ప్రస్తుతం కార్పొరేట్ లోకం మాంద్యం కంటే ఎక్కువగా ‘లే-ఆఫ్’ భయం తో నిండింది. ఒక ఈ-మెయిల్ లేదా ఫోన్ కాల్ తో ఉద్యోగులు అకస్మాత్తుగా తొలగించబడుతున్నారు. 40 ఏళ్లు దాటిన తర్వాత ఉద్యోగం కోల్పోవడం అంటే కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఇంటి రుణాలు, పిల్లల చదువులు, తల్లిదండ్రుల వైద్య ఖర్చులు అన్నీచూసుకోవాలి. అనుభవం 20 ఏళ్లైనా, ‘రోల్ రేషనలైజేషన్’ పేరుతో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నారు.
Read also: Postal Jobs: 28,740 తపాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్

Employees fear layoffs by the age of 40
మధ్య వయసులో కార్పొరేట్ ఒత్తిడి
40 ఏళ్లకు పైగా వయసు కలిగిన ఉద్యోగులు కొత్త ఉద్యోగం పొందడంలో పెద్ద సవాలు ఎదుర్కొంటున్నారు. కొత్త సాంకేతికత, మల్టీ-టాస్క్ అవసరాలు, మరియు యువ ఉద్యోగుల పోటీ వల్ల అవకాశం తక్కువ. ఉద్యోగ భద్రత తగ్గడం వల్ల మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. కుటుంబం, భవిష్యత్తు, ఆర్థిక భద్రతపై డొక్కా పడుతుంది.
భారతదేశంలో సామాజిక భద్రత అవసరం
భారతదేశంలో మధ్య వయసు ఉద్యోగులకు మద్దతు ఇవ్వడానికి సామాజిక భద్రతా వ్యవస్థలు తక్కువ. ఉద్యోగం కోల్పోవడం అంటే ఆదాయం రాకుండా, కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్య ఖర్చులు అన్నీ కష్టమవుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: