Justice Sanjiv Khanna as the next senior judge of the Supreme Court

సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు తదుపరి ఉన్నత న్యాయమూర్తిగా సీనియర్ జడ్జి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును..ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సిఫార్సు చేశారు. దీంతో తదుపరి సీజేగా సంజీవ్ ఖన్నానే నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జస్టిస్ చంద్రచూడ్ సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపితే..సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులవుతారు.నవంబర్ 11న జస్టిస్ డి.వై.చంద్రచూడ్ పదవీ విరమణ పొందనున్న విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం దగ్గర పడటంతో సంజీవ్ ఖన్నా పేరును తదుపరి చీఫ్ జస్టిస్‌గా కేంద్రానికి ప్రపోజ్ చేశారు.

ఇక కేంద్రం ఆమోదించడమే తదుపరి.అదే జరిగితే నవంబర్ 12న సంజీవ్ ఖన్నా సీజేగా బాధ్యతలు తీసుకుంటారు. సుప్రీంకోర్టు సీజేఐ రూల్స్ ప్రకారం ప్రకారం..కొత్త సీజేఐ పేరును లేఖ ద్వారా కేంద్ర న్యాయశాఖకు పంపుతారు. అక్కడి నుంచి ప్రధానమంత్రి పరిశీలనకు వెళ్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతికి చేరుకుని..చివరిగా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆ పదవిలో ఉన్న సీజేఐ కొత్త సీజే పేరును సిఫార్సు చేయడం అనవాయితీగా వస్తోంది.

కాగా, 2022 డిసెంబర్‌ 17న సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌.. నవంబర్‌ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజేఐ పేరును సూచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం సీజేఐకి లేఖరాసింది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రస్తుతం అత్యంత సీనియర్‌ జడ్జిగా ఉన్న జస్టిస్‌ ఖన్నా పేరును సీజేఐ సూచించినట్టు సమాచారం.

Related Posts
నా సోషల్ మీడియా ఖాతాల నిర్వహణ మహిళలకే :మోదీ
ప్రధాని మోదీ శుభవార్త: తన సోషల్ మీడియా ఖాతాలను మహిళలకే అప్పగిస్తానంటూ ప్రకటన

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా శక్తికి తన మద్దతును ప్రకటించారు. ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మహిళా Read more

మాజీ సీఎం కేసీఆర్‌కు లీగల్ నోటీసులు..!
Legal notices to former CM KCR.

హైదరాబాద్‌: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరైంది Read more

‘కక్షసాధింపు రాజకీయాల’పై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Jaggareddy's key comments o

కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కక్షసాధింపు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కక్షసాధింపు రాజకీయాలు ఏ పార్టీకి లేదా ప్రభుత్వానికి మంచివి కావని, ఆ పద్ధతి తరువాత Read more

ప్రొద్దుటూరులో నేడు సీఎం రేవంత్, చిరంజీవి
revanth

రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులో నేడు ప్రత్యేక వేడుక జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ప్రముఖ సినీనటుడు చిరంజీవి కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. Read more