ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరియు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఓనర్ కావ్య మారన్ (Anirudh – Kavya Maran) ప్రేమలో ఉన్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత ఏడాది కాలంగా వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, పలువురు నెటిజన్లు అంటున్నారు. వీరిద్దరూ విదేశాల్లో కలిసి కనిపించారన్న వార్తలు, ఫోటోలు ఇప్పుడిప్పుడే వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా లాస్ వేగాస్ లో కలిసి తిరిగిన దృశ్యాలు అప్పట్లో కెమెరాకు చిక్కినట్టు చెబుతున్నారు.
ప్రైవేట్ డిన్నర్ విందులో ఇద్దరు కలిసి ఉన్నారు
తాజాగా ఓ ప్రైవేట్ డిన్నర్ ఈవెంట్ లో అనిరుధ్, కావ్య మారన్ కలిసి పాల్గొన్నారని కొంతమంది చెబుతున్నారు. ఈ నేపధ్యంలో, ‘‘వీరి మధ్య స్నేహం కంటే ఎక్కువ సంబంధం ఉంది’’ అని అభిప్రాయపడుతున్న నెటిజన్ల సంఖ్య పెరుగుతోంది. ఇద్దరూ తన-తన రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ, సమయాన్ని కలిసి గడపడం, ఇలా ప్రత్యక్షమవ్వడం వల్లే వివాహ వార్తలకు ఊతమిస్తోంది.
అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
ఈ సంబంధిత వార్తలపై ఇప్పటివరకు అనిరుధ్ గానీ, కావ్య మారన్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. తమ మధ్య వాస్తవంగా ఏం జరుగుతోంది? ఈ ప్రచారాల్లో నిజమెంత? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. వారి అభిమానులు మాత్రం ఈ వార్తలు నిజమైతే ఎంతో ఆనందంగా ఉందంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు కూడా చెబుతున్నారు. అయితే వాస్తవాలు వెల్లడయ్యేంత వరకు ఈ వార్తలను ఊహాగానంగానే పరిగణించాల్సిన అవసరం ఉంది.
Read Also : Ahmedabad Plane Crash : విమానం కూలిపోతుండగా వీడియో తీసింది ఇతడే