విలక్షణ నటుడు, మక్కల్ నీది మయ్యం (MIM) పార్టీ అధినేత కమల్ హాసన్(Kamal Haasan)కు సొంత పార్టీ కార్యకర్తల నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో వేదికపైనే సొంత పార్టీ కార్యకర్తలపై అసహనం వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త వేదికపైకి వచ్చి కమల్(Kamal Haasan)కు కత్తిని బహుకరించాడు. అనంతరం ఆ కత్తిని చేతితో పట్టుకుని పైకెత్తాలంటూ, ఆయన చేతికి ఇచ్చేందుకు ఒత్తిడి చేశాడు. తొలుత కూల్‌గా నిరాకరించిన కమల్.. కార్యకర్త ఒత్తిడి చేయడంతో సహనం కోల్పోయారు. ఈ అనూహ్య పరిణామంతో వేదికపై గందరగోళం నెలకొంది. అనంతరం అదే వేదికపై ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని సదరు వ్యక్తులను బలవంతంగా వేదిక మీద నుంచి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..
మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ సమావేశం
చెన్నైలో మక్కల్ నీది మయ్యం పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ చీఫ్, నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) విచ్చేశారు. తమిళనాడు నుంచి రాజ్యసభకు కమల్ హాసన్ ఏకగ్రీవంగా ఎన్నికైన కొద్ది రోజుల తర్వాత చెన్నైలో ఈ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు.
గిఫ్ట్‌గా కత్తి..?
బహిరంగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం జరుగతున్న సమయంలో వేదికపైగా కొందరు కార్యకర్తలు చేరుకుని ఆయనకు ఓ భారీ కత్తిని బహూకరించారు. మొదట నవ్వుతూనే కత్తిని కమల్ స్వీకరించారు. అనంతరం వారు కత్తిని చేతితో పట్టుకోవాలని ఒత్తిడి చేశారు. తల అడ్డంగా ఊపుతూ సున్నితంగా తిరస్కరించడానికి ప్రయత్నించిన కమల్(Kamal Haasan).. మరో కార్యకర్త కత్తిని ఒరలో నుంచి తీసి కమల్ చేతికి బలవంతంగా అందించబోయాడు.

దీంతో సహనం కోల్పోయిన కమల్.. కత్తిని కిందపెట్టాలంటూ హెచ్చరించారు. ఆ తర్వాత కూడా కమల్ హాసన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు వారు ఆసక్తి చూపగా.. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు కార్యకర్తను నిలువరించి, వేదికపై నుంచి కిందకి దింపేశారు.
కమల్ ఆగ్రహం – వేదికపై గందరగోళం
కొద్ది నిమిషాల పాటు వేదికపై గందరగోళం నెలకొన్నప్పటికీ అనంతరం మళ్లీ యథాస్థితికి చేరుకుని, నిర్వహకులను కార్యక్రమం కొనసాగించమని కమల్ (Kamal Haasan) నవ్వుతూ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కమల్‌కు కత్తిని బహుకరిస్తే ఎందుకు కోపం వచ్చిందో? అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. మనం కత్తి కాదు మన చేతిలో పుస్తకం, పెన్ను పట్టుకోవాలి. కమల్ ఇతరుల మాదిరిగా కత్తిని ఎత్తి ఫోటోలకు ఫోజులు ఇవ్వవచ్చు. ఆయన అలా చేయలేదు. ఆయన మంచి రాజకీయ నాయకుడు అంటే మరో నెటిజన్ కామెంట్ సెక్షన్‌లో పేర్కొన్నాడు.
సంఘటనపై విశ్లేషణ
కమల్ హాసన్ (Kamal Haasan) సినీ జీవితంలో వివిధ హింసాత్మక పాత్రలు చేసినా, వాస్తవ జీవితం మాత్రం విలక్షణంగా ఉంది. వివేచన, బాధ్యతతో వ్యవహరించిన నేతగా అభినందనలు. MNM పార్టీకి ఇది కొత్త భద్రతా దృష్టాంతంగా నిలవవచ్చు. ఈ సంఘటన కమల్ హాసన్ (Kamal Haasan) వ్యక్తిత్వాన్ని, ప్రజాప్రతినిధిగా ఉన్న నైతికతను బలంగా బయటపెట్టింది. హింసాపూరిత ప్రదర్శనకు వ్యతిరేకంగా స్పందించిన కమల్ తీరుపై అభిమానులు, నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలకు ఇది ఒక గుణపాఠంగా మారవచ్చు.
Read Also: Sriharikota: శ్రీహరికోటలో ఉగ్రవాదులు ఉన్నారంటూ బెదిరింపు