అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కారణం, సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆడియో క్లిప్. అందులో ఎమ్మెల్యే ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనితో ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.వార్తల ప్రకారం, దగ్గుపాటి ప్రసాద్ వార్ 2 సినిమా ప్రత్యేక షోకు హాజరయ్యారని, ఆ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడని ప్రచారం సాగింది. ఈ వార్తలతో పాటు సోషల్ మీడియాలో ఒక ఆడియో కూడా షేర్ అవ్వడంతో మరింత హడావుడి మొదలైంది. ఎన్టీఆర్ అభిమానులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న
అయితే, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ దీనిపై స్పందిస్తూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. తాను జూనియర్ ఎన్టీఆర్‌పై ఎప్పుడూ అసభ్య వ్యాఖ్యలు చేయలేదని, ఆడియో పూర్తిగా నకిలీదని చెప్పారు. తనను కించపరిచే ఉద్దేశ్యంతోనే కొందరు కావాలనే ఇలా ఫేక్ ఆడియోలు క్రియేట్ చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసాద్ (Daggubati Prasad) మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు నారా, నందమూరి కుటుంబాలంటే ఎంతో అభిమానం. జూనియర్ ఎన్టీఆర్ను నేను చాలా గౌరవిస్తాను. అలాంటిది నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడటం ఏంటి. ఈ విషయంలో ఆయన అభిమానులు అపార్థం చేసుకుని ఉంటే నన్ను క్షమించాలి’ అని తెలిపారు. ఈ విషయమై ఇప్పటికే తాను జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని తెలిపారు.

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి
తనపై అసత్య ప్రచారం చేస్తోన్న నకిలీ వీడియోలు, ఆడియోలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.ఇదిలా ఉంచితే నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఒక ఆడియ తెగ హల్చల్ చేసింది. దీనిలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను అసభ్య పదజాలంతో దూషించినట్లుగా ఉంది. ఆయన సినిమా ప్రదర్శిస్తే.. తగలబెడతానని బెదిరించినట్లుగా ఆడియోలో ఉంది. ఇది కాస్త జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. అయితే ఆ ఆడియోలన్నీ తప్పుగా క్రియేట్ చేసినవి అని.. వీటి ద్వారా తనను రాజకీయంగా దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆయన మండి పడ్డారు. ప్రజలు ఇలాంటి నకిలీ ప్రచారాలను నమ్మవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు
ఎన్టీటీఆర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తోన్న ఆడియో వైరల్ కావడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడ ఉద్రిక్తత సృష్టించారు. అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకున్న అభిమానులు.. దగ్గుపాటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బయటకు వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు చేరుకుని అభిమానులను అడ్డుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన తేదీ ఎప్పుడు?
జూనియర్ ఎన్టీఆర్ 20 మే 1983 న హైదరాబాద్‌లో జన్మించారు.
జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు ఏమిటి?
జూనియర్ ఎన్టీఆర్ అసలు పేరు నందమూరి తారక రామారావు.
Read hindi news: hindi.vaartha.com
Read also: