దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పరిణామంగా నిరుద్యోగ రేటులో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం నవంబర్ నెలలో దేశ నిరుద్యోగ రేటు 4.7 శాతానికి పడిపోయింది. ఇది అక్టోబర్‌లో ఉన్న 5.2 శాతంతో పోలిస్తే గణనీయమైన తగ్గుదలగా అధికారులు పేర్కొన్నారు. ఈ స్థాయి గత ఎనిమిది నెలల్లో కనిష్ఠం కావడం గమనార్హం.
Read Also: Supreme Court: NHAIపై సుప్రీంకోర్టు ఆగ్రహం

పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) వివరాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి, పట్టణాల్లో 6.5 శాతానికి తగ్గింది. ముఖ్యంగా గ్రామాల్లో వ్యవసాయం, ఉపాధి హామీ పనులు, స్థానిక పరిశ్రమలలో పనుల సంఖ్య పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని అధికారులు తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లోనూ సేవల రంగం, చిన్నతరహా( PLFS) పరిశ్రమలు, నిర్మాణ రంగాల్లో ఉద్యోగాలు పెరగడం వల్ల నిరుద్యోగ రేటు తగ్గినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే మహిళల ఉద్యోగ భాగస్వామ్యం పెరగడం ఈ సానుకూల మార్పుకు మరో కీలక కారణంగా గుర్తించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి ప్రోత్సాహక పథకాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఈ ఫలితాలకు తోడ్పడుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటే రాబోయే నెలల్లోనూ ఉద్యోగ రంగంలో మరింత మెరుగుదల ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: