మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత జోగి రమేశ్ మరోసారి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడ తాడిగడపలోని సీఐడీ కార్యాలయానికి ఉదయం ఆయన వచ్చారు. గతంలో దివంగత ఎన్టీఆర్ ఇంటిని తరలించాలన్న వాదనలపై, అలాగే 2021లో తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిగా జోగి రమేశ్‌పై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, తాజాగా ఆ కేసు విచారణను కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దర్యాప్తు బాధ్యతను సీఐడీకి బదిలీ చేసింది. ఈ క్రమంలో సీఐడీ అధికారుల నుంచి నోటీసులు అందుకున్న జోగి రమేశ్, ఇప్పటికే రెండు సార్లు విచారణకు హాజరై వివరాలు ఇచ్చారు. ఈరోజు మూడోసారి విచారణకు హాజరయ్యారు. సీఐడీ ఇచ్చిన నోటీసుల్లో, కేసుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని స్పష్టంగా పేర్కొన్నారు. దాడి జరిగిన సమయంలో అక్కడ ఎవరు ఉన్నారు? ఎవరి ఆధ్వర్యంలో ఆ ఘటన చోటు చేసుకుంది? అన్న దానిపై విచారణ కొనసాగుతోంది.
చంద్రబాబు ఇంటిపై దాడి కేసు నేపథ్యం
2021లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, తమ నిరసన తెలిపే క్రమంలో చంద్రబాబు ఇంటిముందు గందరగోళం సృష్టించారు. ఈ ఘటనలో జోగి రమేశ్ కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. ఆయన తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లి తీవ్ర స్థాయిలో నినాదాలు చేయడంతో పాటు, ఇంటి వద్ద అల్లర్లు సృష్టించారని ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ కేసు నమోదైనప్పటి నుంచి జోగి రమేశ్ బయట ఎక్కువగా కనిపించడం లేదు. మీడియా ముందుకు కూడా రావడం లేదు.
Read also: Andhrapradesh: విద్యార్థులను చెప్పుతో కొట్టిన టీచర్..స్పందించిన ఎంఈవో