हिन्दी | Epaper
చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం చెరపకురా చెడేవు ఎవరుతీసిన గోతిలో వాళ్లే.. అక్కరకు రాని సొత్తు సమాజం దేనినో కోల్పోతోంది.. బావిలో బంగారు నిధి నల్లకోడి తెల్లకోడి స్వయం కృషి ఒకే దెబ్బకు రెండు పిట్టలు మంచి మాస్టార్ ఐకమత్యమే మహా బలం

Story: అడగలేకపోయా

Madhavi
Story: అడగలేకపోయా

Grandfather experiences: భక్తి టీవీ’లో శ్రీ వేంకటేశ్వరుడి అభిషేక కార్యక్రమం వస్తోంది. ఆ వేళ శనివారం అని,

ఎప్పటిలా అమెరికాలో స్థిరపడ్డ అబ్బాయి కాసేపట్లో మాట్లాడతాడని గుర్తుకు వచ్చింది. ఏదో ట్రాన్సు లాంటి నిస్సత్తువ ఆయన్ను ఆవహించింది.

Grandfather experiences

ఇక్కడ శనివారం ఉదయం అబ్బాయికి శుక్రవారం సాయంత్రం, సోమవారం నుండి శుక్రవారం వరకు రోజూ పదిహేను గంటలు పనిచేసే బుద్ధిజీవులకు శని, ఆదివారాలు ఆటవిడుపు అయిదు రోజుల యాంత్రిక జీవనానికి ఊపిరి పీల్చుకునేందుకు కాస్త వెసులుబాటు. శనివారాలు భార్యాభర్తలిద్దరూ ఇల్లు క్లీన్ చేసుకుంటారు. గోడలు, కిటికీలు, కర్టెన్లు, పిల్లల గదులు, డ్రాయింగ్ రూంలో పరిచిన కార్పెట్లు, కిచెన్, బెడ్రూం, ఇంటిముందున్న లాను, గరాజు, కారు.. అన్నీ తలంటుకున్నట్లుగా తళతళలాడుతాయి. లంచ్ చేసి కాస్త విశ్రమిస్తారో లేదో.. మాల్స్ కు పరుగు పెడతారు. వారానికి సరిపడా బ్రెడ్, బటర్, జాం, పాలు, యోగర్ట్, పిల్లలు ఇష్టపడే చిరుతిళ్లు, బిస్కట్లు, సబ్బులు, సౌందర్య సాధనాలు.. ఇవన్నీ సమకూర్చుకుని ఇల్లు చేరేసరికి సాయంత్రం అవుతుంది.

ఆదివారం అంతా అవుటింగ్. పొద్దున్నే టీ, నాలుగు బిస్కట్లు తీసుకుని పిల్లలకు త్వరగా తయారయ్యే ముస్లి, లేదా నూడిల్స్ బ్రేక్ ఫాస్ట్.

క్రితం రాత్రి అంటే శనివారం నాడు టీవీలో తమకిష్టమైన ప్రోగ్రాం చూసి,

ఆలస్యంగా పడుకున్న పిల్లల్ని బలవంతంగా లేపి, బట్టలు మార్చి, పౌడరు అద్ది, కారులో ప్రయాణమవుతూనే నోట కుక్కటం, కుక్కుకోవటం.

సముద్ర తీరం, బీచ్ లేదా ముందే నిర్ణయించుకున్న ప్రకారం స్నేహితులతోనో,బంధువుల ఇళ్లలోనో రోజంతా గడిపి, అలిసి సొలిసి ఇల్లు చేరుతారు.

ఒక్కో రోజు, మరుసటి రోజు అంటే సోమవారం ఆఫీసులో చేయాల్సిన పనికి ఉపోద్ఘాతంలా కంప్యూటర్తో కాసేపు కుస్తీ పడతారు.

Grandfather experiences: భార్య పోయిన మరుసటి యేడు కొడుకూ, కోడలు బలవంతం మీద మూడు నెలలు ఉండాలనుకుని ఆయన అమెరికా వెళ్లాడు. వారంలో అయిదు రోజులు దంపతులు ఆఫీసుకు వెళతారు. పిల్లలు స్కూళ్లకు వెళతారు. సాయంత్రం ఇంటికి వచ్చిన పిల్లలకు, ప్రాజెక్టు వర్కు, టీవీ ప్రోగ్రాములు తప్ప, తాతయ్యతో ముచ్చటించాలని ఉండదు. కాస్త దగ్గరకు తీసుకుందామంటే తాతయ్య ఆలోచనల్లో వాళ్లకు ‘ముసలి వాసన’ వేస్తుంది. చెరో ల్యాప్టాప్ ముందున్న కొడుకూ, కోడలిని పలకరించాలంటే బెరుకు. డిస్ట్రబ్ అయిపోతారు. నిర్బంధపు జైలు జీవితంలా అనిపించింది. ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలలాడాడు. నెల రోజులకే ఆయనకు అమెరికా జీవితంపై మొఖం మొత్తింది. అబ్బాయితో పోరి, నెల రోజులకే తిరిగి ఇల్లు చేరేదాకా, ఆయనకంతా అయోమయం అనిపించింది. వేగంగా వెళ్లోన్న బస్సులు, ట్రక్కులు, కార్ల మధ్య ఆయన ఎడ్లబండి మీద నెమ్మదిగా వెళ్తున్నట్లు అనిపించింది. తాతల నాటి ఇక్కడి పెంకుటిల్లు, పెచ్చులూడుతోన్న మట్టిగోడలు, కిర్రుతలుపులు, నాపరాతి నేల, పెరట్లో అడ్డదిడ్డంగా పెరిగిన పూలమొక్కలు, కాకులు, కోకిలలు, పిచ్చుకల కిల కిలా రావాలు..వీటిముందు అమెరికాలో తాను చూసిన కోటలాంటి ఇల్లూ, సెల్లారు, అద్దంలా మెరిసే నేల మీద పరిచిన పెంకులు, రంగులీనే నునుపు గోడలు, వెలుగు చొరబడని గదులు, రిమోటుతో పనిచేసే గరాజు, ఇంటి తలుపులు, కిటికీలు, టీవీలు, ఏ.సి, మెషీన్లు.. ఇవన్నీ బలాదూరు అనిపించాయి.

Grandfather
Grandfather

వంటింట్లోంచి వచ్చిన టప్ మన్న శబ్దంతో మళ్లీ ఈ లోకంలోకి వచ్చాడు. స్టవ్ మీద ఉడుకుతోన్న అన్నం వేడి మూతను తోసేసింది.

ఓసారి కలియబెట్టి, ఆవిరిపోవటానికి గిన్నె మీది మూతను కాస్త ఎడంగా ఉంచి వెనక్కి వచ్చి మంచం మీదకు వాలాడు.

కూసాలు వదులైన పాత మంచం ఓసారి మూలిగి, కాస్త అటూ ఇటూ కదిలి సర్దుకుంది. వచ్చే నెల పెన్షన్జబ్బులు రాగానే మంచం రిపేరు చేయించాలి అనుకున్నాడు.

కప్పుగా పరిచిన పెంకుల కింది తడిక మీద ఎలుక పరుగుపెట్టింది కాబోలు.. చిన్నగా చప్పుడై, రెండు మూడు మంటిబెడ్డలు నేలకు రాలాయి. కోతుల ఆగడంతో ఇంటి మీద పరిచిన మట్టిపెంకులు అక్కడక్కడ లేచిపోయాయి. “వానాకాలం రాకముందే పెంకుల్ని సర్దించాలి.. లేకపోతే ఇల్లంతా జలమయం అవుతుంది. అనుకున్నాడు. ఎప్పుడో బిగించిన కరెంటు స్విచ్చులు వేయగానే నిలవటం లేదు. గట్టిగా నొక్కిపట్టి, రెండు మూడు సార్లు ప్రయత్నిస్తేగానీ బల్బులు వెలగటంలేదు. ఇంటికి రిపేర్లు అత్యవసరం అని ఆయనకూ తెలుసు. లోగడ కొడుకూ, కోడలు, పిల్లలు ఇండియా వచ్చినపుడు ఆ పాత ఇంట్లో ఉండలేక ఇబ్బంది పడ్డారు. మొహమాటంతో కొడుకు ఏమీ అనలేదు. ఆ ఇంట్లో ఉండలేనని కోడలు మొఖం మీదే చెప్పి అదే ఊళ్లో ఉంటున్న వాళ్ల అమ్మగారింటికి వెళ్లిపోయింది. వాళ్లు శ్రీ తిమంతులు. వియ్యంపుడు తన ఇంటిని ఆధునీకరించుకున్నాడు. ఇక మనవళ్ల దృష్టిలో బి. చెంచయ్య కాస్త బి.సి. తాతయ్య అయ్యాడు.

Grandfather

“ఈసారి పెన్షన్ డబ్బులు బ్యాంకులో పడగానే మంచం నేయించాలి, పెంకులు సర్దించాలి, కొత్త స్విచ్చులు బిగించాలి, బాత్రూంలో గీజరు పెట్టించాలి” అనుకున్నాడు. కానీ ఇవన్నీ సరిచేయటానికి డబ్బులేవీ? వస్తోన్న పెన్షన్ మొత్తం నెలవారీ నిత్యావసర ఖర్చులకే సరిపోవటం లేదు. ఉద్యోగం వచ్చి భార్య కాపురానికి వచ్చిన కొత్తలో రెండొందల ఎనభై రూపాయల్లో రాజాలా బతికాడు. వారానికో సినిమా. సినిమా చూసి వస్తూ వస్తూ హోటల్లో భోజనం. రోజూ మల్లెపూలు, ఏవో చిరు తిళ్లు, వయసు పైబడ్డ తల్లికి టానిక్కులు, మందులు. ఇవే కాకుండా ఆవిడ దాచిన ధర్మాలకు పదీ పరకా, ఆవిడ అడక్కుండానే చేతిలో పెట్టేవాడు. ‘నానమ్మా!’ (Grandma) అంటూ దగ్గరకు చేరిన పిల్లలకు రూపాయి, రెండు రూపాయలు చేతిలో పడగానే వాళ్ల కళ్లల్లోని మెరుపులు ఆవిడ కళ్లలోనూ కనిపించేవి. శిఖరాలెక్కిన సంతోషంతో పిల్లలు బయటకు పరుగులు తీస్తోంటే ఆమె ముఖంలో మతాబులు వెలిగేవి.

పదీ, పరకా అమ్మకు ఇస్తున్నప్పుడు ఆమె ముఖంలో కనిపించే వెలుగు,

ఆమె మనవళ్లకు ఇస్తోన్నపుడు వారిద్దరిలో చూసే సంతోషం ఆయనకు ‘ఇచ్చుటలో ఉన్న హాయి’ అన్న పాటను గుర్తుకు తెచ్చేది. “ఒరే! జోబీలో డబ్బులున్నాయి. ఒక రూపాయి తీసుకుని నీకిష్టమైంది కొనుక్కో!” అని నాన్న అనగానే ఆయనకు ఎంత సంతోషం కలిగేదో! “మా నాన్న ఇచ్చాడు” అని స్నేహితులకు గర్వంగా చెప్పుకుంటూ, జోబీ తడుముకోవటం ఎంత గొప్ప అనుభూతో! అవును.

అయినవారి దగ్గర నుండి అలా అందుకోవటం బాతు పెట్టిన బంగారు గుడ్డులా, తన పెట్టుబడికి వచ్చిన గొప్ప ప్రతిఫలంలా అనిపించటంలో ఆశ్చర్యం లేదు.

కొడుకు మనసులో ఏముందో బయట డటంలేదు. కోడలూ, పిల్లలు అక్కడే స్థిరపడాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. అయితేనేం..

ఆదుకోవాల్సిన బాధ్యత కొడుకుకు ఉండాలి. అదీ కాకుండా తదనంతరం ఈ ఇల్లు వాడికే చెందుతుంది! ఎంత అప్పు చేస్తేగానీ కొడుకు అమెరికా వెళ్లి చదవగలిగాడు. ఆ సంగతీ కొడుక్కి తెలుసు ఒకట్రెండు సార్లు కొడుకుతో ఇంటి మరమ్మత్తుల గురించి సూచనప్రాయంగా ప్రస్తావించాడు.

‘ఇంటి అప్పు, కార్ల లోన్లూ, పెట్రోలు, పిల్లల చదువు ఖర్చులు లంక మేత గోదావరి ఆ. ఈతలా ఉంది అన్న కొడుకు జవాబు. ఎటూ తేల్చకుండా “చూద్దాం నాన్నా!” అన్న ముక్తాయింపు. గూట్లోని గడియారం వేపు దృష్టి పోయింది. తొమ్మిది కావస్తోంది. అమెరికాలో ఇప్పుడు రాత్రి ఎనిమిదన్నర. ఏ క్షణాన్నయినా, అబ్బాయి దగ్గర నుండి ఫోను రావచ్చు. ఈసారి ఇంటి రిపేర్లకు చొంత డబ్బు పంపమని కాస్త గట్టిగానే అడగాలి. ఆశ్రద్ధ చేసే ఇల్లు మరీ శిథిలం అవుతుంది. అప్పుడు ఈ కాస్త నీడ కూడా ఉండదు. ఆత్మాభిమానం తనను పరాయి పంచన ఉండటానికి ఒప్పుకోదు. “అవును.. అడగాలి. ఇవ్వేళ అబ్బాయి ఫోను చేసినప్పుడు తప్పక అడగాలి” అనుకున్నాడు. ఫోను మోగింది. “హలో నాన్నా.. ఎలా ఉన్నావు?” అనుకున్నట్లుగానే అది అబ్బాయి నుండి వచ్చిన ఫోను. ఎప్పటిలానే కొడుకు ప్రశ్న. “నేను బాగానే ఉన్నాను. అక్కడ నువ్వు, కోడలు, పిల్లలు క్షేమమా?”

Father

Grandfather experiences: “గొంతులో ఆగిపోయిన ఆ ఒక్క మాట…”

ప్రశ్నలు,జవాబులు: డబ్బు పంపమని అడగమని మనసు గుర్తు చేస్తోంది. కానీ మాటలు పెగలటం లేదు.ఏదో మొహమాటం..బెరు..అడగాలనుకున్నది గొంతు దాటి బయటకు రావటం లేదు.

ఎండలు ఎలా ఉన్నాయనో,పక్కింటివాళ్లు,ఎదురింటివాళ్లు ఎలా ఉన్నారన్న రొటీను ప్రశ్నలు

అన్యమనస్కతతో ఇచ్చే జవాబులు.

కాసేపు రెండు వేపులా నిశ్శబ్దం.

“సరే నాన్నా! ఇక ఉంటాను.అక్కడ మీ ఆరోగ్యం జాగ్రత్త”

అవతల వేపు ఫోను పెట్టేసినట్లుగా ‘క్లిక్కు’ మన్న శబ్దం.

Grandfather experiences: ఆ శబ్దం విన్న ఆయన చేతిలోంచి కూడా రిసీవర్ జారి కింద పడిపోయింది. క్షణంపాటు ఏమీ తెలియని ప్రమత్తత. మరుక్షణం ఆ లోకానికి వచ్చాడాయన.

“ఈ తేపా అడగలేకపోయాను. వచ్చే వారం అబ్బాయి ఫోను చేసినప్పుడు తప్పక అడగాలి” అనుకున్నాడు. అలా ఆయన అనుకోవటం ఇది అరవై అయిదవసారి.

Read also: Telugu Moral Stories: కుందేలు నేస్తం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870