స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా కానిస్టేబుల్ GD రిక్రూట్‌మెంట్ 2026 కోసం దరఖాస్తు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మొత్తం 25,487 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, ఆన్‌లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 31 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా సకాలంలో దరఖాస్తు చేసుకోవాలి.
Read also: Constable Recruitment: టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు..

SSC Jobs
ఈ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. భారతదేశవ్యాప్తంగా వివిధ కేంద్ర బలగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరగనుంది. చివరి తేదీ సమీపిస్తుండటంతో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, అభ్యర్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: