ప్రసార భారతి సంస్థ కాపీ రైటర్ మరియు కాపీ ఎడిటర్ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో 3 కాపీ ఎడిటర్ పోస్టులు, 2 కాపీ రైటర్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 09, 2026. కంటెంట్ రచన, ఎడిటింగ్ రంగాల్లో అనుభవం ఉన్నవారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
Read also: TG: ఇంజినీర్ పోస్టుల భర్తీ.. BEL నోటిఫికేషన్ విడుదల

Copywriter Jobs
అర్హతలు మరియు దరఖాస్తు వివరాలు
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. హిందీ భాషలో మంచి ప్రావీణ్యం ఉండటంతో పాటు సంబంధిత రంగంలో కనీసం ఐదేళ్ల పని అనుభవం అవసరం. ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ప్రసార భారతి అధికారిక వెబ్‌సైట్ prasarbharati.gov.in ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: