డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్‌మెంట్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మొత్తం 764 పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also: NEET UG 2026: MBBS సీట్ల సంఖ్య పెంచే యోచనలో NMC

వయో పరిమితి, అర్హతలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు(Govt Jobs) చేయాలంటే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు చెందిన వారికి వయస్సులో సడలింపు ఉంటుంది. పోస్టును బట్టి డిప్లొమా, బీఎస్సీ, బీఎల్‌ఐఎస్‌సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, టెన్త్ లేదా ఐటీఐ ఉత్తీర్ణత అర్హతగా నిర్ణయించారు.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక టైర్–1, టైర్–2 రాత పరీక్షలతో పాటు ట్రేడ్ టెస్ట్ ఆధారంగా జరుగుతుంది. పరీక్షల్లో ప్రతిభ చూపినవారిని తుది ఎంపికకు పరిగణనలోకి(Govt Jobs) తీసుకుంటారు. ఆసక్తి గల అభ్యర్థులు నిర్ణీత గడువులోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం సంబంధిత జాబ్స్ కేటగిరీని పరిశీలించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: