Kannappa ఏప్రిల్ 25న విడుద‌ల కావాల్సిన క‌న్న‌ప్ప‌ వాయిదా

Kannappa : ఏప్రిల్ 25న విడుద‌ల కావాల్సిన క‌న్న‌ప్ప‌ : వాయిదా

Kannappa : ఏప్రిల్ 25న విడుద‌ల కావాల్సిన క‌న్న‌ప్ప‌ : వాయిదా మంచు ఫ్యామిలీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ సినిమా విడుదల వాయిదా పడింది.ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్న ప్రకారం ప్రేక్షకుల ముందుకు తేవడం సాధ్యం కాకపోయింది.ఈ విషయాన్ని న‌టుడు, నిర్మాత మంచు విష్ణు స్వయంగా సోష‌ల్ మీడియా వేదికగా ప్రకటించారు.”కన్నప్ప సినిమాను అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నాం. యూనిట్ మొత్తం ఉత్తమ ఔట్‌పుట్ కోసం కష్టపడుతోంది.కానీ వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా కొంత సమయం పడతాయి. అందుకే సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కుదరడం లేదు.ఈ ఆలస్యం వల్ల మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను. మీ సహనానికి, మద్దతుకు ధన్యవాదాలు.

Kannappa ఏప్రిల్ 25న విడుద‌ల కావాల్సిన క‌న్న‌ప్ప‌ వాయిదా
Kannappa ఏప్రిల్ 25న విడుద‌ల కావాల్సిన క‌న్న‌ప్ప‌ వాయిదా

త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం” అంటూ మంచు విష్ణు తన ప్రకటనలో పేర్కొన్నారు.ఈ గ్రాండ్ ప్రాజెక్ట్‌కు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో, రెబల్ స్టార్ ప్రభాస్ రుద్రుడిగా కనిపించబోతున్నారు. అంతేకాదు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.కథ విజువల్స్, వీఎఫ్ఎక్స్‌తో పాటు, స్టార్ క్యాస్టింగ్ కూడా సినిమాకు మరింత హైప్‌ను తీసుకొచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం విడుదల అయిన తర్వాత ప్రేక్షకులను అబ్బురపరిచేలా ఉండబోతోందని టీం ధీమా వ్యక్తం చేస్తోంది.

Related Posts
సుశాంత్‌తో మీనాక్షి చౌదరి పెళ్లి క్లారిటీ వచ్చేసిందే
sushant to marry meenakshi chaudhary

సోషల్ మీడియాలో వార్తలు ఎప్పుడు ఏ రూపంలో క్రియేట్ అవుతాయో, ఎవరు క్రియేట్ చేస్తారో చెప్పడం చాలా కష్టం. ఈ మధ్యగా మీనాక్షి చౌదరి పెళ్లి వార్తలు Read more

RC16 షూటింగ్ స్పాట్‌కు రామ్ చరణ్‌తో కలిసి వచ్చిన స్పెషల్ గెస్ట్!
RC16 షూటింగ్ స్పాట్‌కు రామ్ చరణ్‌తో కలిసి వచ్చిన స్పెషల్ గెస్ట్!

రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న RC16 చిత్రం షూటింగ్ ప్రదేశంలో ఓ ప్రత్యేక అతిథి సందడి చేసింది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా Read more

Mallareddy: హీరోయిన్ ని ఎంతమాట అనేశాడు!
Mallareddy: హీరోయిన్ ని ఎంతమాట అనేశాడు!

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా, 'లైఫ్ (లవ్ యువర్ ఫాదర్ )' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య Read more

రూ.12 కోట్ల బంగారం స్మగ్లింగ్ – నటి రాన్యా రావు అరెస్టు
రూ.12 కోట్ల బంగారం స్మగ్లింగ్ - నటి రాన్యా రావు అరెస్టు

15 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ నిన్న బెంగళూరు ఎయిర్‌పోర్టులో పట్టుబడిన రాన్యా. దుబాయ్ నుంచి ఇటీవల గోల్డ్ బిస్కెట్లను దుస్తుల్లో తీసుకొచ్చిన రాన్యా రావు. రాన్యా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *