తపాలా శాఖ(Postal Department)లో భారీ ఉద్యోగ అవకాశాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా సుమారు 30 వేల గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామకాలు పూర్తిగా పది తరగతి మార్కుల ఆధారంగా, గ్రామ స్థాయిలో చేపట్టనున్నారు.
Read Also: Job Market: 2026లో ఉద్యోగ మార్కెట్‌కు బూస్ట్

అభ్యర్థుల వయస్సు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర రిజర్వేషన్ కేటగిరీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు వర్తిస్తుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగానే ఎంపిక జరగడం ఈ ఉద్యోగాలకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
బీపీఎం, ఏబీపీఎం పోస్టుల భర్తీకి ప్రకటన
గ్రామీణ డాక్ సేవక్(Gramin Dak Sevak) కేడర్‌లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం) పోస్టుకు నెలకు రూ.18,000 వరకు వేతనం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) పోస్టుకు నెలకు రూ.16,000 వరకు వేతనం చెల్లించనున్నారు. దరఖాస్తు ఫీజును రూ.100గా నిర్ణయించారు.
అర్హతలు, దరఖాస్తు విధానం, జిల్లాల వారీ ఖాళీల వివరాలు వంటి పూర్తి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నారు. నిరుద్యోగులకు ఇది మంచి అవకాశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: