KCR holds emergency meeting at Telangana Bhavan today

నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అత్యవసర భేటీ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. తన ఫామ్ హౌస్ వదిలి తెలంగాణ భవన్ కు రాబోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. ఇందులో భాగంగానే ఇవాళ కెసిఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం జరగనుంది. రేపటి నుంచి కేసీఆర్ కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్తూన్నారు.

Advertisements
నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్

సమస్యలపై ఎలా పోరాడాలి అనే దాని పైన చర్చ

అటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలు, ఇతర సమస్యలపై ఎలా పోరాడాలి అనే దాని పైన కేసీఆర్ చర్చించబోతున్నారు. ప్రజల వద్దకు మరింత దగ్గర అయ్యేలా కేసీఆర్‌ ప్లాన్ చేస్తున్నారు. ఈ సమావేశంలో పూర్తి అంశాలపై కేసీఆర్ చర్చించబోతున్నారు. ఎమ్మెల్యేలతో పాటు రాజ్యసభ సభ్యులు అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశానికి రానున్నారు.

ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్

మొత్తానికి ఏడాదికి పైగా ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్ తిరిగి యాక్టివ్ అవుతాను అంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఒక్కసారి బడ్జెట్ సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చారు . ఉన్న కాసేపు ముళ్లమీద కూర్చున్నట్లు కూర్చుని వెళ్లిపోయారు . ఆరునెలలు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందన్న భయంతోనే ఆయన ఆ ఒక్క రోజు కూడా సభకు వచ్చారన్న ప్రచారం జరిగింది .

Related Posts
RevanthReddy:కేసీఆర్ కి చెక్ పెట్టె దిశగా రేవంత్ అడుగులు
RevanthReddy:కేసీఆర్ కి చెక్ పెట్టె దిశగా రేవంత్ అడుగులు

తెలంగాణ సెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసా గుతున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Read more

ఢిల్లీ తొక్కిసలాట ఘటన పై కేటీఆర్ రియాక్షన్
432685 delhi12

ఢిల్లీలో జరిగిన భయానక తొక్కిసలాట ఘటనపై తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి Read more

నాగర్ కర్నూల్ జిల్లా కస్తూర్బా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్
Food poisoning in Kasturba

తెలంగాణ లోని ప్రభుత్వ హాస్టల్స్ లలో , ఆశ్రమాల్లో వరుసపెట్టి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు ఎక్కడో చోట ఫుడ్ పాయిజన్ ఘటన Read more

పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: ఉదయనిధిపై కొత్త ఎఫ్ఐఆర్ లకు సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే

న్యూఢిల్లీ : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటాపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అందుకు సుప్రీం కోర్టు ధర్మాసనం అనుమతించింది. Read more

×