kasthuri

పవన్ కళ్యాణ్ స్పందన పై కస్తూరి రియాక్షన్

సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళ మరణం, అల్లు అర్జున్ పై కేసు, అతని అరెస్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వంటి అంశాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రముఖ నటి కస్తూరి.. పవన్ కళ్యాణ్ స్పందనపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. “పెద్దరికం అంటే పవన్. ఎంతో కచ్చితత్వంతో, పరిణతితో కూడిన స్పందన చేసారు. ఎక్కడా పక్షపాతం లేదు, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు” అని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ విషాద ఘటనను పక్కన పెట్టి, 2025కు గ్రాండ్ గా వెల్ కం చెపుదాం అని పేర్కొంది.

పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అనేది చూస్తే..

బ‌న్నీ విష‌యంలో తెర ముందు, వెనుక ఏం జ‌రిగిందో నాకు తెలియ‌దు. ఇలాంటి ఘ‌ట‌న‌ల్లో పోలీసుల‌ను త‌ప్పుప‌ట్ట‌ను. చ‌ట్టం అంద‌రికీ స‌మానమే. పోలీసులు త‌ప్ప‌కుండా భ‌ద్ర‌త గురించి ఆలోచిస్తారు. థియేట‌ర్ స్టాఫ్ అల్లు అర్జున్‌కు ముందు చెప్పి ఉండాల్సింది. ఆయ‌న కూర్చున్నాక చెప్పి తీసుకెళ్లాల్సింది. చెప్పినా ఆయ‌న‌కు ఆ అరుపుల్లో స‌రిగా వినిపించ‌క‌పోవ‌చ్చు. అల్లు అర్జున్ త‌ర‌ఫున బాధిత కుటుంబం వ‌ద్ద‌కు ముందే వెళ్లి ఉండాల్సింది. చిరంజీవి కూడా గ‌తంలో ఫ్యాన్స్‌తో క‌లిసి థియేట‌ర్‌లో సినిమాలు చూసేవారు. కానీ, ఆయ‌న ముసుగు వేసుకుని ఒక్క‌రే థియేట‌ర్‌కు వెళ్లేవారు అని చెప్పుకొచ్చారు.

Related Posts
కాసేపట్లో మకరజ్యోతి దర్శనం
makara jyothi

నేడు శబరిమల ఆలయంలో మకరజ్యోతి దర్శనం జరగనుంది. ఈ పవిత్ర ఘట్టాన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అయ్యప్ప స్వామి భక్తులకు మకరజ్యోతి దర్శనం Read more

వైసీపీకి అయోధ్య రామిరెడ్డి గుడ్ బై..!
Goodbye to YCP Ayodhya Rami Reddy.

అమరావతి: విజయసాయిరెడ్డితో వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆగే సూచనలు కనిపించడం లేదు. వైసీపీ తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా ఉండే మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా Read more

పుతిన్, జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చలు
పుతిన్, జెలెన్‌స్కీతో ట్రంప్ చర్చలు

ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతోన్న యుద్ధం ముగింపునకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందడుగు వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయన బుధవారం ఫోన్‌లో మాట్లాడారు. Read more

పంచాయతీ రాజ్ శాఖ ఈ మైలురాళ్లు దాటింది – పవన్
pawan tirupathi

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే పాలన ప్రారంభమైన తర్వాత పంచాయతీ రాజ్ శాఖ పలు కీలక మైలురాళ్లు దాటిందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా Read more