Key comments of KCR on by elections

ఉప ఎన్నిక‌లపై కేసీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతారు

హైదరాబాద్‌: మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉప ఎన్నిక‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం ఖాయం అని అన్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే రాజ‌య్య‌తో పాటు ప‌లువురు నాయ‌కులు ఎర్ర‌వ‌ల్లిలో కేసీఆర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కీర్తి వెంక‌టేశ్వ‌ర్లు, మ‌ల్కిరెడ్డి రాజేశ్వ‌ర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Advertisements

వీరికి కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌కు తెలంగాణ ప్ర‌జ‌లు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నార‌ని కేసీఆర్ పేర్కొన్నారు. స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో క‌డియం శ్రీహ‌రి ఓడిపోవ‌డం ఖాయ‌మ‌న్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజ‌య్య మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెల‌వ‌డం ఖాయ‌మ‌ని కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు.

image

కాగా, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇప్పటికే స్పీకర్‌కు మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో విచారణ కూడా ప్రారంభమైంది. పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం.సంజయ్ కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరిలు ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ తన బలాన్ని తిరిగి పెంపొందించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికల ముందు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు తీసుకోవాలనే అంశంపై కేసీఆర్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Related Posts
ఇందిరా మహిళాశక్తి మిషన్ ప్రారంభించిన రేవంత్‌రెడ్డి
ఇందిరా మహిళాశక్తి మిషన్ ప్రారంభించిన రేవంత్‌రెడ్డి

ఇందిరా మహిళాశక్తి మిషన్ ప్రారంభించిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘ఇందిరా మహిళాశక్తి మిషన్ - 2025’ పాలసీని ప్రకటించారు. Read more

చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పిన మాజీ సీఎం కుమార్తె
తనను వేధించిన డ్రైవర్‌కు చెప్పుతో బుద్ధి చెప్పిన మాజీ సీఎం కుమార్తె

అస్సాం మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తె ఇంట్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇంటి డ్రైవర్ మద్యం మత్తులో ఆమెను వేధించడంతో, తాను స్వయంగా అతడికి Read more

డయేరియాతో 10 మంది మృతి..చంద్రబాబుకు సిపిఐ రామకృష్ణ లేఖ !
New law in AP soon: CM Chandrababu

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, లేఖ రాశారు. విజయనగరం జిల్లా గుర్లలో డయేరియా కారణంగా 10 మంది మరణించగా, వందల మంది Read more

పర్యావరణ కార్యకర్త తులసి గౌడ ఇక లేరు..
tulsi gowda

తులసి గౌడ, 86 సంవత్సరాల వయస్సు గల ప్రముఖ భారతీయ పర్యావరణ వేత్త, డిసెంబర్ 16, 2024న కర్ణాటక రాష్ట్రం, దావణగెరే జిల్లాలో మరణించారు. ఆమె ఆరోగ్య Read more

Advertisements
×