Education is the True Wealth: పార్వతిపురంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రసాద్, ప్రభాకర్ చదువుతున్నారు. ప్రసాద్ తెలివైనవాడే అయినా అల్లరిపిల్లల సహవాసం మొదలుపెట్టి, సినిమాలు, షికార్లు, చిరుతిండ్లతో జల్సాలు, కాలక్షేపం(pastime) చేస్తూ కాలం వృధా చేసుకోసాగాడు. జల్సాలు మాని బాగా చదువుకోమని ప్రభాకర్ ఎంత చెప్పినా ప్రసాద్ గొప్ప వినేవాడు కాదు. ఫలితంగా ప్రసాద్ కి బాగా తక్కువ మార్కులు, ప్రభాకర్ కి ఎక్కువ మార్కులు వచ్చేవి. అందరూ ప్రభాకర్ ని మెచ్చుకుంటుంటే ప్రసాద్ ఓర్వలేకపోయేవాడు. ప్రభాకర్ కి కూడా తక్కువ మార్కులు వచ్చేలా చేసి ప్రభాకర్ కి మంచి పేరు రాకుండా చేయాలని ప్రసాద్ భావించి, పరీక్షలు(Tests) రాగానే ప్రభాకర్ కి తెలియకుండా ప్రభాకర్ నోట్స్ లు కాజేసాడు. ఇంటికి వచ్చి ప్రభాకర్ బ్యాగ్ చూసుకుంటే ‘నోట్స్’లు కనిపించలేదు. ప్రభాకర్ చాలా బాధపడ్డాడు. ఈసారి పరీక్షల్లో ప్రభాకర్ కి తనకంటే ఘోరమైన తక్కువ మార్కులు వస్తాయని ప్రసాద్ భావించి తెగ సంబరపడిపోయాడు.

పరీక్షలు వచ్చాయి. అందరూ రాసారు. టీచర్లు ఫలితాలు ప్రకటిస్తూ విద్యార్థులు పేపర్లు చూస్తుకోవటానికి ఇచ్చి, మళ్లీ తీసుకున్నారు. ఆశ్చర్యం..!(Surprise..! ) ప్రభాకర్ కి చాలా తక్కువ మార్కులు వస్తాయని ప్రసాద్ భావిస్తే, ప్రసాద్ అంచనాలు తలకిందులు చేస్తూ ఇదివరకులాగే ప్రభాకర్ కి చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎప్పట్లాగే ప్రభాకర్ ని అందరూ మెచ్చుకున్నారు. ప్రభాకర్ కి అందరూ మెచ్చుకుంటుంటే అప్పటివరకు ఓర్వలేకపోయిన ప్రసాద్ ఈసారి ఏమాత్రం బాధపడకుండా ఆలోచనలో పడ్డాడు. “నేను ప్రభాకర్ నోట్స్ కాజేసినా అతడు ఇదివరకే అన్నీ చదువుకొని, ఎప్పటి పని అప్పుడే చేసుకోవటం వల్ల ఆ నోట్స్లు పోయినా ప్రభావం ఏం లేకుండా ఇదివరకులాగే ప్రభాకర్ కి ఎక్కువ మార్కులు వచ్చాయి. ఎవరైనా, ఏదైనా దోచుకోవచ్చుగానీ చదివిన చదువుని ఎవరూ దోచుకోలేరు. ఎవరైనా సంపదను పోగొట్టుకుంటారుగానీ చదువును పోగోట్టుకోలేరు. చదువు శాశ్వతంగా ఉంటుంది. అంటే అన్ని సంపదల కంటే చదువు ఒక్కటే విలువైన గొప్ప సంపద(Education is the True Wealth.) అటువంటి గొప్ప సంపద విలువ నేను తెలుసుకోకుండా ఎంతో విలువైన కాలాన్ని జల్సా జీవితంతో వృథాగా గడిపేశాను. అదీగాకుండా ప్రభాకర్ ని చూసి ఓర్వలేక అతనిపై అక్కసు పెంచుకున్నాను. అతని నోట్స్ కాజేశాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను. అతని నోట్స్ అతనికిచ్చేసి ప్రభాకర్ కి క్షమాపణ అడుగుతాను. నేను కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుని ప్రభాకర్ మెప్పు పొందాలి” అని మనసులో అనుకుని అలా నడచుకోసాగాడు.

ప్రసాద్ మారినందుకు ప్రభాకర్ చాలా సంతోషించాడు. ఇప్పుడు ప్రసాద్ కూడా ప్రభాకర్ తో పాటు అందరి అభినందనలు పొందసాగాడు.
Read also:hindi.vaartha.com
Read also: Domestic Helper: పెళ్ళాం ప్యాకెట్ మనీ