సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణం, అల్లు అర్జున్ పై కేసు, అతని అరెస్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రముఖ నటి కస్తూరి.. పవన్ కళ్యాణ్ స్పందనపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. “పెద్దరికం అంటే పవన్. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన స్పందన చేసారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు” అని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను పక్కన పెట్టి, 2025కు గ్రాండ్ గా వెల్ కం చెపుదాం అని పేర్కొంది.
పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనేది చూస్తే..
బన్నీ విషయంలో తెర ముందు, వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. ఇలాంటి ఘటనల్లో పోలీసులను తప్పుపట్టను. చట్టం అందరికీ సమానమే. పోలీసులు తప్పకుండా భద్రత గురించి ఆలోచిస్తారు. థియేటర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయన కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయనకు ఆ అరుపుల్లో సరిగా వినిపించకపోవచ్చు. అల్లు అర్జున్ తరఫున బాధిత కుటుంబం వద్దకు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గతంలో ఫ్యాన్స్‌తో కలిసి థియేటర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయన ముసుగు వేసుకుని ఒక్కరే థియేటర్‌కు వెళ్లేవారు అని చెప్పుకొచ్చారు.