అమెరికా వెళ్లి నేను బాగుపడటం ఇష్టం ” లేదా?” అని స్వరం పెంచి తండ్రితో అన్నాడు శ్రీనివాస్. “అదేంటి బాబు, అలా అంటావు. నువ్వు పైకొస్తే ఎక్కువ సంతోషించేవాళ్లు తల్లీ, తండ్రేరా. మేం ఏం తప్పు అన్నామని అలా అంటావు” అన్నాడు రఘుపతి. అంతా వింటున్న కోడలు శైలజ కలగచేసుకొని మామగారితో అంది. “ఆయన ఏం తప్పుగా మాట్లాడాడు ? మీరే ఇలా తప్పుగా మాట్లాడితే ఎట్లాగు. ఎంకరేజ్ చెయ్యాల్సిందిపోయి నిరుత్సాహపరుస్తారా. ఇదేమన్నా బాగుందా” కోడలి మాటలు విని రఘుపతి ఊరుకోలేకపోయాడు. “నేను ఏమన్నానమ్మా. హైదరాబాద్లో ఉంటూ పెద్ద ఉద్యోగంలో ఉన్నావు. కదా. చిన్న ఉద్యోగం కాదు కదా. అంత దూరం పోయి అందర్నీ దూరం ఎందుకు చేసుకోవడం ఎందుకని? మాకు ఎవరున్నారు చెప్పు. మాకా వయసు ముంచుకొస్తోంది. ఈ వయసులో ఒంటరివాళ్లం అయిపోతాం. నాకా ఓపిక తగ్గిపోతోంది. దానికి తగ్గట్టు అనారోగ్యం. అమ్మని చూడు.. నువ్వు ఈ వార్త చెప్పినప్పటి నుండి ఎంత కుంగిపోయిందో” ఇదంతా చూస్తున్న రాధమ్మ కళ్లలో నీళ్లతో వంటింటిలోకి వెళ్లిపోయింది. రఘుపతి భారంగా కుర్చీలో కూలబడిపోయాడు. సాయంత్రం ఐదయ్యింది. రఘుపతికి ఇంకా మనసులో పొద్దున్న జరిగినవే గుర్తుకొస్తున్నాయి. భార్యతో అన్నాడు. “రాధా! ఎన్ని రోజుల నించి కొడుకు కోడలు అమెరికా వెళ్లటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు”. “వారం నుంచి వాళ్ల ప్రవర్తనలో మార్పు చూస్తున్నానండి.

ఎప్పటిలాగానే కోడలు నాతో సరిగ్గా ఉండటం లేదు. అబ్బాయి కూడా నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. నిన్న మటుకు అబ్బాయి స్వీట్ పాకెట్ తీసుకొచ్చి రెఫ్రిజిరేటర్లో పెట్టాడు. ఏదో వాళ్ల సరదా కోసం తెచ్చుకున్నారనుకొన్నాను. వీసా వచ్చిందని నాకేమీ చెప్పలేదు” అంది రాధమ్మ. “నాకూ చాలా బాధగా ఉంది రాధా. పరిస్థితి ఇంత దూరం వస్తుందనుకోలేదు. మనకి తెలియకుండా లక్షల ఉద్యోగం. వాడికి దేంట్లో తక్కువయిందని అమెరికాకి వెళ్లటానికి. ఇక్కడ లంకంత ఇల్లు ఉంది. ఇదంతా వాడిదే కదా. ఏ విధమైన బాదరబందీ లేదు” అని తన ఆవేదన, బాధ వెళ్లగక్కుకున్నాడు రఘుపతి. రఘుపతి రిటైర్ అయ్యి ఒక సంవత్సరం అయ్యింది. పెన్షను, బ్యాంకులో ఉన్న డిపాజిట్లతో ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేవు అతనికి. కొడుకు మీద ఆధారపడక్కర్లేదు. ఆరోగ్యం గురించే రఘుపతి ఆందోళన అంతా, గుండెలో ఉన్న వాల్వులే అతనికి సమస్య, ఇంకో రెండేళ్లలో ఆపరేషన్ చేయించుకోవాలి. పేసుమేకర్ కూడా పెట్టించుకోవాలి. మర్నాడు ఆదివారం, హాల్లో రఘుపతి పేపర్ చదువుకొంటున్నాడు. శ్రీనివాస్ వచ్చి దగ్గర అతన్ని చూసి మళ్లీ పేపర్ చదవడంలో మునిగిపోయాడు రఘుపతి,”” అని పిలిచాడు శ్రీనివాస్. ఏమిటన్నట్లు సేవర్లోంచి తల పైకెత్తి దూశాడు “నిన్న జరిగినదానికి సారీ డాడ్. ఇక్కడున్న కంపెనీలో ప్రమోషన్లు లేవు. ఇంకో కంపెనీకి మారాల్సిందే. అమెరికాలో అయితే లిమిట్ లేదు.

భవిష్యత్తు బాగుంటుంది. రాకేష్ కి చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది. మేమెళ్లిన తరువాత మీక్కూడా గ్రీన్ కార్డు ఏర్పాటు చేస్తాం” అన్నాడు శ్రీనివాస్, రఘుపతి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో శైలజ కూడా వచ్చి కూర్చుంది.. “చూడండి మావయ్యగారూ, మీకు ఇక్కడే బాగుంటుందని నాకు తెలుసు. మీరు ఇక్కడే ఉంటే బాగుంటుంది. శ్రీను అలాగే అంటాడు. పట్టించుకోకండి” రఘుపతి అవాక్కైపోయి కొడుకు మొహం చూస్తుండిపోయాడు. అంటే తాము వాళ్లతో అమెరికా వెళ్లడం కోడలికి సుతారమూ ఇష్టం లేదు. కొడుకువైపు చూశాడు. కొడుకు ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అలా పది రోజులు గడిచిపోయాయి. చాలా కష్టంగా గడిచినట్లుంది రఘుపతి దంపతులకి, కొడుకు, కోడలు ప్రయాణం కోసం వాళ్ల పనులు వాళ్లు చేసుకొన్నారు. ప్రయాణం అయ్యేరోజు వచ్చింది. రాత్రి ఏడు గంటలకి విమానాశ్రయానికి వెళ్లిపోయారు. మనవడిని వదల్లేక చాలా బాధ పడ్డారు రఘుపతి, రాధమ్మ. రోజంతా శ్రీనివాస్ కాలుగాలిన పిల్లిలా తిరుగుతూనే ఉన్నారు. వెళ్లేముందు తండ్రికి, తల్లికి ధైర్యం చెప్పాడు “మీరేమీ బాధపడకండి. అక్కడకు వెళ్లి సెటిల్ అవ్వగానే మిమ్మల్ని తీసుకెళ్తాను. రోజూ ఫోన్ చేస్తుంటాను. మీరు సంతోషంగా ఉంటే మాకు బాగుంటుంది” అని అన్నాడు. కోడలు ముక్తసరిగా వెళ్తున్నామని చెప్పింది. ఇల్లంతా బోసిపోయినట్లయింది.

ఆ రాత్రి రాధమ్మ ఏడుస్తూనే ఉంది. “ఎందుకు ఏడుస్తున్నావే? ఇదంతా ప్రారబ్దం. ఉన్న ఒక కొదుకు మన దగ్గర ఉండకుండా తన వారి తాను చూసుకున్నాడు. మనకి వచ్చే కాలమంతా ఒక గడ్డు కాలమే నీకు నేను, నాకు నువ్వు అంతే… మేన జనులు ఇల్లా గడిచిపోవాల్సింది. ఏడవకు” అని సమాచానపరచటానికి ప్రయత్నించాడు. అమెరికా వెళ్లగానే శ్రీనివాస్ పోన్ చేసి తల్లితో, తండ్రితో చాలాసేపు మాట్లాడాడు. రోజులు గడుస్తున్నాయి. మొదటి రెండు సంవత్సరాలు నెలకోసారి ఫోన్ వచ్చేది. ఆ తరువాత ఎప్పుడొస్తుందో తెలియదు. ఒకరోజు. ఫోన్ చేద్దామని ప్రయత్నించాడు. ఆ మొబైల్ నంబర్ వాడుకలో లేదని సమాధానమొచ్చింది. ఆ విధంగా కొడుకుతో మాట్లాడ్డం ఆగిపోయింది. కాలక్రమేణా రఘుపతి దంపతులు కూడా అలవాటు పడిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఇక్కడ అమెరికాలో శ్రీనివాస్ ఒక పెద్ద కంపెనీకి ప్రెసిడెంట్ అయ్యాడు. శైలజ కూడా ఒక ఇండియన్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. రాకేష్ ఒక మెడికల్ స్కూల్లో చదువుకొంటున్నాడు. అమెరికా పౌరసత్వం దొరికింది. న్యూయార్క్ ఇల్లు కొనుక్కొని స్థిరపడ్డారు. అమెరికాకి వెళ్లిన తర్వాత మళ్లీ ఇండియాకి రాలేదు. హైదరాబాద్లో వున్న రఘుపతికి ఆశ చచ్చిపోలేదు. ఎప్పుడైనా కొడుకు. వస్తాడని, మళ్లీ కొడుకుని చూస్తానన్న ఆశతోనే బతుకుతున్నాడు. రోజుకి ఒకసారైనా కొడుకును తలచుకుంటారు.

రఘుపతి దంపతులు. సంతోష సమయంలో గడిపిన రోజుల్ని తలచుకొంటూ కాలం గడుపుతున్నారు ఈ వృద్ధ దంపతులు. ఇప్పుడు రఘుపతి వయసు 80 సంవత్సరాలు. పదేళ్ల క్రితం గుండె కవాటాలకి ఆపరేషన్ అయ్యింది. ఈ మధ్యే పేస్మేకర్ కూడా పెట్టించుకొన్నాడు. రాధమ్మకి గుండెకి స్టెంట్ వేశారు. కొడుకు వ్యవహారంలో చాలా చితికిపోయారు. ఖాళీగా వున్న రూంలన్నింటికీ తాళాలేసి ఒకే రూములో కాలం గడుపుతున్నారు. నెల నెలా వచ్చే పెన్షన్, రఘుపతి ఉద్యోగం చేసినప్పుడు చేసిన పొదుపుతో దేవుడి దయ వల్ల వాళ్లకి ఆర్థిక ఇబ్బందులేమీ లేవు. రఘువతికి దగ్గరి బంధువులెవరూ లేరు. వరసకు తమ్ముడైన రామారావు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాడు రాకేష్ ఎండీ పూర్తి చేసి ఒక మెడికల్ చేరాడు. ఒకరోజు వాళ్ల డైరెక్టర్ పిలిచి ఇండియా వెళ్లటానిర్ ప్రస్తావించాడు. హైదరాబాద్లో శస్త్రచికిత్సలో రోబోల పాత్ర గురించి ఒక అంతర్జాతీయ సమావేశం వచ్చే జరగుబోతోంది. వాళ్ల 16న నుంచి ఒకరిని పంపించవచ్చు. దానికి సుముఖంగా ఉంటే రాషి ఆ అవకాశం దొరుకుతుంది. రాకేష్కి ఎగిరి. గంతేసినట్లయింది. వెంటనే ఒప్పుకున్నాడు. ఇండియాకి వెళ్లటానికి వీసా తీసుకొని రెడీగా ఉండమన్నాడు డైరెక్టర్, ఆదేరోజు వీసాకి అపై చేశాడు రాకేష్, సంతోషంగా తండ్రికి ఫోన్ చేశాడు రాకేష్ “డాడ్! నాకు హైదరాబాద్ వెళ్లటానికి అవకాశం వచ్చింది. అక్కడ ఒక సమావేశంలో పాల్గొనాలి.

వచ్చే నెల పదవ తారీజే నా ప్రయాణం”. ఎంత సంతోషంగా ఫోన్ చేసాడో అంత నిరాశను ఎదురైంది. తండ్రి ఏమీ మాట్లాడలేదు. చివరగా అన్నాడు. “సాయంత్రం అమ్మతో మాట్లాడదాం”. కానీ శైలజ గట్టిగా అంది ఇండియాకి వెళ్లొద్దని, “అదేమిటమ్మా! అట్లా అంటావు. ఇది. అంతర్జాతీయ సమావేశం. దీంట్లో పాల్గొనటమే ఒక గొప్ప విషయం. నువ్వేమన్నా అను. నేను మాత్రం హైదరాబాద్ వెళ్తున్నాను” అని రాకేష్ లేచి వెళ్లిపోయాడు. రాత్రి ఏమి ఆలోచించుకొన్నారో ఏమో..! తల్లిదండ్రులు ఉదయం బ్రేక్ ఫాస్ట్ దగ్గర ఒప్పుకొన్నారు. రాకేష్ హైదరాబాద్ చేరుకొన్నాడు. ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్లో సమావేశం. అక్కడే రూము కూడా. ఇచ్చారు. రెండు రోజుల సమావేశం తర్వాత హాస్పిటల్, మెడికల్ కాలేజ్ సందర్శన. మొదటి రెండు రోజులు బాగా బిజీగా గడచిపోయాయి. రాకేష్ కూడా ఒక చిన్న పేపరని చదివాడు. రేపు హాస్పిటల్ పర్యటన తర్వాత సమావేశం అయిపోతుంది. ఇంకా వది రోజుల వీసా గడువు ఉంది. మళ్లీ స్వదేశం వెళ్లటానికి విమానం టికెట్కి మూడు రోజుల టైముంది. ఇక్కడే ఉండి తాత వాళ్ల గురించి కనుక్కోవాలి, మర్నాడు హాస్పిటల్ పర్యటన మొదలైంది. అది హైదరాబాద్లోని అతి పెద్ద హాస్పిటల్ అన్ని డిపార్టుమెంట్లు. ఉన్నాయి. ఈ హాస్పిటల్ నగరంలోని అతి పెద్ద మెడికల్ కాలేజీకి అనుబంధ సంస్థ: హాస్పిటల్ పర్యటనలో భాగంగా మెడికల్ కాలేజీ పర్యటన కూడా ఉంది.

మొదట హాస్పిటల్ పర్యటన ముగించుకొని కాలేజీదారి పట్టారు సమావేశానికి వచ్చిన సభ్యులు, కాలేజీకి రాగానే ప్రిన్సిపాట్ని కలిశారు. ఆయన చాలా సంతోషంగా అందర్నీ ఆహ్వానించాడు. ప్రతి డిపార్టుమెంటు చూసుకొంటూ అనాటమీ డిపార్టుమెంటుకి వచ్చారు. అనాటమీ ప్రొఫెసర్ అప్పుడే జరుగుతున్న క్లాస్కి ఆహ్వానించాడు. అదొక పెద్ద హాల్, అక్కడ మనిషి శరీర భాగాల్ని గురించి విద్యార్థులకు వివరిస్తుంటారు. అప్పుడే ఒక మగ మనిషి దేహాన్ని గురించి ” వివరిస్తున్నారు. రాకేష్ కుతూహలంగా దగ్గరగా వెళ్లి చూశాడు. ఒక్కసారి షాక్ – అయినట్లయింది. అప్పుడే కెమికల్ లోంచి తీసారేమో… ఆ మనిషి మొహం స్పష్టంగా కనిపించింది. రాకేష్కి ఎక్కడో ఎప్పుడో చూసినట్లుంది. మొహం పరిచయంగా అనిపించింది. ఆజానుబాహువైన దేహం. పచ్చటి తెలుపు, ఎక్కడో చూశాను.. అని అనుకొన్నాడు రాకేష్, బాగా దీక్షగా చూస్తే తండ్రి శ్రీనివాస్ మొహంలా అనిపించింది. ఆ ఒడ్డూ పొడుగు అచ్చు డాడిలా ఉంది. పర్యటన అయిపోయింది. దీంతో సమావేశం కూడా పూర్తయింది. రాకేష్ మెల్లిగా అనాటమీ ప్రొఫెసర్ దగ్గరకి వెళ్లి తనని తాను పరిచయం చేసుకొన్నాడు. హైదరాబాద్ స్వస్థలం అని చెప్పగానే ప్రొఫెసర్ సంతోషంగా తానేమీ చేయగలనని అడిగాడు. “సర్, నాకు ఆ డెడ్ బాడీ గురించిన వివరాలు కావాలి”, “అదెందుకు? అయినా వివరాలు దొరకటం కష్టం” అన్నాడు ప్రొఫెసర్. “ఎట్లాగైనా ఈ సహాయం చేసిపెట్టాలి.

నేను కొద్ది రోజులు హైదరాబాద్లోనే ఉంటాను” అంటూ ప్రాధేయపడ్డాడు. రాకేష్, “మీరు రేపు పది గంటలకి రండి. నేను ప్రయత్నిస్తాను” అంటూ తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు ప్రొఫెసర్ ప్రొఫెనగ కలిశాను వరీ లక్నీ క్యాన్ వివినా దొరికాయి. పెద్ద నిటుంబం తన్నిన పక్షి తాత పేరు చూసి నిరాంతపోయారు ప్రొఫెసర్ రాకేసిచ్చాను. వివరాలో ధన్యవాదాలు చెప్పి, రాకేష్ హోటల్కి వెళ్లిపోయాడు. ఊబర్ టాక్సీ వాడి సహాయంతో ఆ అడ్రసు ఉన్న ఇంటికి వెళ్లాడు. రెండు అంతస్తుల పాత ఇల్లు ఆది. ఇల్లు పెద్దగానే ఉందనుకొన్నాడు రాకేష్ గేట్ తీసి లోపలికి ప్రవేశించాడు. షాక్ తిన్నట్టు ఒక అడుగు వెనక్కేశాడు. ఏమిటి.. ఏనువుతోంది తనకి, ఏదో కొత్త అనుభూతికి లోనయ్యాడు. మెల్లిగా అడుగులో అడుగు వేసుకొంటూ ముఖద్వారం దగ్గరికి వచ్చాడు. కాలింగ్ బెల్ నొక్కాడు. లోపల్నుంచి ఏవో మంత్రాలు వినిపిస్తున్నాయి. 50 యేళ్ల మనిషి “ఎవరండీ, ఎవరు కావాలి?” అనుకొంటూ వచ్చాడు. “ఇది రాజా రఘుపతిగారి ఇల్లేనాండీ?” అంటూ మొదట ఇంగ్లీషులో తరువాత వచ్చిరాని తెలుగులో అడిగాడు. “అవును. ఇది ఆయన ఇల్లే. ఆయన పోయారు. బామ్మని పిలవమంటారా?” అని సమాధానమిచ్చాడు ఆ మనిషి. అప్పటికే రాకేష్ కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.

గొంతు పొడారిపోయింది. సన్నని గొంతుతో “పిలవండి” అన్నాడు. “ఎవరబ్బా?” అనుకొంటూ ఒక ముసలావిడ వచ్చింది. డెబ్భై ఐదు ఏళ్లుంటాయేమో! వచ్చి నుంచుంది. “నేనే… నేను…” అని తడబడుతున్నాడు. రాకేష్, చివరకి గొంతు పెగుల్చుకొని బామ్మా అంటూ ఆ ముసలావిడని పట్టుకొన్నాడు. రాకేష్ బాబు అంటూ గుండెలకు హత్తుకొంది. రాధమ్మ, ఇద్దరూ పెద్దగా ఏడుస్తున్నారు. నీ తాతయ్య ఇక లేదురా. నువ్వింకా ఎవర్ని తాతా అని పిలుస్తావు? అంటూ గట్టిగా రోదిస్తోంది రాధమ్మ. పది నిమిషాలదాకా ఇద్దరూ తేరుకోలేదు. “మీ అమ్మ, నాన్న ఏరి?” లాధమ్మ అడిగింది. “వాళ్ల రాలేదు బామ్మా. అయినా వాళ్లకి తాత గురించి తెలియదు. నాకూ ఇప్పుడే తెలిసింది. నేను పని మీద హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడే డాడీకి ఫోన్ చేసి పోశారు రామ్ కాపెరికాలో ఉదయం అదే విషయం శ్లేష్ అమ్మకి చెప్పాడు.. పౌమ్య మొహంలో తెలుగు కనిపించింది. అయిపోయిందని లోపల్నింది బ్రాహ్మడి గొంతు గట్టిగా వినిపించింది. నాన్నా” అంటూ రాకేషని లోపలికి చేసినా తీసుకెళ్లింది. రాధమ్మ. “ఎవరీ అచ్బాయి? అని హాల్లో, కూచున్నాయన ఓనాయన అడిగాడు. “నా మనవడ్రా అబ్బిగా, అమెరికా నుంచి వచ్చాడు” అని గర్వంగా బదులిచ్చింది రాధమ్మ. “ఏం చదువుకొన్నావు బాబూ?” అంటూ ఇంకొకాయన అడిగాడు. బామ్మ వేపు చూస్తూ “నేను డాక్టర్నండి” అని సమాధానమిచ్చాడు రాకేష్, అది విన్న వెంటనే హాలులో ఉన్న అందరి మొహాల్లో ఒక ఆరాధన లాంటిది. కనిపించింది.

రాధమ్మకి, మనవడివైపు గర్వంగా చూస్తూ మనవడి చేతిని ఇంకా గట్టిగా పట్టుకొంది రాధమ్మ. పిండాల్ని చూపిస్తూ “వీళ్లే మీ తాత ముత్తాతలు. నమస్కారం చేసుకో బాబూ” అని అన్నాడు బ్రాహ్మడు.”సమయానికి మీ మనవడు వచ్చాడు. రఘుపతిగారి ఆత్మకు శాంతి కలుగుతుంది” అని ఒక ముసలాయన అన్నాడు. భోజనాలు అయిన తరువాత రాకేష్ వెళ్తానని రాధమ్మతో చెప్పాడు. రాధమ్మ ఒప్పుకోలేదు. “అప్పుడే అమెరికా వెళ్లిపోతావా?” అంటూ కళ్లలో నీళ్ల పెట్టుకొంది. “లేదు బామ్మా! హోటల్ నుంచి నా సామాను తెచ్చుకొంటానన్నాడు రాకేష్ “సరే.. వెంటనే వచ్చేసేయి” అని ఒప్పుకుంది. రాధమ్మ, రెండు గంటల్లో సామానుతో సహా తిరిగి వచ్చాడు రాకేష్, రాధమ్మ చూపించిన ప్రేమతో రెండు రోజులు రెండు నిమిషాల్లాగా గడిచిపోయాయి. చెప్పిన ప్రకారం శ్రీనివాస్ హైదరాబాద్ వచ్చి హోటల్లో దిగి కొడుక్కి ఫోన్ చేశాడు. తండ్రి మీద బాగా కోపం వచ్చింది. రాకేష్క. వెంటనే బయలుదేరి ఇంటికి నన్చెయ్యమని నాకేష్ గట్టిగా చెప్పాడు. కొదుకు మనసు గ్రహించి వెంటనే ఇంటికి వచ్చేశాడు శ్రీనివాస్, తల్లిని చూడగానే సిగ్గుపడ్డాడు. వాధమ్మ చేసిచడానికి తల్లికి క్షమాపణలు క్షమించేసింది. చెప్పాడు. తల్లిమనను అన్నింటిని

రెండు రోజులు రాకేష్ తీవ్రంగా ఆలోచించాడు. తాత పోయిన తర్వాత బామ్మ ఒంటరిదైంది. బాముని అమెరికాకి తీసుకెళ్లామంటే అమ్మ ఒప్పుకోదు. తాత ఆత్మశాంతి కోసం నే ఏదో ఒకటి చెయ్యాలి. చివరగా ఒక నిర్ణయానికి వచ్చాడు. బామ్మ లేని. సమయం చూసి తండ్రితో మాట్లాడాడు. “రాష్! నేనొక నిర్ణయానికి వచ్చాను. బామ్మకి తోడుగా ఇండియాలో ఉండిపోతాను. ఈ ఇంట్లోనే ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. నాది అమెరికా డిగ్రీ కాబట్టి ఇక్కడేమి సమస్య ఉండదు. రెండేళ్ల తర్వాత హాస్పిటల్ ప్రారంభిస్తాను. దీనికి మీ సహాయం కావాలి. మీరు ఇండియాకి వచ్చే పరిస్థితిలో లేరు. బామ్మని అమెరికా తీసుకెళ్లలేం. బామ్మ ఉన్నంత కాలం నేను బామ్మ దగ్గరే ఉంటాను. నేను అమెరికన్ పౌరుడిని కాబట్టి ఎప్పుడైనా నేను అమెరికా వెళ్లిపోవచ్చు. ఓవర్సీస్ సిటిజెన్షిప్ ఆఫ్ ఇండియా కార్డు తీసుకొంటే ఇండియాలో ఉండటానికి సమస్య ఉండదు. వీలున్నప్పుడల్లా నిన్ను, అమ్మని చూడటానికి అక్కడికి వస్తుంటాను” అన్నాడు. రాకేష్ నిర్ణయం విన్న శ్రీనివాస్ నిర్ఘాంతపోయాడు. మొదట ససేమిరా ఒప్పుకోలేదు. చివరికి కొడుకు పట్టుదల చూసి ఒప్పుకోక తప్పలేదు. భార్యతో ఫోన్లో మాట్లాడాడు శ్రీనివాస్. సంగతులన్నీ వివరంగా చెప్పాడు. అమెరికా వచ్చిన తరువాత اد వివరంగా మాట్లాడుకొందామన్నాడు. కొడుకు పట్టుదల గురించి ఆమెకు బాగా తెలుసు కనుక ఒప్పుకోక తప్పలేదు. తాము తెచ్చిన సంబంధాన్ని రాకేష్ ఒప్పుకోవాలన్న షరతు మీద అంగీకరించింది. రాకేష్ దానికి అభ్యంతరం చెప్పలేదు. ఒక నెల తరువాత రఘుపతి ఇంటి గోడ మీద పెద్ద అక్షరాలతో రాజా రఘుపతి క్లినిక్ అనే బోర్డు పెట్టబడింది. అదే బోర్డులో కింద డాక్టర్ రాకేష్ ఎండి(యుఎస్ఎ) అని రాయబడి ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: