Kerala CS's open letter on caste discrimination

Sarada Muraleedharan : వర్ణ వివక్షపై కేరళ సీఎస్‌ బహిరంగలేఖ

Sarada Muraleedharan: కేరళ చీఫ్‌ సెక్రటరీ శారదా మురళీధరన్‌ ఫేస్‌బుక్‌లో వర్ణ వివక్షకు గురవుతున్నానని బహిరంగ లేఖను రాశారు. శారదా మురళీధరన్‌ 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. కొద్దినెలల క్రితమే కేరళ చీఫ్‌ సెక్రటరీగా నియమితులయ్యారు. తన భర్త తర్వాత ఆ స్థానంలో శారద నియమితులవడం విశేషం. వారిద్దరిని గమనించిన పలువురు రంగు గురించి చేసిన కామెంట్లు ఆమె దృష్టికి వచ్చాయి. నా రంగును నేను అంగీకరించాల్సి ఉంది. ఈ క్రమంలోనే నేను ఒక పోస్టు చేశాను. ఆ తర్వాత వచ్చిన కామెంట్లతో కాస్త కంగారుకు గురై.. దానిని తొలగించాను. అయితే నేను పేర్కొన్న అంశాలు చర్చించాల్సినవేనని నా శ్రేయాభిలాషులు చెప్పడంతో మళ్లీ తిరిగి షేర్ చేశాను అని తాను డిలీట్ చేసిన మాటలను తిరిగి పంచుకున్నారు.

వర్ణ వివక్షపై కేరళ సీఎస్‌

కానీ నలుపును ఎందుకు అవమానించాలి

ఒక సీనియర్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అంతకుముందు ఆ స్థానంలో ఉన్న భర్తతో పోలికలు తీసుకొచ్చారు. అదేదో సిగ్గుపడాల్సిన విషయం అన్నట్టు.. అది అసలు మంచి కాదన్నట్టు.. నా రంగు గురించి మాట్లాడారు. కానీ నలుపును ఎందుకు అవమానించాలి. అది విశ్వమంతా వ్యాపించి ఉన్న సత్యం. వర్షానికి ముందు కనిపించే వాగ్దానం. సాయంత్రానికి సూచిక.. అసలు అది లేనిదెక్కడ అంటూ రాసుకొచ్చారు. అలాగే చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించారు. ఈ రంగు చిన్నప్పుడే నేను పెద్ద మాటలు పలికేలా చేసింది. మళ్లీ నన్ను తన గర్భంలోకి తీసుకెళ్లి తెల్లగా, అందంగా తీసుకురాగలవా అని నాలుగు సంవత్సరాల వయసులో నేను నా తల్లిని అడిగేంతలా. ఆ రంగు ప్రభావం నాపై 50 ఏళ్లపాటు కొనసాగింది. నలుపునకు విలువ లేదనే భావనలో తెలుపు పట్ల ఆకర్షితురాలినయ్యా. దానివల్ల నేను తక్కువ వ్యక్తిగా భావించా. కానీ నా పిల్లలు ఆ వర్ణం అద్భుతమని, అందమైనదని నేను గుర్తించేలా చేశారు అంటూ వివరించారు.

నా తల్లి కూడా నల్లటి ఛాయను కలిగిఉండేది

వ్యక్తిగతంగా తనకు ఎదురైన అనుభవాలను ఇలా బహిరంగంగా పంచుకోవడం పట్ల శారద ను అంతా అభినందిస్తున్నారు. కేరళలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్‌ స్పందిస్తూ.. ఆమె వెలిబుచ్చిన ప్రతిమాట హృదయాన్ని తాకింది. నా తల్లి కూడా నల్లటి ఛాయను కలిగిఉండేది. ఇది చర్చించాల్సిన అంశం అని తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇక శారద విషయానికొస్తే.. ఆమె గతంలో పలు కీలక హోదాల్లో విధులు నిర్వర్తించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుడుంబశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. కేరళ చరిత్రలో తొలిసారి భర్త నుంచి ఆమె చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆ నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది.

Related Posts
సీఎం చంద్రబాబు విజయనగరం పర్యటన రద్దు..!
CM Chandrababu held meeting with TDP Representatives

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రను సందర్శిస్తున్నారు. నిన్న దీపం-2 పథకాన్ని ప్రారంభించిన ఆయన శ్రీకాకుళంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేశారు. అయితే ఈ Read more

మనిషిని కుట్టి ప్రాణాలు తీసిన చీమలు
Ants that stung man and kil

వైఎస్‌ఆర్ కడప జిల్లాలో చోటుచేసుకున్న ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. 29 ఏళ్ల ఆటో డ్రైవర్ ద్వారకనాథరెడ్డి, మద్యం సేవించిన తర్వాత అపస్మారక స్థితిలో ఊరికి సమీపంలో Read more

దేశ ఆర్థిక వ్యవస్థకు మార్గదర్శకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్
ఎయిమ్స్‌ ఎమర్జెన్సీలో మాజీ ప్రధాని

డాక్టర్ మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న పంజాబ్‌లోని ఒక గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచి విద్యపై ఆసక్తి కలిగి ఉన్న ఆయన, పంజాబ్ విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ Read more

Medaram jatara: మేడారం జాతరకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి మృతి
Medaram jatara: మేడారం జాతరకు వెళ్లి అదృశ్యమైన వ్యక్తి మృతదేహం అడవిలో లభ్యం

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారం మినీ జాతరలో జరిగిన విషాదకర ఘటన స్థానికులను, భక్తులను విషాదంలో ముంచింది. భక్తితో వచ్చిన వ్యక్తి కారడవిలో దారితప్పి మృత్యువాతపడడం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *