ఇండియన్ టెలికాం ఇండస్ట్రీస్ (ITI Jobs) సంస్థ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 215 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలో పని చేయాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం, గ్రాడ్యుయేట్ అర్హత ఉన్న పోస్టులకు నెలకు రూ.60,000 వరకు, టెక్నీషియన్ విభాగంలో నియమితులకు నెలకు రూ.35,000, అలాగే ఆపరేటర్ పోస్టులకు నెలకు రూ.30,000 వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులను ఒప్పంద కాలపరిమితిలో వివిధ యూనిట్లు, ప్రాజెక్ట్‌లలో పనిచేయించనున్నారు.
Read Also: Telangana: త్వరలోనే వైద్యశాఖలో 850 పోస్టుల భర్తీ ?

ఈ నియామకాలకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ట వయస్సు 35 సంవత్సరాలుగా నిర్ణయించారు. అర్హత, వయస్సు ప్రమాణాలు పూర్తిగా తీరిన వారు మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులుITI Jobsఅధికారిక వెబ్‌సైట్ itiltd.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, ఒప్పంద కాలపరిమితి వంటి పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: