kasthuri

పవన్ కళ్యాణ్ స్పందన పై కస్తూరి రియాక్షన్

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణం, అల్లు అర్జున్ పై కేసు, అతని అరెస్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రముఖ నటి కస్తూరి.. పవన్ కళ్యాణ్ స్పందనపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. “పెద్దరికం అంటే పవన్. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన స్పందన చేసారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు” అని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను పక్కన పెట్టి, 2025కు గ్రాండ్ గా వెల్ కం చెపుదాం అని పేర్కొంది.

పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనేది చూస్తే..

బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయ‌న కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు అని చెప్పుకొచ్చారు.

Related Posts
ఉగ్రవాద చర్యలకు రష్యా ప్రణాళికలు
ఉగ్రవాద చర్యలకు రష్యా ప్రణాళికలు

విమానయాన సంస్థలపై "వైమానిక ఉగ్రవాద చర్యలు" సహా ప్రపంచవ్యాప్తంగా విధ్వంసక చర్యలకు రష్యా ప్రణాళికలు రచిస్తోందని పోలిష్ ప్రధాని డోనాల్డ్ టస్క్ బుధవారం ఆరోపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు Read more

రాష్ట్ర‌ వ్యాప్తంగా 29న దీక్షా దివస్ – బిఆర్ఎస్ పిలుపు
deeksha diwas on 29th

తెలంగాణ రాష్ట్ర‌ వ్యాప్తంగా నవంబర్ 29 న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షాదివాస్ ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీక్షా Read more

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ: 17 వేల కొత్త ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ: 17 వేల కొత్త ఉద్యోగాలు

ఇన్ఫోసిస్, ఇప్పటికే హైదరాబాద్లో 35,000 మంది ఉద్యోగులతో కొనసాగుతూ, ఇప్పుడు 17,000 కొత్త ఉద్యోగాల సృష్టికి సిద్ధమవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు హైదరాబాద్ లోని పోచారం ఐటీ Read more

భూమికి సమీపంలో రెండు గ్రహశకలాల ప్రయాణం
space

అంతరిక్షంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భూమికి సమీపం నుంచి రెండు గ్రహశకలాలు దూసుకుపోనున్నట్లు నాసా తెలిపింది.ఇవాళ (సోమవారం) రెండు భారీ గ్రహశకలాలు భూమికి సమీపం నుంచి Read more