ఎందుకమ్మా ఆడపిల్లకు చదువులు? నిన్ను ఎప్పటికైనా ఒక అయ్య చేతిలో పెట్టాల్సిందే కదా! అనే తల్లిదండ్రులు ఇంకా మన దేశంలో చాలా మందే ఉన్నారు.
ఆడపిల్లను అదుపులో పెట్టి అణిగి మణిగి ఉండండంటూ ఆంక్షలు పెట్టి, కట్టడి చేస్తూ, కంచెలు వేస్తూ వారి ఎదుగుదలకు తల్లిదండ్రులే గోడలు కడుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం ఎంతో అవసరం. అందుకు చదువే సరైన ఆయుధం. ఈ సృష్టికి దృష్టి స్త్రీ. ఇంటి గడప నుండి మొదలుకుని సమాజాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని సైతం నడిపించే ధీర వనిత స్త్రీ. అటువంటి స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం సమాజంలో స్త్రీ, పురుషుల మధ్య తేడా లేని సమ భాగస్వామ్యాన్ని చూపిస్తుంది. ప్రస్తుత రోజుల్లో స్త్రీల ఆర్థిక స్వాతంత్ర్యానికి మరింత చైతన్యం కావాలి. అప్పుడే ప్రతి మహిళ గొంతెత్తి నచ్చిన అభిప్రాయాలు చెప్పగలదు. ఉన్నత స్థానం వరకు వెళ్లగలదు. చరిత్రనే తీసుకోండి.. దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మొదటి మహిళ ఝాన్సీ లక్ష్మీబాయి. మొదటి మహిళా టీచర్ సావిత్రిబాయి ఫూలే. ఏకైక తొలి మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ. తొలి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీబీ. అంతెందుకు.. ప్రస్తుత మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము… ఇలా ఎందరో మహిళలు మహిళా లోకానికి స్పూర్తిగా నిలిచారు. అయినా కానీ మన దేశంలో ఇప్పటికీ ఇంకా మహిళా సాధికారత సంపూర్ణం కాకపోవడం ఎంతో విచారకరం” అంటూ క్లారిటీగా, కాన్ఫిడెన్స్ గా స్టేజి పైన మాట్లాడుతున్న రూపను ఆర్తిగా చూస్తున్నాడు మురళి, ఆమెలోని ఆత్మవిశ్వాసం అతనికి బాగా నచ్చాయి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తాను పని చేస్తున్న కంపెనీ నిర్వహించిన “వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. అవార్డ్స్” వేడుకల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చూపుతున్న మహిళామణులకు అవార్డ్స్ ప్రధానోత్సవం జరుగుతుంది. అందులో భాగంగానే రూప వేదికపైన ప్రసంగాన్ని వినిపిస్తోంది. ప్రోగ్రాం కవర్ చేయడానికి పబ్లిక్ టీవీ చానెల్ నుండి రిపోర్టర్ మురళి వచ్చాడు. రూప కట్టు-బొట్టు, నడక-నడత ముఖ్యంగా ఆమెలోని ఆత్మవిశ్వాసం అతన్ని కట్టిపడేశాయి. తన పని తను చేసుకుంటూ తదేకంగా ఆమెను చూస్తూ ఉన్నాడు. అతని చూపులు రూప పసిగడుతూనే ఉంది. స్పీచ్ అనంతరం రూప దగ్గరకు వచ్చిన మురళి “హాయ్ అండీ. మీరిచ్చిన స్ఫూర్తి అద్భుతం. ఐ యాం మురళి, పబ్లిక్ టీవీ రిపోర్టర్” అని చెప్పి పరిచయం చేసుకున్నాడు. నవ్వుతూ “థ్యాంక్సండీ’ అని చెప్పి కదిలింది.
“ఒక్క నిమిషం అండీ” అన్నాడు. ఆగి “యా.. చెప్పండి” అంది. నెక్స్ట్ వీక్ మేం విలేజ్ కండక్ట్ చేస్తున్న ప్రోగ్రాంలో మహిళలకు ఇంతే స్ఫూర్తితో మీ నుండి మేం ఒక స్పీచ్ ఆశిస్తున్నాం. తప్పకుండా వచ్చి అక్కడి లేడీస్కు ఇంతే స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నాను” అన్నాడు. అందుకు నవ్వుతూ “అవునా? తప్పకుండా. బట్ విలేజ్ అంటున్నారు??” అని అడిగింది. “అవునండీ.

హైదరాబాద్ నుండి జస్ట్ కిలోమీటర్ల దూరంలో” అని చెప్పాడు. “ఇంట్లో అమ్మని అడిగి చెప్తా. అంత దూరం, పైగా పల్లెటూరు కదా!” అంది. “ఒకే. మీ రిప్లై కోసం వెయిట్ చేస్తుంటాను” అన్నాడు సంతోషంగా. సరే.. ” అని చెప్పి కదిలింది. వెళ్తుంటే ఆమెనే చూస్తున్నాడు. మురళి, వెనక్కి తిరిగి చూస్తుందేమోనన్న ఆశతో, కానీ అతని ఆశ నిరాశయింది.. అనుకుంటూ వెనుదిరిగేలోపు మురళిగారూ.. అని పిలిచింది. ఆ పిలుపుతో ఉబ్బి తబ్బిబ్బయ్య “చెప్పండి..” అన్నాడు స్పీడ్గా “ప్రోగ్రాంకి రమ్మని ఇన్వైట్ చేశారు. కానీ కాంటాక్ట్ల ఉండడానికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదు” అని అడిగింది. “సారీ, సారీ,, అంది” అంటూ తన ఫోన్ నంబర్ ఇచ్చాడు. “థాంక్యూ” అని చెప్పి అక్కడి నుంచి కదిలింది రూప, మధ్యాహ్నం జరిగిన ప్రోగ్రాం రాత్రి టీవీలో వస్తుంటే తీక్షణంగా వీక్షిస్తున్న రూపను చూసి “ఏంటి? ఇవాళ వచ్చిన దగ్గరి నుండి టీవీకి అతుక్కుపోయావ్! భోజనం వద్దా? నిన్ను నువ్వు టీవీలో చూసుకుంటే కడుపు నిండిపోయిందా? ముందు అన్నం తిను” అంటూ అన్నం పెట్టి ఉన్న ప్లేట్ని రూపకు అందివ్వబోయింది తల్లి. “అబ్బా.. ఉండమ్మా. కాసేపయ్యాక తింటాలే” ప్లేట్ తీసుకుని టీపాయ్ పైన పెడ్తూ చెప్పింది. నిట్టూర్చిన తల్లి “సరే నీకిష్టం వచ్చినప్పుడు తిను.

నా మాట నువ్వు ఎందుకు వింటావ్? నేను వద్దన్న పనే నువ్వు చేస్తావ్. హాయిగా ఉద్యోగం చేసుకోమని చెబితే ఉద్యమాలు, సేవలు, స్వేచ్ఛ అంటూ ఉపన్యాసాలు ఇస్తోంది” అంది కోపంగా. తల్లి మాటలు పట్టించుకోకుండా “అమ్మా, పబ్లిక్ టీవీ చానెల్ రిపోర్టర్ మురళి అట, నా స్పీచ్ తనకు బాగా నచ్చిందనీ, తను ఒక విలేజ్లో కండక్ట్ చేస్తున్న ప్రోగ్రాంలో నెక్స్ట్ వీక్ ఒక స్పీచ్ ఇవ్వాలని అడిగాడు. సరేనని చెప్పాను. వీలైతే ఇద్దరం కలిసి వెళ్లాం” అంది. ఆ మాటకు అప్పటికే కోపంగా ఉన్న తల్లికి మరింత కోపం వచ్చింది. నేనేం చెబుతున్నాను.. నువ్వేం చెప్తున్నాయ్. మతుండే మాట్లాడుతున్నావా? విలేజ్ అన్నా, విలేజ్ మనుషులన్నా నచ్చకనే ఇక్కడికి వచ్చి వద్దాం. ఇప్పుడు మళ్లీ నువ్వు ఆడే బాట పడుతున్నాయ్! నోరు మూసుకొని అన్నం తిని పడుకో, చాలా పొర్లు పోయింది” అంటూ సీరియస్గా చెప్పింది. తల్లి కోపానికి అలిగిన రూప “నువ్వొస్తానంటేనే నేను వెళ్తాను. అలా. అని మాట ఇస్తేనే ఇప్పుడు అన్నం తింటాను” అని చెప్పింది. “అబ్బా… నీతో ఇదే తలనొప్పి, సరే! వారం తర్వాత కదా చూద్దాంలే. ముందు అన్నం తిను” అంది తల్లి.
వారం తరువాత.. విలేజ్లో లొకేషన్కు వచ్చి ఆగిన కారులోంచి బయటకి చూసిన తల్లి కళ్లకు ‘ఉమా మాధవ్ మహిళా సాధికారత ట్రస్టు’ అని పెద్దన పెద్ద అక్షరాలతో ఉన్న బోర్డు కనిపించింది.

ఒక్క క్షణం ఆమె గుండె ఆగి మళ్లీ కొట్టుకుంది. విశాలమైన స్థలంలో యేపుగా పెరిగిన చెట్లు అక్కడ అడుగు పెట్టిన వారికి స్వాగతమంటూ సెల్యూట్ చేస్తున్నట్టుగా దర్శనమిస్తున్నాయి. అలా ముందుకు వెళ్తే రకరకాల పూలతోటలు నవ్వుతూ పలకరిస్తున్నాయి. అవి దాటగానే ట్రస్టు భవనం, దాని ముందు ఇరువైపులా చల్లని నీడనిచ్చే చెట్లు, ఆ చెట్ల నీడల్లో విశాలమైన అరుగులు వున్నాయి. అక్కడ వృద్ధ మహిళలు నడకకు వచ్చి సేద తీరుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఆటు పక్కనే ‘ఉమాదేవి గ్రంథాలయం’ ఉంది. అది చూసి తల్లీ కూతుళ్లు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ ప్రదేశం వారిద్దరికి ఎంతో నచ్చింది. టైజ్లుడిలో వున్న అన్ని రకాల నవలలు, పుస్తకాలు, పేవర్లు చదువుకుంటూ అక్కడి స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ చాలా మంది ఉన్నారు. అక్కడ.. మరికొందరు మహిళలకు శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. అవన్నీ చూస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. తల్లీ కూతుళ్లు, ఆ పల్లెటూరిలోనే కాకుండా జిల్లా మొత్తంలో నిరాదరణకు గురైన మహిళలకు వారి అర్హతకు తగ్గట్టుగా కార్పొరేషన్ శిక్షణ, ఉపాధి, ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ కింద ప్రసిద్ధ శిక్షణా సంస్థల ద్వారా టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యుటీషియన్ శిక్షణ ఇచ్చి కుట్టుమిషన్స్ అందిస్తూ ఉపాధి ఏర్పాటు చేస్తూ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం నిర్మిస్తున్నారు.

వల్లెటూర్లు, దేశానికి పట్టుకొమ్మలు అన్న మాటను నిజం చేసి చూపిస్తున్నారు ట్రస్టు రూపకర్త ‘ఉమా మాధవ్’. మాధవ్ మేనల్లుడే మురళి. వాళ్లకు మురళి ఎదురుపడి ఇద్దరినీ రిసీవ్ చేసుకున్నాడు. సభా ప్రాంగణం మహిళలతో నిండిపోయింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర మంత్రిగారు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్గారు వేదిక పైన ఆసీనులై ఉన్నారు. వేదిక సందడిగా ఉంది. కార్యక్రమం ప్రారంభించడానికి వ్యవస్థాపకులు మాధవ్రు వేదికపైకి వీల్ చైర్లో వచ్చారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు పక్షవాతం వచ్చింది. అందువల్ల వీల్వైర్లో వచ్చారు. మాధవిని చూసి రూప తల్లి ఒక్కసారిగా షాక్ అయ్యి సొమ్మసిల్లి పడిపోయింది. తన మనసు కలవరపడిందే నిజమైంది. తనే ఉమాదేవి. తన భర్తే మాధవ్. ట్రస్టు ఆసుపత్రిలోనే ఆమెకు చికిత్స అందించారు. ఆమె బెడ్ పక్కనే చైర్లో కూర్చుని ఆమె చెయ్యిని పట్టుకుని ఉన్నాడు భర్త మాధవ్. భర్తను ఉద్దేశిస్తూ “మాధవ్! నన్ను క్షమించు. నిన్ను నేను మర్చిపోయి బతుకుతున్నా. కానీ నువ్వు మాత్రం నన్ను తలుచుకుంటూ నా పేరుతో ఎందరికో బతుకునిస్తూ పల్లెల స్వచ్ఛమైన గాలిలా ఇక్కడి పవిత్రమైన మట్టిలా ఎంతో ఓర్పుతో పట్నంలో బతికేదే జీవితం కాదు పల్లెటూళ్లలో కూడా జీవం నిండిన జీవితాలు ఉంటాయని, అభివృద్ధికి ఆనవాలు పట్నాలు అయినా, వాటి పురోభివృద్ధికి మాత్రం దారులు వేసేది పల్లెటూర్లు, ఇక్కడి మనుషులు అని నిరూపించావు. నేను ఓడిపోయాను” అంది కన్నీళ్లు నిండిన కళ్లతో, లాన్లో కూర్చుని ఉన్నారు మురళి, రూప. రూపగారూ, చూశారా విధి? నేను మావయ్యను అత్తమ్మ గురించి ఎప్పుడు అడిగినా పల్లెటూరు, అక్కడి మనుషులను వద్దనుకుని వెళ్లిపోయిన వాళ్ల గురించి తెలుసుకుని ఏం చేస్తావురా?” అనేవాడు.

మా అమ్మా అంతే! “ఫ్యామిలీ కన్నా సమాజ సేవనే ఇష్టం, పల్లెటూరు జీవితాలు స్వచ్ఛమైనవి.. అంటూ వదిలేసినవాళ్ల గురించి నీకెందుకే” అంటూ నా నోరు మూయించేది” చెప్పింది రూప. అవును… ఇద్దరు మొండి పంతంతో నిండు జీవితాల్ని పోగొట్టుకున్నారు. మా అమ్మా, నాన్న నా నాలుగో ఏటనే పోయారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇక పైన కూడా నాకు అన్నీ మా మాధవ్ మావయ్యే. ఇక్కడే విలేజ్లో వుంటూ వ్యవసాయాన్ని నమ్ముకుని ఆధునిక పద్ధతులతో వ్యవసాయం చేస్తూ వంటలు పండిస్తూ పసిడిలాంటి పల్లెటూరి జీవితాన్ని అనుభవిస్తూ ఉండేవాడు. మా నాన్న రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడంతో అమ్మ, నేను మామయ్య పంచన చేరాం. మావయ్యకు కొత్తగా పెళ్లయిన రోజులవి. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. అలాంటి సమయంలో మావయ్య పంచన చేరాం మేం. అప్పటికి “ఈ పల్లెటూరి జీవితం మనకు వద్దు, మనం సిటీకి పోదాం అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుందాం” అంటూ అత్తయ్య మామయ్యకు చెప్తూ ఉండేది. కానీ మావయ్యకు పల్లెటూరు అంటేనే ఇష్టంగా ఉండేది. ఈ లోపల మేం మామయ్య ఇంటికి రావడంతో మామయ్య “సిటీ లేదు ఏమీ లేదు. ఇక్కడే ఉంటూ వ్యవసాయం చేసుకుందాం” అని కరాఖండిగా చెప్పేశాడు. మామయ్య మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునేవాడు.
ఆ ప్రేమనే కాదు, మామయ్యతో పల్లెటూరులో కాపురం అత్తయ్యకు నచ్చలేదు. అలా అని అత్తయ్య మంచిది కాదని కాదు. చాలా మంచిది. అయితే కాస్త మొండిది. అంతే! నా వల్లే అన్నయ్య కాపురంలో గొడవలవుతున్నాయి. అందుకే దూరంగా వెళ్లాలని నిశ్చయించుకుంది మా అమ్మ. కానీ ఒంటరిగా బతుకుపోరు గెలవాలన్న గట్టి నిర్ణయం తీసుకోలేదు. తాను లేకుంటే అన్నయ్య, వదిన సంతోషంగా ఉంటారని ఆత్మహత్య చేసుకుంది. జీవితంలో ఎలాగైనా గెలిచి నిలవాలని మాత్రం ఎందుకు అనుకోలేదో.. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. క్షణికావేశంలొ తీసుకున్న నిర్ణయం వల్ల ఇటు నా జీవితం, అటు మాదర జీవితం అంధకారం అయ్యాయి. నీ వల్లనే నా చెల్లెలు చనిపోయిందని మామయ్య ఆనడంతో గొడవలు మరింత పెరిగాయి.

“ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీతో సంతోషంగా ఉండాలనుకోవడు. తప్పా? అని నిలదీసిన అత్తయ్యపై చేయి చేసుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య ఎడబాటు ఏర్పడింది. అప్పటికే గర్భవతిగా ఉన్న అత్తయ్య పుట్టింటికి వెళ్లిపోయింది.
నాటి నుండి మామయ్య ఒంటరివాడయ్యాడు. ఇన్నేళ్లయినా అత్తయ్య ఆచూకీ లేదు. మామయ్య కూడా అటు వైపుగా అడుగులు వేయలేదు. కానీ రోజూ అత్తయ్యని తలుచుకుంటూ తన ప్రేమకు గుర్తుగా ఈ మహిళా ట్రస్టును నిర్వహించి జీవితంలో నిరాదరణకు గురైన మా అమ్మ లాంటి ఎందరో మహిళలను చేరదీస్తూ, వారికి జీవనోపాధి కల్పిస్తూ, ఆయన సంపాదనలో డెబ్బై అయిదు శాతం ఈ ట్రస్టుకు కేటాయిస్తూ వారికి జీవితం మీద కొత్త ఆశలు చిగురింపచేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నాడు” చెప్పాడు మురళి. మ్యాటర్ మొత్తం అర్థమైన రూప మురళి చెయ్యిని తన చేతిలోకి తీసుకుని “అనుబంధాలు అంతే బావా. దూరం అవుదామనుకున్నా మరింత దగ్గరవుతాయి” అంది ప్రేమ నిండిన స్వరంతో.
రచనలకు ఆహ్వానం పడు రచయితల నుండి కథలు, కవితలు, సమకాలీన వ్యాసాలు స్వాగతిస్తున్నాం. రచనలతో పాటు మీ పేరు, చిరునామా, హామీపత్రం తప్పనిసరిగా జత చేయాలి. ఎంపిక కాని రచనలు తిప్పి పంపగోరేవారు. తగిన పోస్టేజీ జత చేసిన కవరు పంపించాలి. ఇతర పత్రికల పరిశీలనలో ఉన్న రచనలు దయచేసి పంపించకండి. రచనలు పంపించాల్సిన చిరునామా: ఎడిటర్, ఆదివారం వార్త, నం.396, లోయర్ ట్యాంక్ బండ్, డిబిఆర్ మిల్స్ పక్కన, హైదరాబాద్-80