https://vaartha.com/fake-heart-doctor-busted-in-madhya-pradesh/national/466383/

KCR : జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్న కేసీఆర్

KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని కేసీఆర్ కొనియాడారు. చిన్ననాటి నుంచే సామాజిక వివక్షను ఎదుర్కొన్న ఆయన, వర్ణ కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని తెలిపారు. దేశ స్వాతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొన్న బాబు జగ్జీవన్ రామ్, అనంతర స్వయంపాలనలో కేబినెట్ మంత్రిగా కార్మిక శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని, టెలి కమ్యూనికేషన్స్, వ్యవసాయం, దేశ రక్షణ వంటి శాఖలకు వారు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

Advertisements
జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్న

బాబు జగ్జీవన్ రామ్ కార్యాచరణ నేటికీ ఆదర్శనీయం

బాబు జగ్జీవన్ రామ్ కార్యాచరణ నేటికీ ఆదర్శనీయమని, అంటరానితనం అనే దురాచారం, కులం పేరుతో కొనసాగుతున్న సామాజిక వివక్ష సంపూర్ణంగా సమసిపోయే దిశగా మనందరం పని చేసిననాడే, డాక్టర్ బాబు రామ్‌కి ఘనమైన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ తెలిపారు. దేశ ఉప ప్రధానిగా సేవలందించిన వారి సేవలు ఆదర్శనీయమని కొనియాడారు. వివక్ష రహిత సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం వారి సేవలను గుర్తించిన దేశ ప్రజలు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సమతా దివస్‌గా జరుపుకోవడం, జాతి కోసం వారు చేసిన సేవలకు దర్పణంగా నిలుస్తుందని మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు.

Read Also : మధ్యప్రదేశ్‌లో నకిలీ గుండె వైద్యుడి నిర్వాకం

Related Posts
ఒక్క ఛాన్స్ ప్లీజ్.. ఎమ్మెల్సీ ఆశావహులు!
లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా..అధిష్టానం కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్ల కోసం పోటీ తీవ్రత పెరిగింది. తాజా ఎన్నికల అనంతరం టీడీపీ ఆధిక్యంలోకి వచ్చిన నేపథ్యంలో, పార్టీ వర్గాల్లో ఎమ్మెల్సీ Read more

Chalivendram: రాష్ట్రంలో 4,818 చలివేంద్రాలు
tg chalivendram

తెలంగాణలో ఎండలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 4,818 చలివేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రజలకు చల్లటి తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక Read more

తమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి: చిరంజీవి
తమన్ వ్యాఖ్యలు హృదయాన్ని తాకాయి: చిరంజీవి

ప్రస్తుత కాలంలో సినిమాల చుట్టూ వృద్ధిచెందిన ప్రతికూలత మరియు ట్రోలింగ్ ధోరణికి వ్యతిరేకంగా ఇటీవల వ్యాఖ్యానించిన సంగీత దర్శకుడు తమన్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ముందుకు Read more

అసెంబ్లీకి బయల్దేరిన మాజీ సీఎం కేసీఆర్‌
జనరల్ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నందినగర్‌లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి బయల్దేరారు. ఉదయం 11 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×