हिन्दी | Epaper

IBPS Clerk Mains Results: IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల

Tejaswini Y
IBPS Clerk Mains Results: IBPS క్లర్క్ మెయిన్స్ ఫలితాలు విడుదల

IBPS Clerk Mains Results: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది కీలకమైన అప్‌డేట్. ఐబీపీఎస్ (IBPS) క్లర్క్/కస్టమర్ సర్వీస్ అసోసియేట్ (CRP CSA-XV) మెయిన్స్ పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. గత ఏడాది నవంబర్ 29న జరిగిన మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను ఇప్పుడు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

Read Also: DRDO Recruitment 2026: డీఆర్డీఓలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

IBPS Clerk Mains Results: IBPS Clerk Mains Results Released
IBPS Clerk Mains Results Released

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ని సందర్శించాలి.
  • లాగిన్ పేజీలో మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా రోల్ నంబర్ నమోదు చేయండి.
  • తర్వాత మీ పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని (DOB) ఎంటర్ చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 15,684 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తమ స్కోరును సరిచూసుకోగలరు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870