Kannappa అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

Kannappa : అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

Kannappa : అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్ డైనమిక్ హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘ ను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. మోహన్ బాబు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, పాటలు భారీ అంచనాలు పెంచాయి. వీటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేస్తానని విష్ణు ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా విష్ణు మంచు భక్త కన్నప్ప స్వగ్రామం అయిన అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలంలోని ఊటుకూరు ను సందర్శించారు. గ్రామస్తులు ఆలయ సిబ్బంది విష్ణు మరియు కన్నప్ప టీమ్‌ను ఘనంగా సన్మానించారు.

Kannappa అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్
Kannappa అన్నమయ్య జిల్లా ఊటుకూరు వెళ్లిన మంచు విష్ణు, కన్నప్ప టీమ్

విష్ణు కన్నప్ప కుటుంబ స్వగృహాన్ని సందర్శించి, అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ భారీ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ముఖ్యంగా స్టీఫెన్ దేవస్సీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.ఇప్పటివరకు విడుదలైన పాటలు సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.’కన్నప్ప’ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 25న భారీ స్థాయిలో థియేటర్లలోకి రానున్న ఈ సినిమా, విష్ణు మంచుకు కెరీర్‌లోనే పెద్ద హిట్ అందిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Related Posts
ఎన్నాళ్లైంది ఇట్టా నిన్ను చూసి కిక్కెస్తోన్న స్టార్ హీరోయిన్ 
nayanthara films

ఎప్పుడో ఒకప్పుడు తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను మైమరపించిన అందాల భామ. ఇప్పుడు తన ప్రత్యేకమైన ఫోటోషూట్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. టాలీవుడ్ టాప్ Read more

పుష్ప 2 ఓటిటిలో ఎప్పుడంటే
పుష్ప 2 ఓటిటిలో ఎప్పుడంటే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2 థియేటర్లలో విడుదలై 45 రోజులు పూర్తిచేసుకుంటోంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా వసూళ్లలో Read more

మ‌ర‌ణ‌వార్త ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం ర‌చ‌యిత మృతి
shyam sundar

సినీ ప్రపంచంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రముఖ కన్నడ సాహిత్య రచయిత శ్యామ్ సుందర్ కులకర్ణి కన్నుమూశారు. అయితే, ఆయన మరణ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. Read more

Babita Phogat: ‘దంగ‌ల్’ సినిమా రూ.2వేల కోట్లు కొల్ల‌గొడితే.. ఫోగ‌ట్ ఫ్యామిలీకి ద‌క్కిందెంతో తెలుసా
dangal 2

మల్లయోధుడు మహావీర్ సింగ్ ఫోగట్ ఆయన కుమార్తెలు బబితా ఫోగట్, గీతా ఫోగట్‌ల జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రం ‘దంగల్’ ఈ చిత్రం భారీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *