ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తరువాత, జనాలు మేలైన ఆహార పదార్థాలపై దృష్టిపెడుతున్నారు. ముఖ్యంగా ఊబకాయం, మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు పెరిగిన నేపథ్యంలో, పుట్టిన మట్టిలో పెరిగే ధాన్యాలకు తిరిగి ప్రాధాన్యం వస్తోంది. అందులో ముందువరుసలో నిలుస్తున్నది జొన్న. ఈ ధాన్యం ద్వారా తయారయ్యే జొన్న రొట్టెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
జొన్నరొట్టె తింటే కలిగే ప్రయోజనాలు
ఎముకలకు బలం
జొన్నలో అధికంగా ఉండే కాల్షియం మరియు ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వయస్సుతో కలిగే ఎముకల నరాలు, ఆస్తీయోపోరోసిస్ వంటివి నివారించేందుకు ఇది సహాయపడుతుంది.

మధుమేహ నియంత్రణలో సహాయకం
జొన్న గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఈ ధాన్యం శరీరంలో చక్కెరలు నెమ్మదిగా విడుదలవ్వడం వల్ల, మధుమేహ వ్యాధిగ్రస్తులకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. 2017లో జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, జొన్న రొట్టెలు తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ రోగుల్లో గ్లూకోజ్ స్థాయిలు గణనీయంగా తగ్గినట్టు తేలింది. జొన్న రొట్టెల్లో ఉండే అధిక ఫైబర్ మడిపిపడే ఆహారాన్ని అందిస్తుంది. ఇది పొట్ట నిండిన ఫీలింగ్ ఇస్తుంది. ఆవిధంగా అదనపు తినే అలవాటును తగ్గిస్తుంది. ముఖ్యంగా రాత్రిపూట భోజనంలో జొన్న రొట్టెలను చేర్చడం వల్ల ఊబకాయం నియంత్రించవచ్చు.
గుండె ఆరోగ్యానికి రక్షణ కవచం
జొన్నలో ఉన్న ఫైటోకెమికల్స్ మరియు యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె జబ్బుల రిస్క్ తక్కువవుతుంది. బీపీ, హార్ట్ స్ట్రోక్, కార్డియో మైతాబాలిక్ రిస్క్స్ వంటి సమస్యలకు జొన్న రొట్టెలు ఉపశమనం కలిగిస్తాయి. జొన్నలోని విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ శరీరంలో వ్యాధులను ఎదుర్కొనే శక్తిని పెంచుతాయి. వాతావరణ మార్పుల సమయంలోనూ, వైరల్ ఫీవర్, జలుబు వంటివి దరిచేరకుండా నివారించవచ్చు. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, జీర్ణక్రియ సమర్థవంతంగా జరుగుతుంది.గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను నివారించేందుకు జొన్న రొట్టెలు ఉపశమనం కలిగిస్తాయి. జొన్నల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మంటలను తగ్గిస్తాయి. దీని వల్ల ఆర్థరైటిస్, స్కిన్ ఇన్‌ఫ్లమేషన్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. జొన్నలో ఉండే ప్రోటీన్, విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, కండరాల శక్తిని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఇవి శరీర కండరాలను బలంగా, చురుకుగా ఉంచుతాయి.

జొన్న రొట్టెలు తినడం వల్ల వచ్చే మార్పులు:
బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థ బలపడుతుంది, ఎముకలు బలంగా మారతాయి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది, శక్తి స్థాయి పెరుగుతుంది. జొన్న రొట్టెలు కేవలం ఓ ఆరోగ్యకర ఆహారం మాత్రమే కాదు, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల మిమ్మల్ని రక్షించే సహజ ఔషధం కూడా. రోజువారీ భోజనంలో వీటిని చేర్చుకోవడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, గుండె ఆరోగ్యం, మధుమేహం, జీర్ణవ్యవస్థ వంటి అనేక సమస్యలపై సమగ్ర సమాధానం లభిస్తుంది. మీ జీవితశైలిలో ఈ చిన్న మార్పు, పెద్ద ఆరోగ్య ప్రయోజనాన్ని తీసుకురావచ్చు.
Read also: Brinjal: వంకాయ, పాలతో ఆరోగ్యానికి పొంచి ఉన్న ప్రమాదం