All permissions to AP due to TDP BJP alliance.. Kavitha

టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఏపీకి అన్ని అనుమతులు: కవిత

అభివృద్ధిలో వీరు చేసిందేమీ లేదని విమర్శ

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా జరుగుతుండటం కేసీఆర్ చలవేనని చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. కేసీఆర్ రాకముందు పేద ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బంది పడేవారని… కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లను సులభతరం చేశారని చెప్పారు.

టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల

ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలి

ఖమ్మంలో పేరుకే ముగ్గురు మంత్రులు ఉన్నారని… అభివృద్ధిలో మాత్రం వీరు చేసిందేమీ లేదని కవిత విమర్శించారు. అభివృద్ధి చేయలేని ఈ ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని అన్నారు. ప్రజల అంచనాలకు మించి కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని చెప్పారు.

కేంద్రం అనుమతి లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు

టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండటం వల్ల ఏపీకి అన్ని అనుమతులు వస్తున్నాయని కవిత అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ కు అనుమతి వస్తే తెలంగాణకు చాలా నష్టమని చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని అన్నారు. కళ్ల ముందే నీళ్లు వెళ్లిపోతున్నా… సీఎం సొంత జిల్లాలో ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు. పోలవం ఏడు మండలాల కోసం తాము ఎంతో పోరాటం చేశామని చెప్పారు.

Related Posts
కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ ఎంపిక
భారత్-కెనడా సంబంధాల్లో మార్పు? – మార్క్ కార్నీ

కెనడా నూతన ప్రధాన మంత్రిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. లిబరల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలతో పాటు ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్టు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన Read more

తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి
turkey major terrorist atta

తుర్కియే రాజధాని అంకారాలో తీవ్ర ఉగ్రదాడి ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడి టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TAI) కహ్రమన్‌కాజాన్ ఫెసిలిటీలో జరిగింది. ఉగ్రవాదులు సాయుధంగా ప్రవేశించి, Read more

ఢిల్లీ గణతంత్ర వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత
Republic Day

76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. వేడుకలను సజావుగా నిర్వహించేలా ఎర్రకోట చుట్టూ వెయ్యికి పైగా సీసీటీవీ కెమెరాలు, నగర Read more

పార్లమెంటుపై దాడి : అమరులకు మోదీ, రాహుల్ నివాళి
Modi, Rahul Tribute to Mart

2001 డిసెంబర్ 13న దేశాన్ని దుఃఖంలో ముంచేసిన రోజు. ఈ రోజు భారత పార్లమెంటుపై ఉగ్రవాదులు చేసిన దాడి దేశ చరిత్రలో మరపురాని క్షణంగా నిలిచిపోయింది. ఐదుగురు Read more