JK Flood Disaster : జమ్మూకశ్మీర్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాంబాన్ జిల్లాలో క్లౌడ్‌బరస్ట్ సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గల్లంతయ్యారు. (JK Flood Disaster) రియాసి జిల్లా మహోర్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మరణించారు. వరదలతో ఇళ్లు కొట్టుకుపోయి, పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సహాయక బృందాలు సంఘటనాస్థలికి చేరుకుని శోధన చర్యలు కొనసాగిస్తున్నాయి.
మరోవైపు వాతావరణ శాఖ శని, ఆదివారాల్లో పూంఛ్, జమ్మూ, రాంబాన్, ఉధంపుర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండచరియలు విరిగే ప్రదేశాలకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి రహదారులు దెబ్బతిన్నాయి. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే మచైల్ మాతా యాత్రలో పాల్గొన్న యాత్రికులపై ఇటీవల మేఘవిస్ఫోటం సంభవించడంతో యాత్ర తాత్కాలికంగా నిలిపివేయబడింది.

Read also :