వున్నాయనగా రమణ అమెరికా వెళ్లాడు ఆఫీసువని పూర్తి చేయడానికి, నాలుగు రోజులు ఇట్టే గడిచిపోయి నయ్. 

అయిదో రోజు రమణ ఫోన్ చేసి “నేను ఇంకో గంటలో బయల్దేరుతున్నాన్రా ఇండియాకి ఫ్లైట్ ఆలస్యం లేకపోతే రేపు సాయంత్రానికల్లా అక్కడుంటా. ఫ్లైట్లో మొబైల్ పనిచేయదు కాబట్టి మాట్లాడ్డం కుదరదు” అన్నాడు పార్థుతో. “రా..రా.. నీ కోసమే చూస్తున్నాం” పార్థు చెప్పాడు ఉత్సాహంగా. ఇంకో రోజు కూడా గడిచిపోయింది. రమణవాళ్ల ఊరు పండగ వాతావరణం నింపుకుంది. వచ్చిన వాళ్లకి అందరికీ కళాశాలలోనే అన్ని ఏర్పాట్లూ, ఆడిటోరియంలో సభలు, సమావేశాలు. పాత విద్యార్థులు, పాత ఉపాధ్యాయుల కలయిక, పలకరింపులతో ఆ స్థలమంతా సందడిగా ఉంది. మూర్తి పార్థుని కల్సినప్పుడల్లా అంటున్నాడు “రమణ ఏంట్రా ఇంకా రాలేదు” అని. “అదేరా చూస్తున్నా! కలిసిన వాళ్లందరూ అడుగుతున్నారు. మధ్యాహ్నం నుండి రమణవాళ్ళ అన్నయ్య కూడా లేడు. హైదరాబాదు వెళ్లాడట ఇప్పుడు చాలా అవసరంగా” చెప్పాడు పార్థు. మర్నాడు కళాశాల రజతోత్సవం మొదలైంది ఉదయం పది గంటలకల్లా. వక్తల ప్రసంగాలు, విద్యాలయం మొదటి ప్రధానోపాధ్యాయుడు పరంధామయ్యగారికి సత్కారం, గండపెండేరం బహూకరణ. మొదటి మహిళా ఉపాధ్యాయురాలికి సత్కారం: కళాశాలలో పనిచేసిన అధ్యాపకులకు, ఉద్యోగులకు బంగారు పతక జ్ఞాపికలు; .ప్రతి సంవత్సరం అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు బహుమతులు, రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా ఎదిగిన ప్రస్తుత, పూర్వ విద్యార్థులకు బహుమతులు: ప్రస్తుత విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు.. ఒకదాని తర్వాత ఒకటి సజావుగా జరిగిపోతున్నాయి. 

ఇవన్నీ రమణ, వాళ్ళ నాన్న ప్లాన్ చేసినవే. రమణ మాత్రం ఇంకా రాలేదు. సీతాపతిరావు గారు అన్ని కార్యక్రమాలు పద్ధతిగా జరిగేలా చూసుకుంటున్నాడు. ఆయనకి చేయబోయిన సన్మానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తర్వాత మధ్యాహ్నం విందు, కొద్దిసేపు విరామం తర్వాత రమణ వాళ్ల డిగ్రీ మొదటి బ్యాచ్ పూర్వ విద్యార్థుల కలయిక సంబరం.. అందరూ రమణ గురించే అడుగుతున్నారు.. “రమణ ఏడీ? ఎక్కడని?” “వస్తున్నాట్ట.. మధ్యలో ఉన్నాడు. మనల్ని సమావేశం మొదలు పెట్టమంటున్నారు వాళ్ల నాన్న” అన్నాడు. అయిష్టంగానే మొదలుపెట్టారు రమణ స్నేహితులు. చివరి వక్తగా రమణ పేరు రాసారు. మిత్రులందరూ శ్రీనాథ కళాశాలతో వాళ్ల అనుబంధం తీపి-చేదు అనుభవాలు, చిలిపి చేష్టలు, వేరేవాళ్లకు పెట్టిన వికృత, వేళాకోళ మారు పేర్లు అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇంతలో అంబులెన్సు బండి వచ్చి ఆగింది. సమావేశంలో నిశ్శబ్దం ఆవరించింది. అందులోంచి రమణ అన్నయ్య, భార్య దిగారు. వెనకనే స్ట్రెచర్ దింపారు. దాని మీద అచేతనంగా రమణ. “రమణ.. రమణ..” ఎవరో అరుస్తున్నారు. అందరూ అటువైపు పరిగెత్తారు. “ఏమైంది… ఏమైంది.. రమణకి?” అడుగుతున్నారు కొందరు. వాళ్ల అన్నయ్య ద్వారా తెలిసింది… ఇండియా రావడానికి ఎయిర్పోర్ట్క బయల్దేరిన రమణ మధ్యలో కారు పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆపాడు. 

వెనకనే మరో కారులో వచ్చిన ముగ్గురు అమెరికన్లు రమణ కారును గుద్ది ఇండియన్స్ ని తిడుతూ రమణ దగ్గర ఉన్న డబ్బు, కార్డ్స్ లాగేసుకున్నారు. టిక్కెట్ లాగేసుకోబోతుంటే అడ్డుపడిన రమణని కొట్టి వెళ్తూ వెళ్తూ వాళ్లలో ఒకడు జరిపిన కాల్పుల్లో రమణ అక్కడే కుప్పకూలిపోయాడు. పార్థు కళ్లలో నీళ్ల సుడులు “భౌతికంగా మీ దగ్గర ఉండట్లేదంతే..” ఊరెళ్లే ముందు చివరగా రమణ అన్న మాటలు గుర్తుకొచ్చినయ్. “మాట తప్పావురా రమణా! ఇప్పుడు భౌతికంగా మాత్రమే ఉన్నావురా మా మధ్య” పార్థూ మౌన రోదనలో కొట్టుకొచ్చిన మాటలు. రమణ దేహాన్ని పూర్వ విద్యార్థుల వేదిక మీద అందరి మధ్యలో ఉంచారు. అదొక అసాధారణ పూర్వ విద్యార్థుల కలయిక.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870