हिन्दी | Epaper
మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి మానేల.. మాఊరు ఐక్యంగా ఉంటాం అనుబంధం నిజమైన అభిమానులు ఆఖరి కోరిక చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి

Magic Illusion : మాయాజాలం

Abhinav
Magic Illusion : మాయాజాలం

శ్రీరాం ఆఫీసుకు వెళ్లాక బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుతూ ఒక్కో చుక్కా తాగుతూ కాఫీని ఆస్వాదిస్తోంది కీర్తన. ఇంతలో సెల్ మోగింది. తీసి “హాయ్ రాధీ! పనైపోయిందా? పొద్దున్నే ఫోన్ చేసావు?” అంది. “అమ్మా, నేను మల్లమ్మను. రాధికమ్మ కోసం కాఫీ తీసుకొని వెళితే అమ్మ బాత్రూంలో పడిపోయి ఉన్నారు. పాపలు కాలేజ్కు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేరు. అందుకని మీకు ఫోన్ చేసాను” అంది మల్లమ్మ గాభరాగా. “అయ్యో, ఇప్పుడే వస్తున్నాను” అంటూనే కార్ కీస్ తీసుకొని, తలుపుకు తాళం వేస్తూ శ్రీరాంకు ఫోన్ చేసి “రాం, రాధి బాత్రూంలో స్పృహ తప్పి పడిపోయిందిట. మల్లమ్మ కాల్ చేసింది. నేను వెళుతున్నాను” అని చెప్పింది. “అయ్యో, ఏమైందో! విక్రం హాస్పిటల్ కు తీసుకెళ్లు. ఏదైనా ఎమర్జెన్సీ అవుతే కాల్ చేయి. నేనూ వస్తాను” అన్నాడు. రాధికను పరీక్ష చేసి డాక్టర్ విక్రం చెప్పిన మాటలకు కీర్తన తెల్లబోయి చూసింది. “మీరు చెప్తోంది నిజమేనా విక్రం! తను ఇద్దరు టీనేజ్ ఆడపిల్లల తల్లి. నాకు తెలిసినంతవరకూ ఆమె భర్త అర్జున్ చాలా మంచివాడు. పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆర్థిక ఇబ్బందులు లేవు. తన లైవ్లో ఎలాంటి ఒత్తిళ్లు. ఆరళ్లు లేవు. అలాంటప్పుడు దానికి ఇలా చేయవలసిన అవసరం ఏం ఉంటుంది?” “చూడు కీర్తనా! నువ్వు మా శ్రీరామ్ భార్యవి, ఈమె ప్రాణస్నేహితురాలివి కనుక నీకు పేషెంట్ పరిస్థితిని గురించి వివరంగా చెప్పాను. 

ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటో కానీ ఆమె కచ్చితంగా డ్రగ్కి అలవాటు పడుతోందని మాత్రం చెప్పగలను. ఈ విషయం ఆమె భర్తకు ఇన్ఫామ్ చేసారా?” అడిగాడు డాక్టర్ విక్రమ్. “ఫోన్ కలవట్లేదు, మెసేజ్ పెట్టాను” అంది. “సరే! ఆమెకు మెలకువ వచ్చేటప్పటికి అటెండెంట్ ఎవరో ఒకరు ఆమెతో ఉండేలా చూసుకో. అసలే తీవ్రమైన డిప్రెషన్లో ఉందామె. నేను మధ్యాహ్నం మళ్లీ వస్తాను” చెప్ప – వెల్లిపోయారు. విక్రమ్. పక్కనున్న కుర్చీలో కూర్చుంది. వాధిక, కీర్తన చదువుకునే రోజుళ్సింగ్ ముంచి స్నేహితురాళ్లు, కీర్తనకు డిగ్రీ అవుతుండగానే పెళ్లయిపోవటంతో ఆమె పిల్లలు కీర్తన పిల్లల కంటే పెద్దవాళ్లు ఆమె భర్త శ్రీరామ్ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. కీర్తన కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజినీర్ చేస్తోంది. కీర్తన కూతురికి పెళ్లయింది. నాలుగు నెలల క్రితం కూతురి డెలివరీ కోసం, ఆఫీసులో లాంగ్ లీవ్ తీసుకొని ఆస్ట్రేలియా వెళ్లి వారం క్రితమే వచ్చింది. కీర్తన. ఇంకా డ్యూటీలో చేరలేదు. తరచూ స్నేహితురాళ్లిద్దరూ ఫోన్లో సంభాషిస్తూ, ఒకరితో ఒకరు తమ వ్యక్తిగత విషయాలు పంచుకుంటూనే ఉంటారు. ఇద్దరి మధ్య రహస్యాలేం ఉండవు. “తను ఆస్ట్రేలియాలో ఉన్న ఆ నాలుగు నెలల్లో రాధిక ఇంట్లో ఏమైనా జరిగిందా? అయినా తనెక్కడున్నా కూడా అప్పుడప్పుడు తనూ, రాధిక ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు కదా! ఒకవేళ నేను కూతురినీ, పాపాయినీ చూసుకునే హడావుడిలో ఉంటానని నాతో ఫ్రీగా ఏదైనా పంచుకోలేకపోయిందా రాధీ! అయినా ఓ పద్ధతైన సాధారణ ఇల్లాలు అసలిలా డ్రగ్స్ కు ఎలా అలవాటు పడింది?” ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కింది కీర్తనకు, మనసు మనసులో లేదామెకు. 

“డాడీ ఊ…ఊ…” ఆలోచనలో ఉన్న కీర్తన, రాధిక మూలుగుతో ఉలిక్కిపడింది. “రాధీ…. రాధీ…” చేత్తో చిన్నగా తట్టుతూ పిలిచింది కీర్తన. మత్తుగా కళ్లు తెరిచి కాసేపు అయోమయంగా చూస్తూ “కీర్తూ, నువ్విక్కడున్నావేమిటే? అసలు నేనెక్కడున్నాను?” అడిగింది. “మధ్యాహ్నం నువ్వు బాత్రూంలో పడిపోయావని మీ మల్లమ్మ గాభరాగా. ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి, నిన్ను శ్రీరాం (ఫ్రెండ్ హాస్పిటల్లో చేర్చాను” చెప్పింది కీర్తన. “ఓ…” అని ఆలోచనలో పడిపోయింది రాధిక. కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. “అర్జున్ ఊళ్లో లేరా? ఎప్పుడొస్తారు?” అడిగింది కీర్తన. “ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉందని వెళ్లారు. సాయంకాలం వచ్చేస్తారు. కీర్తూ, నాకిప్పుడు బాగానే ఉంది. ఇంటికి పోదాం, డాక్టర్ గారిని అడుగుదామా?” అంటూ చిన్నగా లేచి వెనుకకి ఆనుకొని కూర్చుంది రాధిక. “వెళ్లవచ్చు, కానీ నీ ఈ పరిస్థితికి కారణం చెపితేగానీ వెళ్లనీయరు. అంతేకాదు, పోలీస్ కేస్ కూడా అవుతుందేమో!” నిశితంగా రాధికను చూస్తూ అంది కీర్తన. “పోలీస్ కేసా?” బిత్తరపోయింది రాధిక. “అవును. నువ్వు డ్రగ్స్ తీసుకున్నావని అన్నారు డాక్టర్ విక్రమ్. అది పెద్ద కేసే కదా! అసలు నీకు ఈ డ్రగ్స్ ఎట్లా అలవాటయ్యాయి? ఎక్కడ దొరికాయి? తెలిసి తీసుకున్నావా? తెలియక తీసుకున్నావా? ఇవన్నీ తెలవాలి వాళ్లకు. పోలీస్కు ఇన్ఫాం చేస్తామన్నారు. కానీ నువ్వు లేచాక తెలుసుకొని చెబుదామని ఆగారు. 

నువ్వు రెస్టు తీసుకో. కాస్త తేరుకున్నాక చెబుదువుగానీ” బత్తాయిరసం ఇస్తూ జవాబిచ్చింది కీర్తన. కళ్లు కిందికి దించుకొని మౌనంగా రసం తాగుతున్న రాధిక వైపు చూస్తూ “రాధీ, మీ మమ్మీ డాడీలను మర్చిపోలేకపోతున్నావా? నువ్వు ఆ తరువాత ఎప్పుడూ మాట్లాడకపోతే సద్దుకుపోతున్నావనుకున్నాను” రాధిక చేయి పట్టుకొని, మెత్తగా అంది కీర్తన. ఒక్కసారిగా రాధిక కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలిపోయాయి. “ఎట్లా మర్చిపోతాను కీర్తూ? నీకు తెలుసు కదా నేను ఒక్కదానినే కూతురునని, మమ్మీ డాడీతో నాకు అటాచ్మెంట్ ఎక్కువని. మిమ్మల్ని చూడాలని ఉంది వెంటనే రండి అని నేను హఠం చేస్తే వస్తున్న’ వాళ్లకు కార్కు ట్రక్ ఆక్సిడెంట్ జరిగి ఇద్దరూ అప్పటికప్పుడే మరణించటమూ, వాళ్లకోసమని లంచ్ తయారు చేసి ఎదురు చూస్తున్నదాన్ని వాళ్లను ఆ విధంగా చూడటం ఎంత షాక్! నేను రమ్మని గొడవ చేయకపోతే వాళ్లు అప్పుడు వచ్చేవారు కాదు కదా!” భోరున ఏడవసాగింది రాధిక. గబుక్కున రాధిక తలను తన పొట్టకానించుకొని నిమురుతూ “ఆక్సిడెంట్ జరిగిన రెండు నెలలకే నేను ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. నువ్వు కూడా అంటీ అంకుల్ గురించి మాట్లాడటమూ, ఏడవటమూ తగ్గించావు. కొద్దికొద్దిగా అలవాటు పడుతున్నావనుకున్నాను కానీ ఇంత బాధపడుతున్నావనుకోలేదు. నేనూ మా అమ్మాయి, పాప సంరక్షణలో పడి నిన్ను అంతగా పట్టించుకోలేదేమో! సారీ రాధీ, వెరీ వెరీ సారీ. 

అయినా రాధీ నీ బాధా నా దగ్గర దాయాలా? ఇదేనా మన స్నేహానికి అర్థం? పంచుకొని తగ్గించుకునే బదులు డ్రగ్స్కు అలవాటు పడ్డావా? అసలు అవి నీకు ఎట్లా అలవాటయ్యాయి?” బాధగా, అనునయంగా అంది కీర్తన. రాధిక చిన్నగా “ఎట్లా చెప్పమంటావు? మనవరాలు పుట్టిన సంతోషంలో, హడావిడిలో ఉన్న నీకు రోజూ చెప్పి ఎడవటం నాకు ఇష్టం టేకపోయింది. అప్పటికి నాతో క్లోజ్ గా ఉండే మా కిట్టి ఫ్రెండ్స్ రూపా, శైలజా వచ్చి నన్ను బలవంతాన సినిమాలకు, కిట్టి పార్టీకి తీసుకెళ్లేవారు. వాళ్లకు చెపుదామన్నా ఎన్ని రోజులు జిల్లా ఏడుస్తావు? ఎవరి సమస్యలు వాళ్లకు ఉన్నాయి అని విసుక్కుంటారేమోనని, చులకనవుతానని ఎవరికీ చెప్పేదానిని కాదు. కీర్తూ… రోజూ పొద్దున్నే పిల్లలిద్దరూ కాలేజ్కు వెళ్లగానే కాఫీ తాగుతూ దాడికి ఫోన్ చేసేదానిని. నేనూ డాడీ ఎన్ని కబుర్లు చెప్పుకునేవారమో! నాకు ఏదైనా సమస్య రాగానే డాడీతోనే చర్చించేదానిని, అమ్మ “నువ్వు దాడీ కూతురువే!” అని ఉడుక్కునేది. అమ్మలూ నీ కోసం టమాటా పచ్చడి చేసానురా, నువ్వు వస్తావా, నేను రానీ అని మమ్మీ అడిగితే- టమాటాపచ్చడి కోసం జూబిలీహిల్స్ నుంచి సికిందరాబాద్ వెళ్తావా? అని అర్జున్ ఏడిపించేవాడు. ఒకటా రెండు ఎన్నని చెప్పను? ఆ జ్ఞాపకాలను, వారి ప్రేమను ఆ ముద్దుమురిపాలను ఎట్లా మర్చిపోను?” చేతులతో మొహం కప్పుకొని ఏడవసాగింది రాధిక. 

రాధిక పక్కన కూర్చుని వీపు మీద సున్నితంగా రాయసాగింది కీర్తన.. కీర్తన ఇచ్చిన మంచినీళ్లు తాగి, కాస్త తమాయించుకొని “మా కిట్టీలో శకుంతల అని కొత్తావిడ చేరిందని చెప్పాను, గుర్తుందా కీర్తూ?” గుర్తుందన్నట్లు తలాడించింది కీర్తన. అర్జున్ పని చేసే కంపెనీలోని కొంతమంది ఆఫీసర్ల భార్యలు కలిసి ప్రతి నెలా కిట్టీపార్టీ చేసుకుంటారు. ఆ నెలలో పుట్టినరోజు, పెళ్లిరోజు ఉన్నవాళ్లతో కేక్ కట్ చేయిస్తారు. కాసేపు ఆటపాటలతో గడిపి, ఏదైనా అనాథాశ్రమంలో అన్నదానం చేస్తారు. రోజు కిట్టీలో వచ్చిన డబ్బుతో అవసరమున్నవారికి సహాయం చేస్తారు. తనకు అంతగా ఆసక్తి లేనందున ఆ గ్రూప్లో కీర్తన చేరలేదు. కానీ వాళ్ల విశేషాలన్నీ చాధిక చెపుతూ ఉంటుంది. ఆదంతా గుర్తు తెచ్చుకొని “అవును చెప్పావు. అవిడ చాలా ఆక్టివ్ అనీ, మీ కార్యక్రమాలు అన్నింటిలోనూ చాలా చరుకుగా పాల్గొంటుందని కూడా చెప్పొవు. అయితే?” అడిగింది. “నువ్వు ఆస్ట్రేలియా వెళ్లాక నాకు ఇంకా చాలా ఒంటరితనమనిపించింది. కిట్టి పార్టీకి కూడా వెళ్లాలనిపించేది కాదు. ఆ నెల రూప వచ్చి “ఎంతసేవని ఇట్లా కూర్చుంటావు?” అని పార్టీకి తీసుకెళ్లింది. ఆ పార్టీలో శకుంతల “మీరు ఏమిటి? ఇంతలా చిక్కిపోయారు? చాలా డల్గా అయ్యారు. జరిగింది విషాదమే కానీ మీరు దానిలో నుంచి బయటకు రావాలి. వంటరిగా ఉండకండి. నలుగురితో కలవండి” అని పార్టీ తరువాత వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది.

మీరు చాలా నీరసంగా ఉన్నారు. ఈ ఎనర్జీ డ్రింక్ తీసుకోండి అని ఒక జ్యూస్ ఇచ్చింది. అది తాగాక ఆ రోజు రాత్రి చాలా రోజుల తరువాత హాయిగా నిద్రపోయాను. మనసు తేలికైన భావన కలిగింది. ఆది మళ్లీ కావాలనిపించి మరునాడు. శకుంతలకు ఫోన్ చేసాను. తను తెచ్చి ఇచ్చింది. బయట కొనుక్కుంటానంటే అది బయట దొరకదని, చాలా కాస్ట్రీ, అని, కావాలంటే తనే తెచ్చిస్తానని తెచ్చి ఇచ్చేది, కొద్ది రోజుల తరువాత అది డ్రగ్స్ ఏమోనని నాకు అనుమానం వచ్చి ఆ రోజు తాగలేదు. కానీ శరీరం, మనసు నా మాట వినలేదు. చాలా తిక్కతిక్కగా అనిపించి శకుంతలకు ఫోన్ చేసి ఆ డ్రింక్ కావాలని అడిగాను. ప్రతిసారీ తను చాలా డబ్బులు వసూలు చేసేది. నా ఎకౌంట్లో ఉన్నవన్నీ కరిగిపోయాయి. అర్జున్ గమనించి అడిగితే ఏమి చెప్పాలా? అనీ, అట్లాని ‘ మానుకోలేక సతమతం అయ్యేదానిని. “నీ దగ్గర మనీ లేకపోతే మా కంపెనీకి మోడల్గా చేయి” అని అడిగింది శకుంతల. దాంతో తర్జన భర్జనలు పడి ఆ జ్యూస్ తాగకుండా ఉండలేక ఈరోజు తను రమ్మన్న సమయానికి పిల్లలిద్దరు కాలేజీకి వెళ్లగానే వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ నాకు మేకప్ చేస్తాడని, కెమెరామన్ అని ఇద్దరిని పరిచయం చేసింది. వాళ్లను చూడగానే నాకు చాలా భయం వేసింది. ఇక్కడ డ్రాయింగ్ రూంలో వద్దు, టెడ్ రూంలోకి వెళ్లాం’ అని  ఎందుకో జలదరించింది. మళ్లీ వస్తాను అని వెనక నుంచి శకుంతల పిలుస్తున్నా వెనకుండా ఇంటికి వచ్చేస్తాను. 

అదసలు మామూలు మోడలింగ్ కాదేమో, పైగా బెడ్ రూంలో అంటోంది.. అదేమి షూటింగో ఏమో, ఎంత ప్రమాదం నుండి బయట పడ్డాను అని ఇంటికి వచ్చాక కూడా ఆలోచిస్తుంటే కాళ్లు గజ గజా వణికిపోయాయి. నా తలలో హోరు మొదలయింది. వళ్లంతా వణికిపోతోంది. తిక్కతిక్కగా ఉంది. వెంటనే ఆ ఎనర్జీ డ్రింక్ కావాలి. లేకపోతే తట్టుకోలేను అని హైరానా పడిపోతున్నాను. ఎన్నాళ్లు ఇలాగా? ఆ షూటింగ్ జరిగివుంటే? ఆ పాడు డ్రింక్ కోసం ఎంత దిగజారిపోయేదానిని.. తలచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇట్లా బతకటం దండగ అనుకొని, ఆఫీస్ పనివత్తిడి తట్టుకోలేక ఎప్పుడైనా వేసుకోవటానికి అర్జున్ నిద్రమాత్రలు తెచ్చుకున్నాడు. అందులో నుంచి ఒకటొకటిగా తీసుకొని వేసుకుంటుంటే పిల్లలు అమ్మా! అని పిల్లలు పిలిచినట్లుగా అనిపించింది. చేతిలోకి తీసుకున్న టాబ్లెట్ను అలా చూస్తూ ఇంత పెద్దదానిని నేను మా అమ్మా నాన్నల మరణం తట్టుకోలేక * డిప్రెషన్లోకి పోయి డ్రగ్ ఎడిక్ట్ మారుతున్నాను. ఇక నేను లేకుండా నా కూతుళ్లు ఎట్లా ఉండగలరు?. ఇప్పుడిప్పుడే లోకాన్ని చూస్తున్నారు. కష్టమైన టీనేజ్లోకి వచ్చారు. వాళ్లు ఏ ప్రలోభాలకూ లొంగకుండా జీవితంలో నిలదొక్కుకునే వంకూ కనిపెట్టి ఉండాల్సిన బాధ్యత నాదే కదా! నా తల్లిదండ్రులు నన్ను ఎంత గారాబంగా చూసుకున్నారో.. నేనూ వాళ్లను చూసుకోవాలి కదా! ఎంత పొరపాటు చేయబోయాను. 

భగవంతుని దయవలన అంతగా ఎడిక్ట్ కాలేదు. ప్రయత్నం చేస్తే పోతుంది. ఏదైనా రిహాబిలేషన్ సెంటర్లో చేరి నా అలవాటును పోగొట్టుకోవాలి. నేను చానకూడదు అనుకొని అప్పటికే నాలుగు మాత్రలు లోపలికి పోవటంతో మత్తుగా మూసుకుపోతున్న కళ్లను బలవంతంగా తెరుచుకుంటూ టాబ్లెట్స్ వాంతి చేసుకుందామని బాత్రూంలోకి వెళ్లాను. అంతే! ఇప్పుడు ఇక్కడ నిన్ను చూస్తున్నాను” ధారాపాతంగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది రాధిక. “బాధపడకు రాధీ. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఇప్పుడు మునిగిపోయిందేమీ లేదు. మంచి ట్రీట్మెంట్ తీసుకుందువుగానీ, ఈ విషయాలన్నీ అర్జున్కు, శ్రీరాంకు, డాక్టర్ విక్రమ్కు చెబుదాం” అని కీర్తన అంటుండగానే డాక్టర్ విక్రమ్, శ్రీరాం అప్పుడే ఢిల్లీ నుంచి వచ్చి, విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన అర్జున్ లోపలికి వచ్చారు. అర్జున్ రాధిక పక్కన కూర్చొని చేయి పట్టుకొని ఆప్యాయంగా “నన్ను క్షమించు రాధీ, ఆంటీ, అంకుల్ మరణం నిన్ను బాధిస్తుందని తెలిసినా నువ్వు మామూలుగా తిరుగుతుంటే కోలుకుంటున్నావనుకొని నిన్ను అంతగా పట్టించుకోలేదు. ఇకనుంచి నిన్ను వదలను. ఈ డాక్టర్ చెప్పినట్లుగా మందులు వేసుకొని, వ్యాయామాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటావు. పిల్లల సెలవుల్లో అందరమూ కలిసి హాయిగా ఏదైనా టూర్ వెళ్లాం. ఇక ఆ శకుంతల సంగతి మా ఫ్రెండ్ డిఐజీకి చెపుతాను. ఆయన చూసుకుంటాడు” అన్నాడు. పిల్లలతో ప్రేమయాత్ర.. ఎంజాయ్ సెకండ్ హనీమూన్ అని అందరూ థంస్ అప్ చూపిస్తే సిగ్గుతో అర్జున్ వెనుక మొహం దాచుకుంది రాధిక.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870