Giraffe s fall from pride:ఆ మర్రిచెట్టు ఎన్నో వేల సంవత్సరాల నుండి పక్షులకు, జంతువులకు ఆవాసమై ఉంటోంది. ఆ చెట్టుకు దగ్గర్లో ఒక నీటికొలను ఉంది.
ఆ చెట్టుకు తూర్పువైపు పెద్ద ఎడారి ఉంది. పడమరవైపు అడవి ఉంది.
రెండువైపులా జంతువులు నీడ, నీరు కోసం మర్రిచెట్టు దగ్గరకు వచ్చిపోతూ జిరాఫీ
ఉండేవి. అలా జంతువులకు స్నేహబంధాలు ఏర్పడ్డాయి.
ఇందులో జిరాఫీ, ఒంటె స్నేహబంధం ఒకటి. జిరాఫీ అందంగా ఉన్నానని, పొడవైన ఉందని అడవిలో వేగంగా పరుగెత్తగలననిగర్వపడేది.
‘మీలో ఎవరైనా నాతో పరుగుపందెంకు సిద్ధం కండి చూద్దాం’ అని జంతువులకు సవాల్ (challenge) విసిరేది.

జంతువులు దాని ఆటలను పట్టించుకునేవి కావు. ఒంటెను తక్కువ చేసి మాట్లాడుతూ ‘పరుగు పందెంలో నన్ను ఓడించగలవా?’
అని పదేపదే రెచ్చగొట్టేది. ఒకరోజు ఒంటె (camel) విసుగు చెంది ‘మిత్రమా! ఈరోజు పరుగు పందానికి నేను సిద్ధం’ అని సవాలు విసిరింది.
విజయం తనదేననే గర్వంతో జిరాఫీ మాట్లాడుతూ నాకు ఎక్కడైనా సరే.
నీ ఇష్టమైన చోటు
నిర్ణయించుకో’ అన్నది. అడవి మొదట్లో నుండి బయలుదేరి ఎడారిలోపల పది కిలోమీటర్లు
ఖర్జూరం చెట్టు వరకు చేరుకోవడం లక్ష్యమని ఒంటె నిర్ణయించింది. గుర్రాలు న్యాయనిర్ణేతలుగా,
జంతువులు, పక్షులు ప్రేక్షకులుగా ఉన్నాయి.
పక్షులు శంకాలరు ఊదినట్లు శబ్దం చేశాయి. పోటి
ప్రారంభమైంది. జిరాఫీ ఆత్రుతగా, వేగంగా పరుగు ప్రారంభించింది. ఒంటె, జిరాఫీ అడవి
నుండి ఎడారిలో ప్రవేశించాయి. ఎడారిలో ఏనాడూ నడవని జిరాఫీ కాళ్లు ఇసుకలోకూరుకుపోతున్నాయి.

దారిలో కిందపడి పైకి లేస్తూ ఆయాస పడుతూ ఉంది. ఒంటె
అడవిలో మెల్లిగా నడిచి, తనకు అలవాటైన ఎడారిలో వేగంగా పరుగెడుతూ వెనక్కి తిరిగి
చూడకుండా లక్ష్యం చేరుకుంది. కానీ అక్కడికి జిరాఫీ చేరనే లేదు. వెనక్కి తిరిగి చూస్తే
జిరాఫీ కనపడలేదు.
పైన ఎగురుతున్న పక్షులు జిరాఫీతో ఒంటె గమ్యం చేరిందని చెప్పి మర్రిచెట్టు దగ్గరకు పిల్చుకుని వచ్చాయి. జిరాఫీ తన ఓటమిని అంగీకరించింది.

తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పింది. మన మధ్య పోటీలు వద్దు. అందరం సమానమే. అడవిని కాపాడుకోవడమే
మన లక్ష్యమని జంతువులు | తీర్మానం చేశాయి. అహంకారం పతనానికి సోపానమని తెలుసుకొని జిరాఫీ అందరితో కలిసి హాయిగా జీవించసాగింది.
Read also:hindi.vaartha.com
Read also: