Jobs in Multipurpose Health Assistant: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ – MPHW (ఫీమేల్) ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (MHSRB) మొత్తం 1,931 పోస్టులకు సంబంధించి రెండో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను అధికారికంగా విడుదల చేసింది. అభ్యర్థుల ప్రతిభ, రిజర్వేషన్లు మరియు ఇతర నియమావళుల ఆధారంగా 1:1.25 నిష్పత్తిలో అభ్యర్థులను ఈ జాబితాలో షార్ట్‌లిస్ట్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలను MHSRB అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వైద్య శాఖలో ఖాళీల భర్తీ వేగవంతం కావడం పట్ల అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also ; ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 291 ఉద్యోగాలకు నోటిఫికేషన్

సెప్టెంబర్ 16 నుండి ధృవపత్రాల పరిశీలన: త్వరలోనే తుది ఎంపిక జాబితా
షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు సెప్టెంబర్ 16 నుండి 26 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ (ధృవపత్రాల పరిశీలన) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమ విద్యార్హతలు, కుల, స్థానికత, వయోపరిమితి మరియు అనుభవ ధృవపత్రాల ఒరిజినల్ ప్రతిపత్రాలతో నిర్ణీత కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వెంటనే ఫైనల్ మెరిట్ లిస్ట్ మరియు తుది ఎంపిక జాబితా (Selection List) ను విడుదల చేసి త్వరలోనే నియామక పత్రాలను అందజేస్తామని బోర్డు స్పష్టం చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :