బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI)లో 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి సోమవారం చివరి తేదీగా బ్యాంకు ప్రకటించింది. పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత అర్హతలు కలిగి ఉండాలి. అభ్యర్థులు డిగ్రీతో పాటు CA, CFA, CMA–ICWA, లేదా MBA/PGDBM అర్హతను కలిగి ఉండాలి. కొన్నిపోస్టులకు సంబంధిత రంగంలో పని అనుభవం కూడా తప్పనిసరి.
Read also: TG TET: ఈరోజు నుంచి తెలంగాణ టెట్

సెలక్షన్ ప్రాసెస్ & జీతభత్యాలు
ఈ పోస్టులకు రాతపరీక్ష లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు కనీసం రూ.93,960 నుంచి గరిష్టంగా రూ.1,20,940 వరకు వేతనం అందించనున్నారు. సాధారణ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులకు రాయితీతో రూ.175 మాత్రమే వసూలు చేయనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: