ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు
అమరావతి: తప్పు చేసిన వైసీపీ నేతలను చట్టపరంగా శిక్షిస్తామన్నారు. 2019-24 మధ్య కొనసాగిన అరాచకపాలన అందరూ చూశారన్నారు. ప్రజా సమస్యలపై పోరాడిన తమపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమాలను నిలదీస్తే టీడీపీ ఆఫీస్ పై దాడి చేశారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యేగా విజయం సాధించిన వల్లభనేని వంశీ.. ఎలక్షన్ తర్వాత వైసీపీకి మద్దతు ప్రకటించారు. అయితే.. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులోనూ వంశీ నిందితుడిగా ఉన్నారు.

లోకేష్ హిట్ లిస్టులో కొడాలి నాని
ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వంశీ అరెస్ట్ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే.. ఇటీవల దళిత యువకుడి కిడ్నాప్ కేసులో ఏపీ పోలీసులు వంశీని అరెస్ట్ చేశారు. వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ చర్చ సాగుతోంది. ఆ తర్వాతి అరెస్టు ఎవరన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఇందులో మాజీ మంత్రి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోకేష్ హిట్ లిస్టులో కొడాలి నాని ఉన్న విషయం తెలిసిందే.
వంశీ అరెస్టు తర్వాత అలర్ట్ అయ్యి నాని
కొడాలి నానిని విడిచి పెట్టేది లేదంటూ ఎన్నకల ప్రచార సమయంలో లోకేష్ అనేక సార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమి తర్వాత కొడాలి నాని హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. అడపాదడపా మినహా పార్టీ కార్యక్రమాల్లోనూ నాని కనిపించడం లేదు. వంశీ అరెస్టు తర్వాత అలర్ట్ అయ్యి నాని అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిపోయారంటూ చర్చ సాగుతోంది.