కన్య రాశి

కన్య రాశి

కన్య రాశి

19-03-2026  |  గురువారం
ఆదాయం 08
వ్యయం 11
రాజపూజ్యం 03
అవమానం 03

కన్యారాశి వారికి ఈ సంవత్సరం దశమం, లాభం, వ్యయంలో గురువు, షష్టమం, పంచమంలో రాహువు, సప్తమంలో శనీశ్వరుడు, వ్యయం, లాభంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు మహా పాశుపత హెూమం జరిపించండి. చేతికి కుబేర కంకణం ధరించండి. సాహిత్య, వ్యవసాయ, విద్యా, రియల్ ఎస్టేట్స్ రంగాలలో అనుకూలమైన మార్పులు జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడుతుంది. స్థిరాస్థులు కొనుగోలు చేసి లాభపడతారు. విద్యావకాశాలు కలసివస్తాయి. సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి. క్రయవిక్రయాల్లో జాగ్రత్త వహించండి. కాంట్రాక్టులు, రావలసిన పెండింగ్ బిల్లులు మీ చేతికి అందుతాయి. 'కాదు' అని మీరనుకున్న పని చివరికి సానుకూలపడటం మీకు ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది.

విద్యార్థులకు సానుకూల కాలంగా చెప్పవచ్చు. మంచి అవకాశాలు లభిస్తాయి. సుదూర ప్రాంతాలలో విద్యనభ్యసించాలను మీ కోరిక నెరవేరుతుంది. అధికారులతో, ముఖ్యమైన వాళ్ళతో ఆచితూచి మాట్లాడటం, సంబంధ బాంధవ్యాలు అతి జాగ్రత్తగా కొనసాగించాలి. సమస్య వస్తే పారిపోయే తత్వం ఉండదు. ప్రతిఘటన అధికంగా ఉంటుంది. వృత్తి వ్యాపార రహస్యాలు కాపాడుకోవడంలో ప్రత్యక శ్రద్ధ ఉంటుంది. అందరినీ ఐకమత్యంగా ఉంచడానికి గ్రూపు రాజకీయాలు రూపుమాపడానికి అధికంగా కృషి చేస్తారు. వ్యక్తిగత కుటుంబ విషయాల్లో ఇతరుల మితిమీరిన జోక్యం కాలక్రమేణా ఇబ్బంది కలిగిస్తుంది. జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాల్లో ప్రావీణ్యత ఉంటుంది. ప్రధానంగా ఆశ పెట్టుకున్న విద్య కన్నా మధ్యలో నేర్చుకున్నవే జీవితానికి ఉపయోగపడతాయి. అయినవాళ్లు సన్నిహితుల వలననే ఇబ్బందులు కలుగుతాయి.

వాహన సౌఖ్యం కలుగుతుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కలిసివస్తాయి. ప్రతిష్ఠ, పేరు పెంచుకోగలుగుతారు. అనేక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమరితనం, అలవాట్లులో మార్పులు రావడం అవసరం. సంతాన పురోగతి బాగుంటుంది. స్త్రీ సంతానం అయితే మరిన్ని విజయాలు సాధిస్తారు. వ్యాపారానికి- పరపతికి పలుకుబడికి అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. గొప్ప అవార్డును అందుకుంటారు. వైవాహిక సంబంధిత విషయాల్లో అనిశ్చిత స్థితి తొలగిపోతుంది. విశేషించి స్త్రీలకు సంబంధించిన అంశాలు పరిష్కారమవుతాయి. స్థాయి లేని వ్యక్తులకు చేరదీసి ఆదరిస్తారు. అందులోని మర్మం మీకు తప్ప మరెవరికీ తెలియదు. స్థిరాస్థులు కొనుగోలు చేస్తారు. ఉన్న ఆస్థుల విలువ రెట్టింపును దాటిపోతుంది. అధునాతన సాంకేతిక విద్యను అభ్యసించాలన్న కోరిక నెరవేరుతుంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా నేర్చుకునే సైబర్ సెక్యూరిటీ కొత్త అంశాలలో మంచి పట్టు సాధించడానికి ఎంతగానో కృషి చేస్తారు పగలు ఉద్యోగం చేసుకుంటూనే రాత్రివేళ టైం కేటాయించుకొని చదువుతారు. కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఉండకపోవచ్చు పరోక్షంగా వాళ్ల కోసమే నేను ఇంత కష్టపడుతున్నాను అన్న ఆలోచనలే ఉంటాయి.

వివాహ సంబంధమైన విషయాలు శుభకార్యాలు అనుకూలంగానే ఉంటాయి బంధువుల్లో ఒక వ్యక్తి కారణంగా క్రితం సంబంధం చేజారింది వాళ్ళ అసత్య ప్రచారాల వలన అలా జరిగిందని మరొకరి ద్వారా తెలుసుకుంటారు. ఏది ఏమైనా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు జరగబోయే విషయాల గురించి చర్చించి మంచి నిర్ణయాలను చేయగలుగుతారు. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న మీవారిని ప్రోత్సహిస్తారు. ధన సహాయం మాట సహాయంతో ఉత్తేజ పరుస్తారు. ప్రయత్నాలు విడవకుండా చేయమని ఎంతగానో ప్రోత్సహిస్తారు. విశ్వాసం చూపిస్తారనుకొని కొంతమందిని గుడ్డిగా నమ్మి మోసపోతారు. ఎంతోమంది మధ్యలో మీకు మంచి చెప్పినప్పటికీ మీరే మూర్ఖంగా అతిగా వాళ్ళ నమ్మారని తెలుసుకుంటారు. చేయగలిగింది ఏమీ లేదని బాధపడతారు. గత కొంతకాలంగా కొంతమంది వేధింపులు మిమ్మల్ని బాధ పెట్టడం మీరు సహించలేక పెద్దల్ని పంచాయతీ పోలీస్ స్టేషన్ లేక కోర్టుని ఆశ్రయించే మార్పులు ఏర్పడతాయి. ప్రభుత్వం అధికారులకు మానసిక ఒత్తిడి మరింతగా పెరుగుతుంది. చెయ్యాలనుకున్న మంచి పనులు సజావుగా చేయడానికి అందరూ సహకరించక దుర్బుద్ధితో వ్యవహరించడం మీరు భరించలేని అంశంగా మారి మనకు వచ్చే లాభం వస్తుండగా ఇంకా ప్రయోజనాల కోసం పీడించడం అవసరమా అన్న మీ మాట అందరూ పెడచెవిన పెడతారు. కొన్ని విషయాలను చూసి తట్టు కోలేక మీరే రహస్యంగా కొంతమందితో ఫిర్యాదు చేయించి కొంతమందిని పట్టించడం సస్పెండ్ చేయించడం చేస్తారు.

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం 40%
సంపద 40%
కుటుంబం 60%
ప్రేమ సంభందిత విషయాలు 60%
వృత్తి 80%
వైవాహిక జీవితం 60%
Sun

వారం - వర్జ్యం

తేది : 19-03-2026, గురువారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం , చైత్రమాసం , ఉత్తరాయణం వసంత ఋతువు , శుక్లపక్షం ఉత్తరాభాద్ర కార్తె
అమావాస్య ఉ.6.53 , సా. పాడ్యమి తె.4.51 , ఉత్తరాభాద్ర తె.4.03
వర్జ్యం: మ.2.26-3.52
రాహుకాలం: మ.1.30 - 3.00

మీకు నచ్చవచ్చు