Key Chinese military general arrested..?

China: చైనా కీలక సైనిక జనరల్‌ అరెస్ట్‌..?

China: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితమైన ఫుజియాన్‌ నాయకులు, జనరల్స్‌పై చర్యలు మొదలయ్యాయి. అత్యంత కీలకమైన సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ అరెస్టయ్యారు. వాస్తవానికి ఈ కమిషన్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ ఛైర్మన్‌. ఇటీవల కాలంలో చైనా కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులను మార్చేస్తున్న క్రమంలో ఈ అరెస్టు జరగడం గమనార్హం. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ పదవి అత్యున్నతమైంది. ఈ అరెస్టుతో మరికొంతమంది కీలక నాయకులను కూడా అదుపులోకి తీసుకొన్నారు.

Advertisements
చైనా కీలక సైనిక జనరల్‌

జనరల్‌ లాజిస్టిక్స్‌లో అధిపతిగా

ఝావో కేషి అరెస్టు కూడా అత్యంత కీలకమైంది. అతడు నాన్‌జింగ్‌ మిలిటరీ రీజియన్‌లో జనరల్‌ లాజిస్టిక్స్‌లో అధిపతిగా పనిచేశారు. దీంతోపాటు సైనిక బడ్జెట్‌, వనరుల కేటాయింపులు, రక్షణ పరిశ్రమలపై అతడి ప్రభావం ఉంది. సెంట్రల్‌ మిలిటరీ కమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ హి వైడాంగ్‌ సెక్రటరీ అత్యంత కీలకమైన సైనిక సమాచారం లీక్‌ చేశారనే ఆరోపణలపై దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఇక వెస్టర్న్‌ థియేటర్‌ కమాండ్‌ డిప్యూటీ కమాండర్‌, ఫుజియాన్‌లో పనిచేసే చాలామంది జనరల్స్‌ను కూడా అదుపులోకి తీసుకొన్నట్లు తెలుస్తోంది.

అధ్యక్షుడే వారిని స్వయంగా అణచివేస్తున్నారా..?

ఈ అరెస్టులను ఆ దేశ రక్షణశాఖ ధ్రువీకరించాల్సి ఉంది. ఫుజియాన్‌ ఫ్యాక్షన్‌కు చెందిన మరికొందరు సీనియర్‌ జనరల్స్‌ను కూడా అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఫ్యాక్షన్‌ అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితమైందిగా భావిస్తారు. కానీ, అధ్యక్షుడే వారిని స్వయంగా అణచివేస్తున్నారా..? లేదా సైన్యంలో తనకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నవారిని అణచివేసే క్రమంలో చర్యలు తీసుకొన్నారో తెలియాల్సి ఉంది. ఇక చైనాలో గతేడాది కూడా మియావో లి అనే ఉన్నతస్థాయి సైనిక అధికారిని అరెస్టు చేశారు. ఆయన నాడు పొలిటికల్‌ వర్క్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అంతకుముందు చైనా రక్షణ మంత్రిని అరెస్టు చేశారు.

Related Posts
నటుడు సోనూ సూద్ కు సంకల్ప్ కిరణ్ పురస్కారం
Sankalp Kiron award to actor Sonu Sood

హైదరాబాద్‌: సుచిరిండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గురువారం సాయంత్రం నాంపల్లిలోని లలిత కళా తోరణం లో జరిగిన ఈ కార్యక్రమంలో Read more

Twitter Iconic Bird Logo: ట్విట్ట‌ర్ ఐకానిక్ బ‌ర్డ్.. వేలంలో భారీ ధర
Twitter Iconic Bird Logo: ట్విట్ట‌ర్ ఐకానిక్ బ‌ర్డ్.. వేలంలో భారీ ధర

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సోషల్ మీడియా లోగోల్లో ట్విట్ట‌ర్ బ్లూబర్డ్ ఒకటి. అయితే, 2022 అక్టోబర్‌లో ప్రముఖ వ్యాపార దిగ్గజం, Tesla, SpaceX CEO ఎలాన్ మస్క్ Read more

భారీగా పెరగబోతున్న సబ్బుల ధరలు
soaps price

'ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు.. నాగన్నా.. ధరలు మీద ధరలు పెరిగె నాగులో నాగన్న' అనే ఆర్. నారాయణమూర్తి సినిమాలో పాట ఎంత మందికి Read more

దక్షిణ కొరియాలో రాజకీయ సంక్షోభం
korea

దక్షిణ కొరియాలో రాజకీయ ఉద్ధృతిని నెలకొల్పేలా, ప్రతిపక్ష పార్టీ చట్టసభ సభ్యులు దేశ ప్రధాన మంత్రి హాన్ డక్-సూప్ పై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో దాఖలు చేశారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×