ఇటీవల పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రమైన స్పందన ఇచ్చారు.మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.ప్రవీణ్ మరణంపై తాను మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఇవే ఇప్పుడు నిజమవుతున్నాయని తెలిపారు.మార్చి 24 రాత్రి 9.30కి ప్రవీణ్ తన భార్యతో మాట్లాడాడని చెప్పారు.

ఆ సమయంలో అతడు విజయవాడలో ఉన్నాడని తెలిపారు.అంతకంటే రెండు గంటల వ్యవధిలో రాజమండ్రికి ఎలా వచ్చాడని ప్రశ్నించారు.“నాకున్న సైరన్ వాహనంతోనూ రాజమండ్రికి మూడు గంటలు పడుతుంది,” అని అన్నారు.అలాంటిది ప్రవీణ్ గంటన్నరకే అక్కడికి ఎలా చేరుకున్నాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.ప్రవీణ్‌ను చెడుగా చిత్రీకరిస్తూ, తాగాడు, పడిపోయాడు అనేలా ప్రచారం చేయడం దారుణమని అన్నారు.అతడి గౌరవాన్ని గాయపరచడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేఏ పాల్ మాట్లాడుతూ, తనకి ఉన్న శక్తులు, హక్కులు, దేవుడిపై నమ్మకాన్ని గుర్తు చేశారు. “నా పవర్స్ నాకు తెలుసు. నా దేవుడు నాతో ఉన్నాడు. నాకు తూటా పట్టిన వాళ్లు బూడిదయ్యారు,” అని అన్నారు.అంతేకాదు, “ఇందులో రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. “ట్రంప్ కూడా నా మాట విన్నాడు. ఇప్పుడతడు నా వెనకాల నిలిచాడు,” అని గర్వంగా చెప్పారు.ప్రవీణ్ మరణం వెనుక నిజం బయటపడే వరకు తాను పోరాటం చేస్తానని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
READ ALSO : Akhilesh Yadav : ట్రంప్ నుంచి మోదీ నేర్చుకోవాలి: అఖిలేశ్ యాదవ్