RBI Jobs: పదో తరగతి పూర్తి చేసిన యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించే మంచి అవకాశం లభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా అటెండెంట్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 572 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు కనీస విద్యార్హతగా పదో తరగతిని నిర్ణయించగా, అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.
Read Also: KVS Jobs: కేంద్రీయ విద్యాలయాల్లో 987 పోస్టులు

ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ పరిస్థితులు తీవ్రంగా ఉండటంతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ గణనీయంగా పెరిగింది. చాలా సందర్భాల్లో కనీస అర్హత ఉన్న ఉద్యోగాలకు కూడా ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేయడం వల్ల పదో తరగతితోనే చదువు ముగించిన వారికి అవకాశాలు తగ్గుతున్నాయి. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న ఆర్బీఐ, తాజా నోటిఫికేషన్‌లో ఒక కీలక నిబంధనను చేర్చింది.
పదో తరగతి ఉత్తీర్ణులే అర్హులని స్పష్టం
అటెండెంట్ పోస్టులకు కేవలం పదో తరగతి ఉత్తీర్ణులే అర్హులని స్పష్టం చేస్తూ, గ్రాడ్యుయేషన్ లేదా అంతకన్నా ఎక్కువ విద్యార్హతలు కలిగినవారిని ఈ నియామకాలకు అనర్హులుగా ప్రకటించింది. ఈ నిర్ణయం ద్వారా తక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
రిజర్వేషన్ నిబంధనల ప్రకారం
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అయితే, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు చేసుకునే రాష్ట్రం లేదా ప్రాంతానికి చెందిన స్థానిక భాషను అభ్యర్థులు స్పష్టంగా మాట్లాడగలగాలి. అదేవిధంగా చదవడం, రాయడం కూడా వచ్చి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు ఫిబ్రవరి 24 లోగా దరఖాస్తు చేయాలి. దరఖాస్తు రుసుముగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులు రూ.50 (జీఎస్టీ అదనం) చెల్లించాలి. ఇతర వర్గాల అభ్యర్థులు రూ.450 (జీఎస్టీ అదనం) ఫీజుగా ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: