మన సినీ పరిశ్రమలో మైథలాజికల్ సినిమాలు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంటాయి. అటువంటి కోవకు చెందిన సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, విడుదలకు ముందే విపరీతమైన చర్చకు దారితీసింది. ఇందులో ముఖ్యంగా ప్రస్తుత ప్రమోషన్ టెక్నిక్స్, పాటలపై వస్తున్న స్పందనలు సినిమాపై భారీ అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. కానీ, వివాదాలు కూడా తక్కువ కావడం లేదు.

విశ్వవ్యాప్త విడుదల
ఈ సినిమా షూటింగ్ ప్రధానంగా విదేశాల్లో జరిగింది. ప్రత్యేకించి న్యూజిలాండ్, అండమాన్ నికోబార్, ఐస్‌లాండ్, దక్షిణాఫ్రికా వంటి అరుదైన లొకేషన్లలో కొంత భాగాన్ని చిత్రీకరించారు. కనీసం 50 కోట్ల రూపాయలకు పైగా విదేశీ లొకేషన్ల కోసం ఖర్చు పెట్టినట్టు సమాచారం. అయితే, ఇక్కడే ప్రధానమైన ప్రశ్న తెరపైకి వచ్చింది – భారతదేశంలో కన్నప్ప కథను తెరకెక్కించడానికి మనదేశంలోనే అందమైన లొకేషన్లు ఉన్నప్పటికీ, విదేశాలకు వెళ్లడం అవసరమా? అని. కొన్ని వర్గాలు దీనిని తప్పుబడుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘శివశివ శంకర’ పాట సినిమాపై మరింత చర్చ రేకెత్తించింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ప్రభాస్ లుక్ స్పష్టంగా లేకపోవడం, మీసాలు లేకుండా చూపించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కన్నప్ప తాను అందుబాటులో ఉన్న వస్తువులతో శివుని పూజించే వ్యక్తి. కానీ, మట్టిపాత్రలో మాంసం నైవేద్యం అన్న కంటెంట్ కొందరికి ఆగ్రహాన్ని కలిగించింది. ఈ యాంగిల్ ప్రేక్షకులను ఆకర్షించేలా ఉన్నా, పరంపరాగత భావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు అంటున్నారు. శివుడి లుక్‌పై నెటిజన్ల అసంతృప్తి సినిమాలో శివుడి రూపాన్ని కొంత మంది ట్రోలింగ్ చేస్తున్నారు.
సగమై చెరిసగమై పాటపై మిశ్రమ స్పందన ఈ పాట కన్నప్ప, అతని భార్య మధ్య ప్రేమను చూపించేందుకు ప్రయత్నించింది. కానీ, దీనిపై కొన్ని విమర్శలు ఉన్నాయి పాటలో భాషా శైలి ఇరు పెదవుల శబ్దం విరి ముద్దుల యుద్ధం లాంటి పదాలు చాలామందికి అసహ్యంగా అనిపించాయి. కోయగూడాలకు చెందిన ఆలుమగలు ఇలా మాట్లాడతారా? అనే ప్రశ్న తలెత్తింది. అంతేకాకుండా, ఇది ఒక ప్రేమ పాటలా కనిపిస్తోందే కానీ, కన్నప్ప కథకి సముచితంగా ఉందా? అనే డౌట్స్ కూడా వచ్చాయి. హీరో, హీరోయిన్ ముద్దు సన్నివేశంపై రచ్చ పాటలో హీరో ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. ఇది భక్తి సినిమా కదా ఇలా లిప్ లాక్ లాంటి రొమాంటిక్ యాంగిల్స్ అవసరమా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇంకా వివాదంలో ‘కన్నప్ప’ – అభిమానుల సపోర్ట్ వివాదాలు ఒక వైపు పెరుగుతూనే ఉన్నా, మరో వైపు మంచు విష్ణు అభిమానులు మాత్రం సినిమాకి మద్దతు ఇస్తున్నారు. ఇది కొత్తగా చెప్పే ప్రయత్నం అందుకే కొంత మందికి ఇష్టపడడం లేదు అని విశ్లేషకులు అంటున్నారు. ప్రభాస్ లుక్ తేలిపోవడానికి కారణం విఎఫ్ఎక్స్ పని ఇంకా పూర్తి కాకపోవడమే అని అభిమానులు రక్షిస్తున్నారు. సినిమా వచ్చాకనే అసలైన నిజం తెలుస్తుంది అంటూ కొన్ని సినీ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. సినిమా విడుదల తర్వాతే అన్ని విషయాలు తేలతాయి. కానీ, ప్రస్తుతానికి ‘కన్నప్ప’ సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది.