భార‌త ఆట‌గాళ్ల‌కు హ‌గ్ ఇవ్వొద్దు ఫ్యాన్స్ సందేశం!

భార‌త ఆట‌గాళ్ల‌కు హ‌గ్ ఇవ్వొద్దు ఫ్యాన్స్ సందేశం!

నాలుగు రోజుల్లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కి తెర లేవ‌నుంది. ఎనిమిది జ‌ట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోరాడ‌నున్నాయి. పాక్‌, దుబాయ్ వేదిక‌ల‌లో ఈసారి టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. ఇక టోర్నీలో భాగంగా హైవోల్టేజీ మ్యాచ్ అయిన దాయాదుల పోరు ఫిబ్ర‌వ‌రి 23న దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. పాక్ ఆతిథ్య‌మిస్తున్న ఈ మెగా టోర్నీకి భార‌త జ‌ట్టును ఆ దేశానికి పంపించ‌డానికి బీసీసీఐ అంగీక‌రించ‌క‌పోవ‌డంతో టోర్న‌మెంట్ హైబ్రిడ్ మోడ్ లో జ‌ర‌గుతున్న సంగ‌తి తెలిసిందే. దీంతో టీమిండియా త‌న మ్యాచ్ ల‌ను దుబాయ్ వేదిక‌గా ఆడ‌నుంది. భార‌త జ‌ట్టుపై గుర్రుగా ఉన్న‌ పాకిస్థాన్ అభిమానులు త‌మ జ‌ట్టు ఆట‌గాళ్ల‌కు తాజాగా కీల‌క సూచ‌న‌లు చేశారు. మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో ఎట్టిపరిస్థితుల్లో టీమిండియా ప్లేయ‌ర్ల‌తో పాక్ ఆట‌గాళ్లు క‌ర‌చాల‌నం చేయ‌డం, హ‌గ్ ఇవ్వ‌డం లాంటివి చేకూడ‌ద‌ని అంటున్నారు. కెప్టెన్ రిజ్వాన్ తో స‌హా ప్లేయ‌ర్లంద‌రూ కోహ్లీతో పాటు ఇత‌ర ఆట‌గాళ్ల‌ను కౌగిలించుకోవ‌డం, స్నేహ‌పూర్వ‌కంగా మాట్లాడ‌టం చేయ‌రాద‌ని తెలిపారు.మ‌న దగ్గ‌ర ఆడ‌టానికి వారు సుముఖంగా లేన‌ప్పుడు, వారితో మ‌న‌కు స్నేహం అక్క‌ర్లేదు ప్ర‌త్య‌ర్థిగానే చూడాలి వారిపై గెలిచి మ‌న‌మెంటో చూపించాలి అని సూచించారు. ఓ అభిమాని అయితే, ఈసారి భార‌త జ‌ట్టు బంగ్లాదేశ్ చేతిలో కూడా ఓడిపోవాల‌ని తాము కోరుకుంటామ‌ని రోహిత్ సేన‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.2017లో ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ లో పాక్ చేతిలోనే భార‌త్ కు ప‌రాభ‌వం ఎదురైన విష‌యం తెలిసిందే. దాంతో టీమిండియా వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలిచే అవ‌కాశాన్ని కోల్పోయింది. 2013లో ఎంఎస్‌ ధోనీ సార‌థ్యంలో భార‌త జ‌ట్టు ఛాంపియ‌న్స్ ట్రోఫీ గెలిచిన విష‌యం తెలిసిందే.

kq6tcivo india pakistan match 625x300 18 October 23

హైబ్రిడ్ మోడల్ వల్ల భారత మ్యాచ్‌లు దుబాయ్‌లోనే

భారత క్రికెట్ నియంత్రణ మండలి పాకిస్తాన్ ఆతిథ్యంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నారు. భారత జట్టు పాకిస్తాన్ వెళ్లకుండానే తమ మ్యాచ్‌లను యూఏఈలో ఆడనుంది. దాంతో, భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై అడుగుపెట్టకపోవడం పాక్ అభిమానులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

పాక్ అభిమానుల నుంచి జట్టుకు స్పెషల్ సూచనలు

భారత జట్టు తమ దేశానికి రాలేనప్పుడు, ఎందుకు ఆ జట్టుతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి? అంటూ పాకిస్తాన్ అభిమానులు తమ జట్టుకు కఠిన సూచనలు చేశారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ రిజ్వాన్ సహా ఇతర ఆటగాళ్లు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇతర భారత ఆటగాళ్లతో చేతులు కలపడం, కౌగిలించుకోవడం లాంటివి ఎట్టిపరిస్థితుల్లో చేయవద్దని స్పష్టం చేశారు.

Related Posts
ఛాంపియన్స్ ట్రోఫీకి గ్రాండ్ గా కొత్త జెర్సీ లాంచ్ పాకిస్తాన్
ఛాంపియన్స్ ట్రోఫీకి గ్రాండ్ గా కొత్త జెర్సీ లాంచ్ పాకిస్తాన్

ఈ నెల 19 నుంచి పాకిస్థాన్ దుబాయ్ వేదికలపై ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం అవుతుందని అందరికీ తెలిసిందే. ఈ టోర్నీ నిర్వహణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు Read more

రోహిత్ , కోహ్లీ రిటైర్మెంట్ పై శుభ్‌మన్ గిల్ స్పందన
రోహిత్ , కోహ్లీ రిటైర్మెంట్ పై శుభ్‌మన్ గిల్ స్పందన

రోహిత్ , కోహ్లీ రిటైర్మెంట్ పై శుభ్‌మన్ గిల్ స్పందన చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ఊపందుకున్నాయి. టోర్నీ ముగిసిన Read more

భారత అమ్మాయిల జట్టుకు షాక్ తగిలింది.
womens t20 india

భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్ ఇచ్చిన న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమి ఎదురైంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, భారత అమ్మాయిల Read more

 కేకేఆర్ రిటెన్షన్‌ లిస్టులో పేరు లేకపోవడంపై స్టార్ క్రికెటర్ ఎమోషనల్
venkatesh iyer

ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఇటీవల ప్రకటించిన రిటెన్షన్ లిస్టులో తన పేరు లేకపోవడం పట్ల ఆ జట్టు స్టార్ ఆటగాడు వెంకటేశ్ Read more