సనాతన ధర్మానికి (Sanathana Dharmam)వ్యతిరేకంగా మాట్లాడినందుకు ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెదిరింపులు ఎదురయ్యాయి. తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్, కమల్ హాసన్ తల నరికేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రవిచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన సినీ వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది.
పోలీసులకు మక్కల్ నీది మయ్యం ఫిర్యాదు
రవిచంద్రన్ చేసిన బెదిరింపు వ్యాఖ్యల నేపథ్యంలో కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిచంద్రన్ వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టారు. ఈ వివాదం మరింత పెద్దది కాకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
వివాదానికి దారి తీసిన కమల్ వ్యాఖ్యలు
రవిచంద్రన్ బెదిరింపులకు ముందు, కమల్ హాసన్ (Kamal Hassan) సనాతన సిద్ధాంతాలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. “సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేసే ఆయుధం విద్య” అని కమల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలను రవిచంద్రన్‌తో సహా సనాతన ధర్మాన్ని పాటించేవారు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు బెదిరింపుల వరకు వెళ్ళింది. ఈ ఘటనపై రాజకీయ మరియు సినీ ప్రముఖులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Read Also : India – Pak War : భారత్ తో ఘర్షణ.. పాకిస్థాన్ కు భారీ నష్టం