ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరు పిల్లలకు రూ.15,000 చొప్పున నగదు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కావడం నేపథ్యంలో, ఆలోపే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయాలని నిర్ణయించింది. ఇది విద్యార్థుల విద్యాసహాయం కోసం ఉపయోగపడేలా చేయడమే లక్ష్యం.
ఆధార్, ఎన్‌పీసీఐ లింకింగ్ తప్పనిసరి
తల్లుల ఖాతాల్లో నగదు నేరుగా జమ కావాలంటే, బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాదు, బ్యాంక్ ఖాతా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ)తో అనుసంధానం చేయడం కూడా అవసరం. దీనివల్ల లబ్ధిదారులను సులభంగా గుర్తించడమే కాక, నిధులు నేరుగా వారి ఖాతాల్లో పారదర్శకంగా జమ చేయడం సాధ్యమవుతుంది. లింక్ చేయని ఖాతాల్లో రూ.15,000 ఆర్థిక సాయం జమ కాకపోవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు.
జూన్ 5లోగా లింకింగ్ పూర్తి చేసుకోవాలి
ప్రభుత్వం (AP Govt) సూచనల మేరకు జూన్ 5వ తేదీలోగా తల్లుల బ్యాంకు ఖాతాలను ఆధార్, ఎన్‌పీసీఐతో అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను సులభతరం చేయడంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్, సచివాలయ సిబ్బంది, బ్యాంకింగ్ అధికారులు సహకరిస్తారు. తల్లులు ఆయా బ్యాంకులను సంప్రదించి లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా ఈ లింకింగ్ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. ఇది చేయకపోతే తల్లికి వందనం పథకం ద్వారా అందే ఆర్థిక సాయం పొందలేని పరిస్థితి ఏర్పడవచ్చని అధికారులు చెబుతున్నారు. కాబట్టి ఈ అప్డేట్‌ను అన్ని తల్లులు పరిగణలోకి తీసుకోవడం ఎంతో అవసరం.
Read Also : Rohit Sharma: ఐపిఎల్ లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ