జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) సందర్భంగా రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అమరుల స్మృతికి ఘన నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాన్ని ఆయన స్మరించుకున్నారు.
ధైర్యసాహసానికి పునరుద్ఘాటన
ఎక్స్ వేదికగా విడుదల చేసిన సందేశంలో రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) మాట్లాడుతూ, “దేశాన్ని కాపాడేందుకు అత్యంత కఠినమైన వాతావరణంలో,అసాధారణ ధైర్యసాహసాలు, ప్రతికూల పరిస్థితుల్లో జవాన్లు చూపిన ధైర్యం అమోఘం. వారి ధైర్యం, సంకల్పం దేశానికి గర్వకారణం” అని పేర్కొన్నారు.
దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది
కార్గిల్ యుద్ధం సమయంలో మన జవాన్లు (Jawans) ప్రదర్శించిన త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. “వారి త్యాగం దేశ ప్రజల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. దేశం ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటుంది” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Ashok Gajapathi Raju : నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న అశోక్ గజపతిరాజు